Lenin OTT : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘లెనిన్’ కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి 12 ఏళ్ళు గడుస్తున్నా సరైన బ్లాక్ బస్టర్ లేక ఇబ్బంది పడుతున్న అఖిల్ కి , ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ కిక్ మామూలుది కాదు. థియేటర్స్ లోకి విడుదలైన మూడు రోజులకే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం తో అభిమానుల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. గర్వంగా వాళ్లంతా ‘అయ్యగారి నెంబర్ 1’ అంటూ నినాదాలు చేశారు. అలాంటి ఎన్నో ఎమోషనల్ మూమెంట్స్ ని అందించింది ఈ చిత్రం. మేకర్స్ కొద్దిరోజుల క్రితమే ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ మార్కుని దాటింది అంటూ పోస్టర్ ని విడుదల చేశారు కానీ , ట్రేడ్ విశ్లేషకుల లెక్క ప్రకారం అందులో ఎలాంటి నిజం లేదు.
వాళ్ళు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే ఇప్పటి వరకు ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 72 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. అయితే కొత్త సినిమాల రాకతో ‘లెనిన్’ థియేట్రికల్ రన్ దాదాపుగా ముగిసింది. దీంతో ఈ చిత్రాన్ని ఓటీటీ లో విడుదల చేసుకునేందుకు అనుమతి ఇచ్చారు మేకర్స్. విడుదలకు ముందు ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని మంచి ఫ్యాన్సీ రేటుకి ‘జీ5’ సంస్థ కి అమ్మేశారు. వాళ్ళతో కుదిరించుకున్న ఒప్పందం ప్రకారం ఈ చిత్రాన్ని నాలుగు వారాల తర్వాత ఓటీటీ lo విడుదల చెయ్యాలి. నాలుగు వారాలు పూర్తి అవ్వడం తో ఇప్పుడు ఈ చిత్రాన్ని ఈ నెల 7 న జీ 5 లో తెలుగు, హిందీ , తమిళం మరియు ఇతర ప్రాంతీయ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కాసేపటి క్రితమే జరిగింది.
ఒక స్పెషల్ ప్రోమో తో ఈ ప్రకటన చేసింది జీ 5 సంస్థ. అయితే ఒక్క విషయం గురించి మాత్రం కచ్చితంగా మాట్లాడుకోవాలి. ‘లెనిన్’ చిత్రం లోని కొన్ని సన్నివేశాలు థియేటర్ లో చూస్తేనే అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ , ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ సన్నివేశం వరకు ఆడియన్స్ కి ఈ సినిమా ఇచ్చిన థియేట్రికల్ అనుభూతి వేరే లెవెల్. మరి అదే రేంజ్ అనుభూతిని ఓటీటీ ఆడియన్స్ కి ఈ చిత్రం అందిస్తుందా లేదా అనేది చూడాలి. ఈ సినిమాలో భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్ గా నటించగా, శివాజీ , బ్రహ్మాజీ , ప్రమోద్, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రలు పోషించారు.