Homeఎంటర్టైన్మెంట్Mamata Banerjee: 15 ఏళ్లల్లో 1.69 కోట్లు... అడ్డంగా దొరికిపోయిన మమతా బెనర్జీ..

Mamata Banerjee: 15 ఏళ్లల్లో 1.69 కోట్లు… అడ్డంగా దొరికిపోయిన మమతా బెనర్జీ..

Mamata Banerjee: వెస్ట్ బెంగాల్లో బిజెపి ప్రభుత్వం దూకుడుగా అడుగులు వేస్తోంది. 15 సంవత్సరాల టిఎంసి పరిపాలన తాలూకు మరకలను మొత్తం తూడ్చి వేయడానికి లక్షల లీటర్ల ఫినాయిల్ వాడుతోంది. ఇప్పటికే ప్రక్షాళన మొదలుపెట్టిన సుబేందు అధికారి.. అక్రమాలను బయట పెడుతోంది. అవినీతి లో పాలు పంచుకున్న అధికారుల మీద.. రాజకీయ నాయకుల మీద కేసులు పెడుతోంది. ఏకంగా కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు విచారణ సాగిస్తున్నారు. దీంతో ప్రతిరోజు జాతీయ మీడియాలో బెంగాల్ పతాక శీర్షికలో […]

Mamata Banerjee: వెస్ట్ బెంగాల్లో బిజెపి ప్రభుత్వం దూకుడుగా అడుగులు వేస్తోంది. 15 సంవత్సరాల టిఎంసి పరిపాలన తాలూకు మరకలను మొత్తం తూడ్చి వేయడానికి లక్షల లీటర్ల ఫినాయిల్ వాడుతోంది. ఇప్పటికే ప్రక్షాళన మొదలుపెట్టిన సుబేందు అధికారి.. అక్రమాలను బయట పెడుతోంది. అవినీతి లో పాలు పంచుకున్న అధికారుల మీద.. రాజకీయ నాయకుల మీద కేసులు పెడుతోంది. ఏకంగా కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు విచారణ సాగిస్తున్నారు. దీంతో ప్రతిరోజు జాతీయ మీడియాలో బెంగాల్ పతాక శీర్షికలో ఉంటోంది.

మమత బెనర్జీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బెంగాల్ రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు, దారుణాలు, దోపిడీలు మాత్రమే కాదు.. అంతకుమించి జరిగాయి. వ్యవస్థల నాశనం నిరాటకంగా సాగిపోయింది. కొంతమంది అధికారులు.. రాజకీయ నాయకులు ఇష్టానుసారంగా వ్యవహరించారు. బెంగాల్ రాష్ట్రాన్ని తమ సొంత సామంత రాజ్యంగా మార్చుకున్నారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ దేశస్థులకు ఆధార్ కార్డులు.. ఇతర ద్రువీకరణ పత్రాలు అందించారు. వాటి ద్వారా వారు మన దేశంలో ఓటు హక్కు పొందారు. ఈ మాత్రమే కాకుండా కుల దృవీకరణ పత్రాల జారీ విషయంలో కూడా మమత ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరించిందని వార్తలు వస్తున్నాయి. దీనిపై బీజేపీ ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జారీ చేసింది.

మమత అధికారంలో ఉన్నప్పుడు మొత్తం 1.69 కోట్ల కుల ధ్రువీకరణ పత్రాలను జారీ చేశారు. వాటిని పరిశీలించాలని ముఖ్యమంత్రి సుబేందు అధికారి. ఆదేశాలు జారీ చేశారు. మమత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రిజర్వేషన్ల అమలు సానుకూలంగా జరగలేదని.. బిజెపి పదేపదే ఆరోపించింది. ఇప్పుడు అధికారంలోకి రాగానే ప్రక్షాళన మొదలుపెట్టింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 2011 నుంచి 2026 వరకు దాదాపు 1.69 కోట్ల కుల దృవీకరణ పత్రాలు జారీ అయ్యాయి. వీటిలో కోటి వరకు షెడ్యూల్డ్ కులాల ద్రోపత్రాలు ఉన్నాయి. 48 లక్షల కుల దృవీకరణ పత్రాలు ఓబిసి కేటగిరికి చెందినవి ఉన్నవి. 21 లక్షల కుల దృవీకరణ పత్రాలు షెడ్యూల్డ్ తెగలకు సంబంధించినవి ఉన్నవి. ఇంత భారీ ఎత్తున కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడం పట్ల అవకతవకలు జరిగి ఉంటాయని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం భావిస్తుంది. వీటన్నింటినీ కూడా జాగ్రత్తగా పరిశీలించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఒకవేళ కుల ధ్రువీకరణ పత్రాల జారీ విషయంలో ఏవైనా అక్రమాలు జరిగి ఉంటే వాటిని రద్దు చేస్తారు. అధికారుల పాత్ర ఉంటే చర్యలు తీసుకుంటారు. అర్హత లేకుండా ప్రభుత్వ ప్రయోజనాలు పొందితే కచ్చితంగా చర్యలు తీసుకుంటారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper