Homeఎంటర్టైన్మెంట్Nagarjuna : కొడుకు విజయం కోసం నాగార్జున ఇంత తపన పడ్డాడా.. ? కంటతడి పెట్టిస్తున్న...

Nagarjuna : కొడుకు విజయం కోసం నాగార్జున ఇంత తపన పడ్డాడా.. ? కంటతడి పెట్టిస్తున్న వీడియో..

ఏ తండ్రికైనా కొడుకు జీవితం లో విజయం సాధిస్తే పుత్రోత్సాహం ఏ రేంజ్ లో ఉంటుందో మాటల్లో చెప్పలేము. మీరు కూడా తండ్రి అయ్యి , మీ కొడుకు జీవితం లో సక్సెస్ అయితేనే ఆ అనుభూతి విలువ ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు అలాంటి అనుభూతి అక్కినేని నాగార్జున పొందుతున్నారు. అఖిల్ ఇండస్ట్రీ లోకి ఏ రేంజ్ హైప్ తో ఎంట్రీ ఇచ్చాడో అందరికీ తెలిసిందే. ఆయన మొదటి సినిమా ఓపెనింగ్ వసూళ్లు స్టార్ హీరో రేంజ్ […]

ఏ తండ్రికైనా కొడుకు జీవితం లో విజయం సాధిస్తే పుత్రోత్సాహం ఏ రేంజ్ లో ఉంటుందో మాటల్లో చెప్పలేము. మీరు కూడా తండ్రి అయ్యి , మీ కొడుకు జీవితం లో సక్సెస్ అయితేనే ఆ అనుభూతి విలువ ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు అలాంటి అనుభూతి అక్కినేని నాగార్జున పొందుతున్నారు. అఖిల్ ఇండస్ట్రీ లోకి ఏ రేంజ్ హైప్ తో ఎంట్రీ ఇచ్చాడో అందరికీ తెలిసిందే. ఆయన మొదటి సినిమా ఓపెనింగ్ వసూళ్లు స్టార్ హీరో రేంజ్ లో వచ్చాయి. అంతటి భారీ అంచనాల నడుమ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి డిజాస్టర్ ని అందుకున్నారు. ఆ తర్వాత వరుసగా డిజాస్టర్స్ మాత్రమే ఎదురయ్యాయి, ఒక్క ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రం మాత్రమే కమర్షియల్ గా ఎబోవ్ యావరేజ్ గా నిల్చింది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ ‘ఏజెంట్’ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు.

ఆ సినిమా కూడా డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇక అఖిల్ పని అయిపోయినట్టే అని అనుకుంటున్న సమయంలో విడుదలైన ‘లెనిన్’ చిత్రం మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. దీంతో ఓపెనింగ్స్ కూడా అదిరిపోయాయి. ఇక ఈ సందర్భంగా మూవీ టీం నేడు హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేశారు. ఈ సక్సెస్ మీట్ లో అక్కినేని నాగార్జున మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడే ముందు ‘లెనిన్’ మూవీ ఆడియన్స్ నుండి వచ్చిన రియాక్షన్స్ కి సంబంధించిన వీడియో ని ప్లే చేశారు. దాన్ని చూసి అక్కినేని నాగార్జున బాగా ఎమోషనల్ అయిపోయారు. ఇక ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ అభిమానులకు , ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పిన తీరు చూస్తుంటే , అఖిల్ సక్సెస్ కోసం ఎంత ఎదురు చూసారో అర్థం అవుతోంది.

నాగార్జున మాట్లాడుతూ ‘ ముందుగా మా అభిమానులకు నేను మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు చెప్పాలి. ఆడియన్స్ ఎప్పటికీ మాతో ఉన్నారు , మంచి సినిమా తీస్తే బ్రహ్మరథం పడుతామని చెప్తూనే ఉన్నారు, కానీ అక్కినేని అభిమానులు మాత్రం నిజంగా దేవుళ్ళు. ఎన్ని అపజయాలు వచ్చినా మమ్మల్ని వాళ్ళ భుజాలపై మోసే విధానం కి సెల్యూట్. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగిన మరుసటి రోజు నేను తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాను. ఇప్పటి వరకు నేను దేవుడిని ఏది అడగలేదు , ఎందుకంటే మాకు అన్నీ ఉన్నాయి, కానీ ఈ సినిమాలో అన్ని కుదిరాయి, కనీసం ఈసారైనా వాడికి హిట్ వచ్చేలా చేయండి అని కోరుకున్నాను. నా కోరికని నెరవేర్చినందుకు వెంకటేశ్వర స్వామి కి థాంక్స్’ అంటూ చెప్పుకొచ్చారు. ఇంకా ఆయన ఏమి మాట్లాడారో ఈ వీడియో లో చూడండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper