Homeజాతీయ వార్తలుAbhishek Banerjee: అధికారంలోకి వస్తే బాడీలు లెక్కబెట్టుకోవాలి అన్నాడు.. చివరికి మమత అల్లుడు రాళ్ల దెబ్బలు...

Abhishek Banerjee: అధికారంలోకి వస్తే బాడీలు లెక్కబెట్టుకోవాలి అన్నాడు.. చివరికి మమత అల్లుడు రాళ్ల దెబ్బలు తిన్నాడు..

Abhishek Banerjee: కర్మ అనేది ఒకటి ఉంటుంది. మనం పువ్వులు విసిరిస్తే పువ్వులనే ఇస్తుంది. రాళ్లు విసిరేస్తే తల పగలగొడుతుంది. అందుచేత ఏం చేయాలనేది మన చేతిలో ఉంది. అలాంటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. అధికారంలో ఉన్నాడు కాబట్టి.. 15 సంవత్సరాలు తను షాడో సీఎం కాబట్టి.. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్ బెనర్జీ ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. తను ఒక రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించాడు.. బెంగాల్లో తను […]

Abhishek Banerjee: కర్మ అనేది ఒకటి ఉంటుంది. మనం పువ్వులు విసిరిస్తే పువ్వులనే ఇస్తుంది. రాళ్లు విసిరేస్తే తల పగలగొడుతుంది. అందుచేత ఏం చేయాలనేది మన చేతిలో ఉంది. అలాంటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. అధికారంలో ఉన్నాడు కాబట్టి.. 15 సంవత్సరాలు తను షాడో సీఎం కాబట్టి.. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్ బెనర్జీ ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. తను ఒక రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించాడు.. బెంగాల్లో తను చెప్పింది వేదం. తన గీసిందే గీత. తాను అన్నదే శాసనం.

ఎన్నికల్లో గెలిచేందుకు.. ఎన్ని అడ్డదారులు తొక్కాలో అన్నింటిని తొక్కేశాడు అభిషేక్ బెనర్జీ. అత్తకు మించిన రాక్షసుడి లాగా వ్యవహరించాడు. వ్యవస్థలను మొత్తం తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. పోలీస్ వ్యవస్థను మొత్తం తన బంట్రోత్ వ్యవహారం లాగా మార్చేశాడు. చివరికి కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు రాష్ట్రంలోకి వస్తే వారి మీద దాడులు చేయించాడు. చికెన్ నెక్ దారి విషయంలో కూడా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కు స్థలాలు.. అధికారాలు ఇవ్వకుండా అత్త మమతతో అడ్డు పుల్ల వేయించాడు. 15 సంవత్సరాలుగా ఇలానే చేశాడు.

చివరికి ఇటీవల ఎన్నికల్లో ఓ ప్రచార సభలో మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత బిజెపి నాయకులను ఉద్దేశించి మీ బాడీలను లెక్క పెట్టుకోవాలని హెచ్చరికలు జారీ చేశాడు. చంపుకుంటూ వెళ్లిపోతామని.. తొక్కుకుంటూ అధికారాన్ని దక్కించుకుంటామని స్పష్టం చేశాడు. ఇలాంటి పొగరు మాటలు సహించలేక బెంగాల్ ప్రజలు బిజెపికి అధికారాన్ని కట్టబెట్టారు. అంతేకాదు ఇంకొకసారి అభిషేక్ బెనర్జీని కనిపిస్తే తొక్కేస్తామంటూ నినాదాలు చేశారు. అభిషేక్ బెనర్జీ మీద బెంగాల్ ప్రజలు దాడులు చేశారు. రాళ్లతో కొట్టారు. దీంతో అతడు బతుకు జీవుడా అనుకుంటూ అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అతడికి చికిత్స అందించేందుకు ఏ ఆసుపత్రి కూడా ముందుకు రాలేదు. ప్రజలు ఇప్పటికీ టీఎంసీ నేతల మీద ఆగ్రహాన్ని చల్లార్చుకోలేదు. కనిపిస్తే చాలు వెంటపడి కొడుతున్నారు. 15 సంవత్సరాలుగా తాము అనుభవించిన బాధను ఇలా తీర్చుకుంటున్నారు. రాహుల్ గాంధీ లాంటి నెత్తి మాసిన ప్రతిపక్ష నాయకుడు ఈ దాడులను ప్రజాస్వామ్యంలో జరుగుతున్న దారుణాలు అంటూ విమర్శిస్తున్నాడు. కానీ ఇదే బెంగాల్ రాష్ట్రంలో 15 సంవత్సరాలుగా ప్రజలు పడిన బాధలు.. చేసిన దాడులు.. జరిగిన హత్యల గురించి రాహుల్ గాంధీ ఏనాడు నోరు విప్పలేదు. పైగా మమతా బెనర్జీ ఓటమిని ఎన్నికల సంఘం చేసిన మాయగా అభివర్ణించాడు. ఇటువంటి వ్యక్తి ప్రధానమంత్రి కాలేడు. బిజెపిని కేంద్రం లో అధికారానికి దూరం చేయలేడు. ఇదంతా కాంగ్రెస్ చేసుకున్న కర్మ.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper