Homeజాతీయ వార్తలుMamata Banerjee: బిస్వా బంగ్లా.. బెంగాల్ మీద మమత ఇంత కుట్ర చేశారా..

Mamata Banerjee: బిస్వా బంగ్లా.. బెంగాల్ మీద మమత ఇంత కుట్ర చేశారా..

Mamata Banerjee: ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారికి సొంత రాష్ట్రం మీద విపరీతమైన ప్రేమ ఉండాలి. ఓటు వేసి గెలిపించిన ప్రజల మీద అపారమైన గౌరవం ఉండాలి. మాతృభూమి అభివృద్ధి కోసం రకరకాల పనులు చేయాలి. అలాంటివారు జనాల్లో ఉండిపోతారు. జనాల మదిలో శాశ్వతంగా నిలిచిపోతారు. కానీ కొంతమంది అధికారంలోకి రాకముందు మాతృ భూమిని ప్రేమిస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ద్వేషాన్ని పెంచుకొని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. చివరికి జనాలు వద్దని ఓడిస్తే.. తలవంచుకుంటారు. ఇప్పుడు ఈ పరిస్థితి పశ్చిమ […]

Mamata Banerjee: ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారికి సొంత రాష్ట్రం మీద విపరీతమైన ప్రేమ ఉండాలి. ఓటు వేసి గెలిపించిన ప్రజల మీద అపారమైన గౌరవం ఉండాలి. మాతృభూమి అభివృద్ధి కోసం రకరకాల పనులు చేయాలి. అలాంటివారు జనాల్లో ఉండిపోతారు. జనాల మదిలో శాశ్వతంగా నిలిచిపోతారు. కానీ కొంతమంది అధికారంలోకి రాకముందు మాతృ భూమిని ప్రేమిస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ద్వేషాన్ని పెంచుకొని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. చివరికి జనాలు వద్దని ఓడిస్తే.. తలవంచుకుంటారు. ఇప్పుడు ఈ పరిస్థితి పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వచ్చింది.

బెంగాల్ రాష్ట్రాన్ని 15 సంవత్సరాల పాటు మమత బెనర్జీ పరిపాలించారు.. 15 సంవత్సరాల కాలంలో మమత ఎంత చేయాలో అంత చేశారు. మెజారిటీ ప్రజల మనోభావాలను దెబ్బతీశారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు తెర లేపారు. చివరికి తాను ముఖ్యమంత్రిగా ఉన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఔన్నత్యాన్ని కూడా దెబ్బతీశారు. ఇప్పుడు బిజెపి ప్రభుత్వం ఆ మూలాలను తొలగిస్తోంది. శుభ్రమైన బెంగాల్ రాష్ట్రాన్ని నిర్మిస్తోంది. ఒక ముక్కలో చెప్పాలంటే బెంగాల్ రాష్ట్రంలో స్వచ్ఛభారత్ చేస్తోంది.

మమత బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బిస్వా బంగ్లా అనే లోగోను ఏర్పాటు చేశారు. దీనిని రాష్ట్ర చిహ్నంగా ప్రకటించారు. 2013 సెప్టెంబర్ 16న బిస్వా బంగ్లా బ్రాండ్ లోగోను మమత మొదలుపెట్టారు. బి అనే బెంగాలీ అక్షరం చుట్టూ సంస్కృతి.. సంప్రదాయాలు.. చేతి వృత్తులకు ప్రాతినిధ్యం కల్పించే విధంగా ఈ లోగో రూపొందించారు. పశ్చిమ బెంగాల్లో మమత పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ లోగో అధికారిక బ్రాండింగ్ చిహ్నంగా ఉండేది.

బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ లోగో స్థానంలో కొత్త లోగోను తెచ్చారు.. మన దేశ జాతీయ చిహ్నమైన అశోక స్తంభాన్ని ఆ లోగో స్థానంలో ఏర్పాటు చేస్తున్నారు. బెంగాల్ రాష్ట్రంలో ఉన్న సాల్ట్ లేక్ స్టేడియంలో బిస్వా బంగ్లా లోగోను తొలగించి దాని స్థానంలో జాతీయ చిహ్నాన్ని అమర్చారు. అయితే ఇది ఇక్కడితోనే ఆగిపోలేదు.. బెంగాల్ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విభాగాలలో ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ డిజిటల్ వేదికలలో కూడా దీనిని ఏర్పాటు చేస్తున్నారు. బిజెపి ప్రభుత్వం ఈ లోగోలో తెలుపు, నీలం రంగుల స్థానంలో కాషాయం రంగును జత చేసింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper