digital sim : భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ వినియోగం రోజురోజుకు పెరిగిపోతుంది. ఈ క్రమంలో మొబైల్ విషయంలో కొత్త సాంకేతికపై చాలా ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం మొబైల్ వినియోగదారులు పాత ప్లాస్టిక్ సిమ్ ను తీసేసి డిజిటల్ సిమ్ ను వేసుకుంటారు. అసలు ఈ సిమ్ కు, ఫిజికల్ సిమ్ కు ఉన్న వ్యత్యాసం ఏంటీ? వీటి వల్ల లాభ నష్టాలేంటి?
ఫిజికల్ సిమ్:
సాంప్రదాయకంగా దశాబ్దాలుగా మనం వాడుతున్న ప్లాస్టిక్ కార్డునే ఫిజికల్ సిమ్ అంటారు. దీనిని ఫోన్‌లోని ‘సిమ్ ట్రే’ లో ఇన్సర్ట్ చేస్తాం. ఫోన్ పాడైనా లేదా ఛార్జింగ్ ఐపోయినా.. ఈ సిమ్‌ను సులభంగా బయటకు తీసి మరొక ఫోన్‌లో వేసుకుని వాడుకునే వీలుంటుంది. ఇది ఇప్పటికీ భారత మార్కెట్‌లో అత్యధికంగా అందుబాటులో ఉంది. ఈ ఫిజికల్ సిమ్ అన్ని ఫోన్లకు సపోర్టు చేస్తుంది.
ఫిజికల్ సిమ్ తో ప్రయోజనాలు:
ఫిజికల్ సిమ్ ఫోన్ పాడైపోయినా.. లేదా కొత్త ఫోన్ లోకి మారాలన్నాసులభంగా ప్లాస్టిక్ సిమ్ తీసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో కొత్త సిమ్ తీసుకోవాలన్నా ఈజీ అవుతుంది. అయితే ప్రస్తుతంసైబర్ నేరాల క్రమంలో ఈ ప్లాస్టిక్ సిమ్ దుర్వనియోగం అవుతోంది.
ఈ-సిమ్:
eSIM (Embedded Subscriber Identity Module). ఇది ప్రత్యేకంగా బయట కనిపించదు. ఫోన్ మదర్‌బోర్డ్‌లోనే డిజిటల్‌గా ఉండే చిన్న చిప్. జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి టెలికాం ఆపరేటర్లు అందించే కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా దీనిని డిజిటల్‌గా యాక్టివేట్ చేసుకోవచ్చు.
ఈ-సిమ్ తో లాభాలు:
డిజిటల్ సిమ్ తో అదనపు భద్రత ఉంటుంది. ఫోన్ దొంగిలించబడితే, నేరస్థులు సాధారణ సిమ్ లాగా దీనిని బయటకు తీసి పడేయలేరు. ఫోన్ ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయి ఉన్నంత వరకు దొంగిలించిన ఫోన్‌ను ట్రాక్ చేయడం సులభం. ఒకే ఫోన్‌లో ఎన్నో సిమ్ లు వేసుకోవచ్చు. అవసరాన్ని బట్టి సెట్టింగ్స్‌లోనే ఆపరేటర్లను మార్చుకోవచ్చు. విదేశాలకు వెళ్లే వారికి అక్కడి స్థానిక నెట్‌వర్క్‌ల కోసం సిమ్ కార్డులు మార్చాల్సిన అవసరం లేదు.
అయితే భారతదేశంలో ప్రస్తుతం ఐఫోన్లు, శామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్, గూగుల్ పిక్సెల్ వంటి ప్రీమియం ఫోన్లలో మాత్రమే ఈ సదుపాయం ఎక్కువగా ఉంది. బడ్జెట్ ఫోన్లలో ఇది ఇంకా లభించడం లేదు. ఫోన్ పాడైపోయినా లేదా స్విచ్ఛాఫ్ అయినా సిమ్ తీసి వేరే ఫోన్‌లో వెంటనే వేయడం కుదరదు. మరొక ఫోన్‌లోకి మార్చడానికి కొత్త క్యూఆర్ కోడ్ పొందడం, యాక్టివేషన్ ప్రాసెస్ పూర్తి చేయడం తప్పనిసరి.