Kerala former CM raids : కమ్యూనిస్టు పార్టీలు తరచూ తమను తాము అవినీతి రహిత రాజకీయాలకు ప్రతీకలుగా ప్రదర్శించుకుంటాయి. అయితే కేరళలో జరిగిన తాజా పరిణామాలు ఈ వాదనలపై మరోసారి చర్చకు దారితీశాయి. మాజీ ముఖ్యమంత్రి, సీపీఎం సీనియర్ నేత పినరయి విజయన్‌కు సంబంధించిన కుటుంబ సభ్యులపై విచారణ జరిపేందుకు అధికారులు వెళ్లిన సమయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
సోదాల కోసం వచ్చిన అధికారులను సీపీఎం కార్యకర్తలు అడ్డుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా అధికారులపై దాడి చేయడంతో పాటు అక్కడ పార్క్ చేసిన కొన్ని వాహనాలను ధ్వంసం చేసిన ఘటన వివాదాస్పదంగా మారింది. చట్టపరమైన ప్రక్రియను అడ్డుకోవడం, ప్రభుత్వ అధికారులపై దాడికి దిగడం వంటి అంశాలపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.
“కమ్యూనిస్టులు అవినీతి చేయరు.. వారి కుటుంబాలపై దర్యాప్తు చేయడానికి ఎవరికీ హక్కు లేదు” అన్నట్టుగా వ్యవహరించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆరోపణలు ఎదురైనప్పుడు చట్టపరమైన విచారణకు సహకరించాల్సింది పోయి, దర్యాప్తు బృందాలపై దాడులు జరగడం ఆందోళనకరమని పేర్కొంటున్నారు.
ఈ ఘటన కేరళ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. అవినీతి ఆరోపణలు ఎవరి మీద వచ్చినా చట్టం తన పని తాను చేసుకోవాల్సిందేనని, రాజకీయ పార్టీలు లేదా నాయకులు చట్టానికి అతీతులు కాదని ప్రతిపక్ష నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
కేరళలో మాజీ ముఖ్యమంత్రి ఇంటి సోదాలు, అధికారులపై దాడి ఘటనపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో వీక్షించవచ్చు.
