Homeజాతీయ వార్తలుTamil Nadu election results : రేపే తమిళనాడు ఎన్నికల ఫలితాలు.. విజయ్ కింగ్ మేకర్...

Tamil Nadu election results : రేపే తమిళనాడు ఎన్నికల ఫలితాలు.. విజయ్ కింగ్ మేకర్ కాబోతున్నాడా..

Tamil Nadu election results : దేశవ్యాప్తంగా ఇప్పుడు నెటిజెన్స్ వెస్ట్ బెంగాల్ , తమిళనాడు ఎన్నికల ఫలితాల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి కొద్దీ గంటల్లోనే ఈ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ మొదలు అవ్వబోతుంది. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ లో ఈసారి ఎవరు గెలవబోతున్నారు అనేది స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. TMC పార్టీ ని గద్దె దించి, బీజేపీ పార్టీ అధికారం లోకి రావాలని చాలామంది బలంగా కోరుకుంటున్నారు. ఇక తమిళనాడు విషయానికి వస్తే […]

Tamil Nadu election results : దేశవ్యాప్తంగా ఇప్పుడు నెటిజెన్స్ వెస్ట్ బెంగాల్ , తమిళనాడు ఎన్నికల ఫలితాల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి కొద్దీ గంటల్లోనే ఈ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ మొదలు అవ్వబోతుంది. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ లో ఈసారి ఎవరు గెలవబోతున్నారు అనేది స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. TMC పార్టీ ని గద్దె దించి, బీజేపీ పార్టీ అధికారం లోకి రావాలని చాలామంది బలంగా కోరుకుంటున్నారు. ఇక తమిళనాడు విషయానికి వస్తే ఎగ్జిట్ పోల్స్ అత్యధిక శాతం DMK పార్టీ నే మరోసారి అధికారం లోకి రాబోతుందని అంటున్నాయి. కానీ ఇండియన్ యాక్సిస్ సర్వే మాత్రం తమిళ హీరో విజయ్ స్థాపించిన TVK పార్టీ అధికారం లోకి వస్తుందని అంటూ ఒక సంచలన సర్వే రిపోర్టు విడుదల చేసింది. ఇండియన్ యాక్సిస్ సర్వే సంస్థ కు కాస్త క్రెడిబిలిటీ ఉన్న విషయం వాస్తవమే.

కానీ TVK పార్టీ ఏకంగా అధికారం లోకి రాబోతుంది అంటూ ప్రకటించడం నిజంగా అందరినీ షాకింగ్ కి గురి చేసింది. ఇంకో పాపులర్ సర్వే సంస్థ కామాఖ్యా మూడు పార్టీలకు చెరో 30 శాతం ఓటింగ్ నమోదు అవుతుందని, TVK సపోర్టు తోనే ఎదో ఒక పార్టీ అధికారం లోకి వస్తుందని , విజయ్ కింగ్ మేకర్ అవ్వబోతున్నాడంటూ సర్వే రిపోర్టు ఇచ్చింది. ఇక మిగిలిన సర్వేలు అయితే విజయ్ TVK ని అసలు లెక్కలోకి తీసుకోలేదు. ఆ పార్టీ కి కేవలం 10 నుండి 15 స్థానాలు మాత్రమే వస్తాయని చెప్పుకొచ్చాయి. కొన్ని సర్వే సంస్థలు అయితే అసలు విజయ్ కి ఒక్క సీట్ కూడా వచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పాయి. ఇలా విభిన్నమైన సర్వే ఫలితాలు వచ్చిన సందర్భంగా , ఎవరు అధికారం లోకి రాబోతున్నారు అనేది ఇక్కడ కూడా చెప్పలేకపోతున్నారు. విజయ్ కింగ్ అవుతాడా?, లేదా కింగ్ మేకర్ అవుతాడా?.

ఈ రెండు కాకుండా ఆయన ప్రధానంగా ఎవరి ఓటు షేర్ ని చీల్చి ఉంటాడు?, విజయ్ కారణంగా DMK కి దెబ్బ పడుతుందా , లేదంటే AIDMK కి దెబ్బ పడుతుందా ? , ఇలా గత నెల రోజులుగా సోషల్ మీడియా లో సాగిన చర్చలకు మరి కొద్దిగంటల్లోనే తెరపడనుంది. రేపు ఉదయం తెల్లవారుజాము నుండి కౌంటింగ్ మొదలు అవ్వబోతుంది. విజయ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ని ఒకవేళ భారీ లెవెల్ లో చీల్చి ఉండుంటే మాత్రం DMK పార్టీ రికార్డు లెవెల్ సీట్లతో అధికారం లోకి వచ్చి కూర్చుంటుంది. వాస్తవానికి అయితే AIDMK కి బలమైన లీడర్ ఒక్కరు కూడా లేరు , ఇలాంటి పరిస్థితి చిరంజీవి , పవన్ కళ్యాణ్ లకు ఉండుంటే ఏకంగా సీఎం అయిపోయేవారు , మరి విజయ్ ఎక్కడ దాకా వస్తాడో చూడాలి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper