Homeఎంటర్టైన్మెంట్OG 2 Animation Video: 'ఓజీ 2' నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు...

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని సర్ప్రైజ్..

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి ‘ఓజీ 2’. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ఓజీ’ అనే గ్యాంగ్ స్టర్ డ్రామా , భారీ అంచనాల నడుమ గత ఏడాది విడుదలై , ఎలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. విడుదలకు ముందు ఈ సినిమాకు చూసినంత క్రేజ్ , హైప్ గతం లో ఏ సినిమాకు కూడా చూడలేదని , పవన్ కళ్యాణ్ మ్యాజిక్ లో యూత్ ఆడియన్స్ మునిగి తేలారని , విమర్శకులు సైతం చెప్పే మాటలు. ఓపెనింగ్స్ దగ్గర నుండి క్లోజింగ్ వరకు ప్రతీ ఒక్కటి పవన్ ఫ్యాన్స్ కి ఈ చిత్రం మధురమైన జ్ఞాపకాలను మిగిలించింది. అలాంటి చిత్రానికి సీక్వెల్ అంటే ఎలాంటి క్రేజ్ ఉంటుందో రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన తాలూకు ప్రకంపనలు ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు.

త్వరలోనే ‘ఓజీ 2’ ఉంటుంది అని పవన్ కళ్యాణ్ , సుజిత్ కలిసి మాట్లాడుకున్న వీడియో సోషల్ మీడియా లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎక్కడ చూసినా దీని గురించే చర్చించుకోవడం మొదలు పెట్టారు. ముఖ్యంగా ఆ వీడియో లో సుజిత్ డ్రాగన్ పెట్ గురించి మాట్లాడడం , దాని పై సోషల్ మీడియా లో ఫ్యాన్స్ ఎన్నో వేల ఎడిటింగ్స్ చేయడం వంటివి అభిమానులు ఇప్పటికీ మర్చిపోలేరు. ఇదంతా పక్కన పెడితే , సెప్టెంబర్ 2 న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కాబట్టి , ఈ చిత్రానికి సంబంధించి ఎదో ఒక అప్డేట్ కచ్చితంగా వస్తుందని అంతా అనుకున్నారు. అందరూ కోరుకున్నట్టే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ రాబోతుంది. ఇది సినిమా కాన్సెప్ట్ ని తెలిపేలా , యానిమేషన్ రూపం లో ఉంటుందని సమాచారం.

దీనికి సంబంధించిన వర్క్ ప్రస్తుతం చెన్నై లో జరుగుతోంది. త్వరలోనే ఫైనల్ ఔట్పుట్ సుజిత్ చేతుల్లోకి వెళ్లనుంది. కేవలం ప్రమోషనల్ కంటెంట్ తో హైప్ రప్పించడం సుజిత్ కి వెన్నతో పెట్టిన విద్య. ఈ సినిమాకు కూడా అదే చేయబోతున్నాడు. కానీ సుజిత్ పై ఒక చిన్న కంప్లైంట్ ఉంది , ప్రమోషనల్ కంటెంట్ లో చాలా చూపిస్తారు కానీ , సినిమాలో మాత్రం చెప్పినవి చూపించరు , ఈసారైనా సుజిత్ ని నమ్మొచ్చా లేదా అనే సందేహాలు అభిమానుల్లో , ప్రేక్షకుల్లో ఉన్నాయి. ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు నవంబర్ నుండి మొదలు కాబోతున్నాయట. వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో ఈ చిత్రాన్ని విడుదల చేసే ప్లాన్ లో ఉన్నట్టు సమాచారం.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Akhil Lenin Movie Release Date

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper