HomeజాతీయంTVK Vijay: విజిల్ పోడు కాదు..తమిళ ఓటర్లు నేల చూపించారు..సారీ టీవీకే విజయ్

TVK Vijay: విజిల్ పోడు కాదు..తమిళ ఓటర్లు నేల చూపించారు..సారీ టీవీకే విజయ్

TVK Vijay: తమిళనాడు రాష్ట్రంలో రాజకీయాలు చాలా భిన్నంగా ఉంటాయి. అయితే డిఎంకె లేదా అన్నా డీఎంకే అధికారంలోకి రావడం అక్కడ పరిపాటి. పైగా ద్రావిడ వాదం లేకుండా అక్కడి రాజకీయాలు సాగవు. నాయకులు కూడా నిత్యం పెరియార్ పేరును స్మరిస్తూ ఉంటారు. కాకపోతే ఆయన విధానాలకు చరమగీతం పాడుతూ ఉంటారు. ఎన్నికల సమయం వరకు ద్రావిడ వాదాన్ని.. హిందీ వ్యతిరేక వాదాన్ని వినిపిస్తూ ఉంటారు. ఆ తర్వాత తమ స్వార్ధ రాజకీయాలు చేసేస్తూ ఉంటారు. టీవీకే […]

TVK Vijay: తమిళనాడు రాష్ట్రంలో రాజకీయాలు చాలా భిన్నంగా ఉంటాయి. అయితే డిఎంకె లేదా అన్నా డీఎంకే అధికారంలోకి రావడం అక్కడ పరిపాటి. పైగా ద్రావిడ వాదం లేకుండా అక్కడి రాజకీయాలు సాగవు. నాయకులు కూడా నిత్యం పెరియార్ పేరును స్మరిస్తూ ఉంటారు. కాకపోతే ఆయన విధానాలకు చరమగీతం పాడుతూ ఉంటారు. ఎన్నికల సమయం వరకు ద్రావిడ వాదాన్ని.. హిందీ వ్యతిరేక వాదాన్ని వినిపిస్తూ ఉంటారు. ఆ తర్వాత తమ స్వార్ధ రాజకీయాలు చేసేస్తూ ఉంటారు.

టీవీకే అధినేత విజయ్ రాక ముందు తమిళనాడు రాజకీయాలలో ఒకరకమైన విధానాలు సాగుతూ ఉండేవి. ద్రావిడ విధానానికి అక్కడ ఎదురు అనేది లేకుండా ఉండేది. కానీ ఇప్పుడు విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తమిళనాడు రాజకీయాలు పూర్తిగా మారిపోతున్నాయి. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాలలో ఇటీవల కాలంలో తీవ్రస్థాయిలో ఉత్కంఠ రేపిన మధురాంతకం.. దారాపురం అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉపాయం ఎన్నికల్లో ముఖ్యమంత్రి విజయ్ ఆధ్వర్యంలోని తమిళగ వెట్రి కళగం పార్టీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. అన్న డీఎంకే పార్టీకి సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలను అత్యంత వ్యూహాత్మకంగా తన పార్టీలోకి ఆహ్వానించింది. అంతేకాదు వారితో శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా చేయించింది. మళ్లీ వారి చేత పార్టీ అభ్యర్థులుగా బరిలోకి దింపింది. ఈ ప్రయోగంలో విజయ్ నూటికి 100% మార్పులు సాధించారు. వాస్తవానికి ఇది మామూలు విజయం లాగానే రాజకీయ విశ్లేషకులు అంచనా వేయడం లేదు. కాకపోతే వచ్చిన ఫలితాలు అధికార టీవీకే క్యాంపుకు దారుణమైన హెచ్చరికలు పంపుతున్నాయి. విజయ్ మేనియా అదరగొడుతుందని.. ఆయనకు తిరుగు లేదని విశ్లేషణలు వస్తున్న నేపథ్యంలో.. ఉప ఎన్నికల మాత్రం భారీ మెజారిటీ సాధ్యం కాలేదు. ఏకపక్ష ఓటు బ్యాంకు నమోదు కాలేదు.

విజయ్ పార్టీ అభ్యర్థులు గెలిచినప్పటికీ మెజారిటీ మాత్రం పది నుంచి 15 వేల ఓట్ల స్వల్ప తేడాతో మాత్రమే. రెండు స్థానాల్లోనూ డీఎంకే తిరుగులేని పోటీ ఇచ్చింది. ఏకంగా రెండో స్థానంలో నిలిచింది. అన్న డీఎంకే మూడో స్థానంలో ఉండిపోవాల్సి వచ్చింది. డీఎంకే మిత్ర పక్షాలు విజయ్ వైపు ఉన్నాయి. రెండు చోట్ల కూడా డీఎంకే.. అన్న డీఎంకే ఓట్లు కలిపితే విజయ్ అభ్యర్థికి వచ్చిన ఓట్లు దాదాపు 40 వేలకు పైగా ఉన్నాయి. రాష్ట్రంలో సాంప్రదాయ ద్రావిడ ఓటు బ్యాంకు డీఎంకే, అన్నా ఎంకే మధ్య చీలిపోవడం వల్లే టీవీకే అభ్యర్థులు విజయం సాధించగలిగారు. ఒకవేళ రెండు ద్రావిడ పార్టీలు గనుక ఏకమై ఉంటే.. టీవీ కేకు దారుణమైన ఫలితం వచ్చేది.

వాస్తవానికి ఉప ఎన్నికల ఫలితాలు ప్రభుత్వ పరిపాలనకు గీటురాయి అంటుంటారు. శాసనసభలో సాధరణ మెజారిటీకి కాస్త దూరంగా ఉన్న కూటమి.. ఈ రెండు స్థానాల్లో గెలవడం ద్వారా గౌరవాన్ని పదిలం చేసుకుంది. ఒకవేళ ఓడిపోయి ఉంటే రాష్ట్రంలో అధికార ప్రభుత్వానికి ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడేది. విజయ్ కి బీభత్సమైన ఓటు బ్యాంకు ఉందని.. ఆయనకు తిరుగు లేదని క్షేత్రస్థాయిలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఈ ఫలితాల ద్వారా తేలిపోయింది. టివి కే తరఫున పోటీ చేసిన అభ్యర్థులకు స్థానికంగా బలం ఉంది. ద్రావిడ పార్టీల ఓటు బ్యాంకు చీలిపోయింది. అందువల్లే టివి కేకు విజయం సాధ్యమైంది.

ఈ రెండు స్థానాలలో జరిగిన పోటీ తమిళనాడు రాజకీయాలలో సరికొత్త ముఖచిత్రాన్ని ఆవిష్కరిస్తుంది. కేవలం సినిమా గ్లామర్.. స్టార్ ఇమేజ్ మాత్రమే ఓట్లు తెచ్చి పెట్టవని.. ఆ భ్రమ నుంచి విజయ్ బయటపడాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు విజయ్ కి కాస్త శిరోభారాన్ని తగ్గించినప్పటికీ అది తాత్కాలికం మాత్రమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.. వచ్చే కాలంలో ద్రావిడ పార్టీలు ఏకమైతే విజయ్ ఆ రాజకీయ సవాల్ ఎదుర్కోవడం దాని మీదే ఆయన రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper