Road Accident: రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని మాల్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాగార్జునసాగర్ రహదారి పై కారును బస్సు ఢీకొట్టిన ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. మృతులను మహబూబ్ నగర్ కు చెందిన సాయితేజ, పవన్, రాఘవేంద్రగా గుర్తించారు. వీరంతా ఉద్యోగాలు చేస్తూ హైదరాబాద్ లో నివాసముంటున్నారు. అర్ధరాత్రి తిరుగు ప్రయాణంలో మాల్ వద్ద వీరి కారును బస్సు ఢీకొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Road Accident: కారును ఢీకొట్టిన బస్సు.. ముగ్గురి మృతి
Road Accident: నాగార్జునసాగర్ రహదారి పై కారును బస్సు ఢీకొట్టిన ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.