Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అభిమానులకు చేదు వార్త.. ఆ క్రేజీ మూవీ శాశ్వతంగా...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అభిమానులకు చేదు వార్త.. ఆ క్రేజీ మూవీ శాశ్వతంగా ఆగిపోయినట్టే..

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అభిమానులు ‘ఓజీ 2’ అప్డేట్స్ కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఒక స్పెషల్ వీడియో తో జరిగింది. ఇక సెప్టెంబర్ 2 న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం కాన్సెప్ట్ ని తెలుపుతూ ఒక యానిమేషన్ వీడియో ని కూడా విడుదల చేయబోతున్నారు. ఇలా ‘ఓజీ 2’ కి సంబంధించి సోషల్ మీడియా లో ప్రతీ […]

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అభిమానులు ‘ఓజీ 2’ అప్డేట్స్ కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఒక స్పెషల్ వీడియో తో జరిగింది. ఇక సెప్టెంబర్ 2 న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం కాన్సెప్ట్ ని తెలుపుతూ ఒక యానిమేషన్ వీడియో ని కూడా విడుదల చేయబోతున్నారు. ఇలా ‘ఓజీ 2’ కి సంబంధించి సోషల్ మీడియా లో ప్రతీ రోజు ఎదో ఒక అప్డేట్ వస్తూనే ఉంది. ఇదంతా బాగానే ఉంది కానీ , పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా పరిస్థితి ఏంటి ?. ఈ చిత్రం కోసం డైరెక్టర్ సురేందర్ రెడ్డి , వక్కంతం వంశీ చాలా పెద్ద హోమ్ వర్క్ చేశారు.

పవన్ కళ్యాణ్ కి స్క్రిప్ట్ న్యారేషన్ కూడా ఇచ్చారు సురేందర్ రెడ్డి. కానీ సెకండ్ హాఫ్ పవన్ కళ్యాణ్ కి పెద్దగా నచ్చకపోవడం తో కొన్ని మార్పులు , చేర్పులు చేయాల్సిందిగా సూచించారు. డైరెక్టర్ సురేందర్ రెడ్డి పవన్ సూచనలు మేరకు ఈ స్క్రిప్ట్ పై రీ వర్క్ కూడా మొదలు పెట్టారు. అందుకోసం ఆయన తన టీం తో కలిసి అమరావతి లో ఒక ఆఫీస్ ని తీసుకొని , రేయింబవళ్లు స్క్రిప్ట్ వర్క్ పై పని చేశారు. కానీ ఇంతలోపే ‘ఓజీ 2’ గురించి ప్రకటన రావడంతో , ఇక సురేంద్ర రెడ్డి తో సినిమా లేనట్టే అని ఫ్యాన్స్ చాలా మంది ఫిక్స్ అయిపోయారు. ఇక నేడు సురేందర్ రెడ్డి తన టీం తో ఏర్పాటు చేసుకున్న ఆఫీస్ ని కూడా అమరావతి లో ఖాళీ చేశారు. దీంతో ఈ సినిమా ప్రస్తుతానికి లేనట్టే అనే క్లారిటీ అందరికీ వచ్చేసింది.

అయితే ఈ సినిమా తాత్కాలికంగా హోల్డ్ లో పడిందా , లేదా భవిష్యత్తులో ఉంటుందా అనే దానిపై క్లారిటీ రావాలి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఫోకస్ మొత్తం ‘ఓజీ 2’ మీదనే ఉంది. రెగ్యులర్ గా ఆయన డైరెక్టర్ సుజిత్ , సంగీత దర్శకుడు తమన్ తో ఈ సినిమా పై చర్చలు జరుపుతూనే ఉన్నారు. ఈ ఏడాది నవంబర్ నుండి షూటింగ్ కార్యక్రమాలను మొదలు పెట్టేందుకు అన్ని విధాలుగా పవన్ కళ్యాణ్ సిద్ధం అవుతున్నారు. కాబట్టి సురేంద్ర రెడ్డి ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అనే దానిపై క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు. సెప్టెంబర్ 2 న ఏదైనా ఈ సినిమా నుండి అప్డేట్ వస్తే ఉన్నట్టు , లేదంటే ఆగిపోయినట్టే అనుకోవచ్చు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper