Homeఎంటర్టైన్మెంట్Peddi Closing Collections : 'పెద్ది' వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్.. కలెక్షన్స్ అదిరిపోయాయి.. కానీ...

Peddi Closing Collections : ‘పెద్ది’ వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్.. కలెక్షన్స్ అదిరిపోయాయి.. కానీ నష్టాలు తప్పలేదు..

Peddi Closing Collections : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన నటించిన ‘పెద్ది’ మూవీ బాక్స్ ఆఫీస్ రన్ దాదాపుగా ముగిసింది. ఎల్లుండి నుండి ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. విడుదలైన మొదటి రోజు మొదటి ఆట నుండే ఈ చిత్రానికి ఆడియన్స్ నుండి అద్భుతమైన టాక్ వచ్చింది. మధ్యలో కొంతమంది ఆడియన్స్ ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ నెగెటివిటీ పెంచినప్పటికీ కూడా వసూళ్లు ఆగలేదు. నాన్ […]

Peddi Closing Collections : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన నటించిన ‘పెద్ది’ మూవీ బాక్స్ ఆఫీస్ రన్ దాదాపుగా ముగిసింది. ఎల్లుండి నుండి ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. విడుదలైన మొదటి రోజు మొదటి ఆట నుండే ఈ చిత్రానికి ఆడియన్స్ నుండి అద్భుతమైన టాక్ వచ్చింది. మధ్యలో కొంతమంది ఆడియన్స్ ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ నెగెటివిటీ పెంచినప్పటికీ కూడా వసూళ్లు ఆగలేదు. నాన్ స్టాప్ గా బాక్స్ ఆఫీస్ ని కుమ్ముతూనే ఉన్నింది ఈ చిత్రం. 32 వ రోజున కూడా ప్రధాన నగరాల్లో ఈ చిత్రం హౌస్ ఫుల్ బోర్డ్స్ ని నమోదు చేసుకుందంటే సాధారణమైన విషయం కాదు. ఓవరాల్ గా థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ప్రాంతాల వారీగా ఎంత షేర్ వసూళ్లు వచ్చాయి అనేది ఇప్పుడొకసారి చూద్దాం.

నైజాం ప్రాంతం లో 16 కోట్ల ఓపెనింగ్ తో మొదలైన ఈ చిత్రానికి 55 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లతో ముగిసింది. ఇది చాలా మంచి రన్ అనే చెప్పాలి , కానీ ఓపెనింగ్స్ ఇంకా బాగా వచ్చి ఉండుంటే , ఈ సినిమా క్లోజింగ్ ఇంకా పెద్దదిగా ఉండేదని అంటున్నారు. ఇక రామ్ చరణ్ కి కంచుకోటగా పిలవబడే రాయలసీమ ప్రాంతం లో ఆశించిన స్థాయి వసూళ్లు రాలేదు. 24 కోట్ల రూపాయలకు ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ని కొనుగోలు చేయగా, కేవలం 21 కోట్ల 26 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. అదే విధంగా ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి 23 కోట్ల 20 లక్షలు , ఈస్ట్ గోదావరి నుండి 13 కోట్ల రూపాయిలు , వెస్ట్ గోదావరి నుండి 9 కోట్ల 22 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

ఇక కృష్ణా జిల్లా నుండి 10 కోట్ల 39 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టగా, గుంటూరు జిల్లా నుండి 12 కోట్ల 76 లక్షలు , నెల్లూరు జిల్లా నుండి 6 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 150 కోట్ల రూపాయిల 80 లక్షల షేర్ వసూళ్లు , 234 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక నుండి 15 కోట్ల 30 లక్షల రూపాయిలు , తమిళనాడు + కేరళ నుండి 2 కోట్ల 40 లక్షలు , హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 12 కోట్ల 15 లక్షలు , ఓవర్సీస్ నుండి 23 కోట్ల 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా 205 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు 350 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ వరల్డ్ వైడ్ బిజినెస్ 220 కోట్ల రూపాయలకు జరగ్గా 15 కోట్ల నష్టం వాటిల్లింది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper