Homeక్రీడలుక్రికెట్‌Kavya Maran father and Ishan Kishan argument: సన్ రైజర్స్ ఓటమి.. కావ్య మారన్...

Kavya Maran father and Ishan Kishan argument: సన్ రైజర్స్ ఓటమి.. కావ్య మారన్ తండ్రి, ఇషాన్ కిషన్ మధ్య పెద్ద వాగ్వాదం.. బ్యాన్ తప్పదా

Kavya Maran father and Ishan Kishan argument: ప్లే ఆఫ్ మ్యాచ్లో రాజస్థాన్ జట్టుతో హైదరాబాద్ తలపడుతున్నప్పుడు.. 240 మించిన పరుగులను ఛేదించాల్సి వచ్చినప్పుడు.. అభిషేక్ శర్మ 0 పరుగులకే అవుట్ అయ్యాడు. ఆ సమయంలో హైదరాబాద్ అభిమానులకు పెద్దగా ఇబ్బంది లేదు. ఎందుకంటే క్రీజులో ఇషాన్ కిషన్ ఉన్నాడు కాబట్టి చాలామందికి జట్టు గెలుస్తుందని నమ్మకం ఉంది. పైగా కిషన్ కూడా జోప్రా ఆర్చర్ బౌలింగ్ లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టాడు. ఆ […]

Kavya Maran father and Ishan Kishan argument: ప్లే ఆఫ్ మ్యాచ్లో రాజస్థాన్ జట్టుతో హైదరాబాద్ తలపడుతున్నప్పుడు.. 240 మించిన పరుగులను ఛేదించాల్సి వచ్చినప్పుడు.. అభిషేక్ శర్మ 0 పరుగులకే అవుట్ అయ్యాడు. ఆ సమయంలో హైదరాబాద్ అభిమానులకు పెద్దగా ఇబ్బంది లేదు. ఎందుకంటే క్రీజులో ఇషాన్ కిషన్ ఉన్నాడు కాబట్టి చాలామందికి జట్టు గెలుస్తుందని నమ్మకం ఉంది. పైగా కిషన్ కూడా జోప్రా ఆర్చర్ బౌలింగ్ లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టాడు. ఆ తర్వాత ఒక ఫోర్ కూడా కొట్టాడు. ఆ తదుపరి బంతికి క్యాచ్ అవుట్ అయ్యాడు.

కిషన్ అలా అవుట్ కావడంతో మైదానంలో ఉన్న అభిమానులు మొత్తం ఆవేదనకు గురయ్యారు. హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య మారన్ అయితే దాదాపు ఏడ్చినంత పనిచేసింది. ఎందుకంటే కిషన్ అవుట్ కావడంతో మ్యాచ్ స్వరూపం పూర్తిగా మారిపోయింది. అప్పటిదాకా రాజస్థాన్ జట్టుకు మించి స్కోర్ చేసిన హైదరాబాద్.. ఆ తర్వాత ఒత్తిడిలో కూరుకుపోవడం మొదలైంది. కిషన్ అవుట్ అయిన తర్వాత హెడ్ కూడా పెవిలియన్ దారిపట్టాడు. క్లాసెన్ కూడా అవుట్ అయ్యాడు. దీంతో హైదరాబాద్ జట్టు ఓటమిపాలైంది.

హైదరాబాద్ జట్టు ఓటమి పాలు కావడానికి అభిమానులు మాత్రమే కాదు.. జట్టు ఓనర్ కావ్య మారన్ తండ్రి కళానిధి మారన్ కూడా జీర్ణించుకోలేకపోతున్నాడు. మైదానంలో మ్యాచ్ జరుగుతున్నప్పుడు తీవ్ర ఆవేదనలో కనిపించిన అతడు.. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆవేశంలో మైదానంలోకి వచ్చాడు. ఇషాన్ కిషన్ తో మ్యాచ్ గురించి చర్చించాడు..

ఈ సందర్భంగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది. కిషన్ ఆట తీరు పట్ల కళానిధి మారన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. కిషన్ అవుట్ కావడం వల్ల మ్యాచ్ స్వరూపం మారిపోయిందని.. హైదరాబాద్ జట్టు గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోయిందని కళానిధి మారన్ ఆవేదన వ్యక్తం చేసినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఆ ఫోటోలు కనిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇంతవరకు అధికారికంగా కిషన్ స్పందించలేదు. సన్రైజర్స్ యాజమాన్యం కూడా ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే ఇది ఏదైనా దుష్ప్రచారమా.. మరొకటా అనేది తేలాల్సి ఉంది. ఏఐ ఫోటోలు ద్వారా కూడా ఇటువంటి ప్రచారం ఇటువంటి ఇటీవలి కాలంలో పెరిగిపోయిందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. అలాంటప్పుడు అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని చెబుతున్నారు.

ఈ విషయం బీసీసీఐ కి తెలిసినట్టు సమాచారం. దీంతో సన్రైజర్స్ యాజమాన్యానికి జరిమానా విధించే అవకాశం ఉంది. అంతేకాదు కిషన్ ఒక మ్యాచ్ ఆడకుండా నిషేధం విధిస్తారని తెలుస్తోంది. అయితే దీనిపై పూర్తి వివరాలు మరికొద్ది రోజుల్లో తెలుస్తాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper