Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan Surgery : చేతి కట్టుతో హాస్పిటల్ బెడ్ పై పవన్ కళ్యాణ్.. కంటతడి...

Pawan Kalyan Surgery : చేతి కట్టుతో హాస్పిటల్ బెడ్ పై పవన్ కళ్యాణ్.. కంటతడి పెట్టిస్తున్న లేటెస్ట్ ఫోటోలు..

Pawan Kalyan Surgery : ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుడి భుజం సర్జరీ ని విజవంతంగా ముంబై లోని అంబానీ హాస్పిటల్ లో పూర్తి చేసుకున్నారు. పదేళ్ల క్రితం భుజాలకు జరిగిన గాయాల కారణంగా , ఆయన రొటేటర్ కఫ్స్ తీవ్ర స్థాయిలో దెబ్బ తిన్నాయని , తక్షణమే సర్జరీ అవసరమని డాక్టర్లు సూచించడంతో , పవన్ కళ్యాణ్ నిన్న సర్జరీ చేయించుకున్నారు. ముందుగా రెండు భుజాలకు ఒకేసారి సర్జరీ చేయించుకోవాలని పవన్ కళ్యాణ్ భావించారు , కానీ ఒకేసారి రెండు భుజాలకు సర్జరీ చేస్తే నొప్పి భరించలేని విధంగా ఉంటుందని చెప్పడంతో కుడి భుజానికి ముందుగా సర్జరీ చేశారు. రెండు నెలల తర్వాత ఎడమ భుజానికి కూడా సర్జరీ చేయనున్నారు. దీంతో ఎంతో కాలంగా పవన్ ని వెంటాడుతున్న సమస్యకు చెక్ పడనుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హాస్పిటల్ లోనే డాక్టర్ల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు.

అయితే నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాస్పిటల్ లో విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కళ్యాణ్ ని పరామర్శించేందుకు ముంబై కి వెళ్లారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి పై ఆరాలు తీసిన చంద్రబాబు , డాక్టర్లతో కూడా మాట్లాడారు. అందుకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియా లో ఇప్పుడు బాగా వైరల్ అయ్యింది. ఈ ఫొటోలో తమ ఆరాధ్య దైవం పవన్ కళ్యాణ్ పరిస్థితి ని చూసి , అభిమానులు తీవ్రమైన మనస్తాపానికి గురయ్యారు. పవన్ కళ్యాణ్ ని అలా హాస్పిటల్ బెడ్ పై చేతి కట్టుతో అసలు చూడలేకపోతున్నామని, ఇలాంటి ఫోటోలు బయటకు విడుదల చేయకపోతేనే మంచిదని , మా అభిమాన నాయకుడిని ఇలా చూడలేము అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరోపక్క సీఎం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పై చూపించిన ఆప్యాయత ని చూసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా ఎమోషనల్ అయిపోయారు.

ఆన్లైన్ , ఆఫ్లైన్ లో టీడీపీ , జనసేన కార్యకర్తల మధ్య ఏ రేంజ్ లో గొడవలు జరుగుతూ ఉంటాయో మనమంతా చూస్తూనే ఉంటాం. చంద్రబాబు , పవన్ కళ్యాణ్ మధ్య ఎంతటి మంచి సాన్నిహిత్యం ఉన్నప్పటికీ , కార్యకర్తలు మాత్రం గ్రౌండ్ లెవెల్ లో ఆ స్థాయి ఐకమత్యం తో లేరు. ఎన్నికల సమయం లో యూనిటీ గానే ఉంటారు కానీ , మిగిలిన సమస్యల్లో కయ్యానికి కాలు దూస్తుంటారు. కానీ పవన్ కళ్యాణ్ కి సర్జరీ జరిగితే , ఏకంగా సీఎం తన కార్యక్రమాలను మొత్తం రద్దు చేసుకొని ముంబై కి వెళ్లడం నిజంగా గుండెలను హత్తుకునే అంశం . మెగా ఫ్యామిలీ కూడా ఇప్పటి వరకు ముంబై కి వెళ్ళలేదు , అందరికంటే చంద్రబాబు నే ముందు వెళ్లారు. అన్నదమ్ములు లాగా కలిసి ఉన్నటువంటి వీళ్లిద్దరి మధ్య ప్రేమాభిమానాలు చూసిన తర్వాత కూడా కార్యకర్తలు ఐకమత్యం గా ఉండకపోతే ఇంకెందుకు చెప్పండి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular