Pawan Kalyan new movie : పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రస్తుతం ‘ఓజీ 2’ మేనియా లో మునిగి తేలుతున్నారు . రీసెంట్ గానే ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతుందని అధికారిక ప్రకటన చేయడం తో , అభిమానుల ఆనందానికి హద్దులే లేకుండా పోయింది. సెప్టెంబర్ 2 న ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన చేసి, నవంబర్ నెల నుండి రెగ్యులర్ షూటింగ్ ని మొదలుపెట్టే పనిలో ఉన్నారని, పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఈ చిత్రం ఒక ల్యాండ్ మార్క్ గా నిలిచిపోతుందని అంటున్నారు ఫ్యాన్స్. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ ఇక సినిమాలు చేయకపోవచ్చు , పూర్తి స్థాయి ఫోకస్ పాలనపై పెడతాడేమో అని అంతా అనుకున్నారు. కానీ ఆయన ఈ సినిమాతో పాటు మరో సినిమాని కూడా ప్రారంభించే ఆలోచనలో ఉన్నాడట. ఈ చిత్రానికి మారుతీ దర్శకత్వం వహిస్తాడని టాక్.
రీసెంట్ గానే ‘రాజా సాబ్’ చిత్రం తో భారీ డిజాస్టర్ ఫ్లాప్ ని అందుకొని తీవ్రమైన ట్రోల్స్ ని ఎదురుకున్న ఆయన , రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ ని కలిసి ఒక కథ ని వినిపించాడని , అది ఆయనకు తెగ నచ్చేసిందని అంటున్నారు. ‘ఓజీ 2’ తో పాటు , సమాంతరంగా ఈ ప్రాజెక్ట్ ని కూడా ఆయన పట్టాలెక్కించబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో ఒక టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ వ్యవహరించబోతున్నాడు అట. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇదే కనుక నిజమైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో అని విశ్లేషకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పవన్ ఫ్యాన్స్ ప్రస్తుతం ఇలాంటి కాంబినేషన్స్ ని తీసుకునే పరిస్థితి లో లేరు. ఉస్తాద్ భగత్ సింగ్ తోనే ఇలాంటి కాంబినేషన్స్ ని ఆదిరించడం ఆపేశారు.
అలాంటిది ఇప్పుడు మారుతీ లాంటి ఫార్మ్ లో లేని డైరెక్టర్ తో సినిమా చేస్తే , పవన్ ఫ్యాన్స్ రియాక్షన్ చాలా వైల్డ్ గా ఉండొచ్చు. అయితే సోషల్ మీడియా లో ఇలాంటి వార్తలు రోజుకి ఒకటి పుట్టుకొస్తూనే ఉంటాయని , పవన్ కళ్యాణ్ కచ్చితంగా ఇలాంటి డైరెక్టర్స్ తో ఇప్పుడు సినిమాలు తీయడని, ఇదంతా ఫేక్ న్యూస్ అని కొంతమంది అభిమానులు అంటున్నారు. దీనిపై క్లారిటీ రావాలంటే , డైరెక్టర్ మారుతీ రెస్పాన్స్ ఇవ్వాల్సిందే.
