N Convention Demolition: సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం.. ఆగస్టు నెలలో హైదరాబాదులోని మాదాపూర్ తమ్మిడికుంట చెరువు పక్కన సినీ హీరో నాగార్జునకు ఎన్ కన్వెన్షన్ పేరుతో ఒక సెంటర్ ఉండేది. దీనిని అప్పట్లో కూల్చివేశారు. దీని వెనుక రకరకాల కథనాలు వ్యాప్తిలోకి వచ్చాయి. గులాబీ క్యాంప్ నాగార్జునకు అండగా నిలిచింది. నాగార్జునను బాధిత పక్షం లాగా చూపించింది. కాంగ్రెస్ క్యాంపు మాత్రం కెసిఆర్.. కేటీఆర్ తప్పు వల్లే నాగార్జున ఈ పని చేశారని.. తమ్మిడి కుంట చెరువును ఆక్రమించారని ఆరోపించింది. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చివేయాలని అనుకున్నారని.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు బుల్డోజర్లు వెనక్కి వచ్చాయని కాంగ్రెస్ నాయకులు సరికొత్త ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు.. ప్రత్యారోపణలు సాగుతుండగానే తమ్మిడి కుంట సరికొత్త రూపు సంతరించుకుంది.
తమ్మిడి కుంట విస్తీర్ణాన్ని ప్రభుత్వం ఏకంగా 30 ఎకరాలకు పెంచింది. దుర్గంధం.. ప్లాస్టిక్.. చెత్త.. బయో వేస్ట్ తో ఉన్న ఆ చెరువు కాస్త ఇప్పుడు పరిశుభ్రంగా మారింది. ఆక్రమణలకు గురికాకుండా ప్రభుత్వం కంచ ఏర్పాటు చేసింది. హైడ్రా అధినేత రంగనాథ్ ఈ చెరువు విషయంలో ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు. భవిష్యత్ కాలంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి చెరువులో వర్షపు నీరు చేరడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మురుగునీరు కల్వకుండా ప్రత్యేకంగా పైపులైన్లు ఏర్పాటు చేశారు. మురుగు నీటిని శుద్ధి చేయడానికి ప్రత్యేకంగా ప్లాంట్ లు కూడా నిర్మించారు. మొత్తంగా 20 కోట్లు ఖర్చుపెట్టి తమ్మిడి కుంటను సరికొత్తగా తీర్చిదిద్దారు. ఇందులో పేరుకుపోయిన మట్టిని.. ఇతర వ్యర్ధాలను తొలగించారు. అవన్నీ కలిపితే 30 వేల ట్రక్కులకు పైగా వ్యర్ధాలు వచ్చాయని హైడ్రా సిబ్బంది చెబుతున్నారు.
తమ్మిడి కుంట చెరువు ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు.. హైడ్రా అధినేత రంగనాథ్.. సినీ హీరో నాగార్జున కూడా వచ్చారు. నాగార్జున ఈ కార్యక్రమానికి వస్తారని ఎవరూ ఊహించలేదు. చివరికి ఈ విషయాన్ని గులాబీ క్యాంపు కూడా అంచనా వేయలేకపోయింది. అయితే ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చి వేసినప్పుడు నాగార్జునను బాధితుడిగా చూపించిన గులాబీ పార్టీ.. తన పార్టీ కరపత్రంలో హైడ్రాను బూచిగా చూపించిన గులాబీ పార్టీ.. నాగార్జున తమ్మిడి కుంట చెరువు ప్రారంభోత్సవానికి రావడంతో ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. పైగా వేదిక మీద నాగార్జున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని.. హైడ్రా అధినేత రంగనాథ్ ను అదే పనిగా పొగడటం మొదలుపెట్టారు. తన కన్వెన్షన్ సెంటర్ కూల్చివేసిన విషయాన్ని ప్రస్తావించకపోయినప్పటికీ.. రేవంత్ రెడ్డి చేస్తున్న పనులను.. రంగనాథ్ చేస్తున్న కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో తన కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత వెనుక ఉన్న విషయాన్ని రంగనాథ్ చెప్పిన తీరును నాగార్జున బయటపెట్టారు.
ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చి వేసినప్పుడు హైడ్రా రంగనాథ్ తన వద్దకు వచ్చారని నాగార్జున చెప్పారు. తన మనసు పూర్తిగా మార్చేశారని వివరించారు. కూర్చోబెట్టి అన్ని అర్థమయ్యేలా చెప్పి వివరించారు. ఆయన మాటలు విన్న తర్వాత.. సిటీ కోసం ఇది కదా నేను చేయాల్సింది అని నాగార్జున అనుకున్నారు. అందువల్లే రంగనాథ్ చేస్తున్న ప్రతి పనికి సపోర్ట్ చేశారు. వాస్తవానికి ఒక అధికారి తన పరిధిలో పనిచేయడం పెద్ద విషయం కాదు. ప్రజల సంక్షేమం కోసం.. భవిష్యత్తు తరాల కోసం.. వనరులను కాపాడడం కోసం ముందుకు రావడం గొప్ప విషయం. అది చేసి చూపించారు హైడ్రా రంగనాథ్. గిట్టని వ్యక్తులు ఆయన మీద రాళ్లు వేస్తారు.. అక్రమార్కులు ఆయన మీద కోర్టుకు వెళ్తారు. కొన్ని వ్యవస్థలు ఆయన మీద కోపంతో రకరకాల వ్యాఖ్యలు చేస్తాయి. అయినప్పటికీ హైడ్రా రంగనాథ్ పేరు ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఉప్పల్ నుంచి మొదలు పెడితే మాదాపూర్ వరకు.. కొత్తగా రూపుదిద్దుకున్న చెరువులు చెబుతాయి. రంగనాథ్ అంటే ఎవరో. నాగార్జునకు అర్థమైంది.. మిగతా వారికి కూడా హైడ్రా అంటే ఏమిటి.. రంగనాథ్ అంటే ఏమిటి అర్థం కావాలని సగటు హైదరాబాద్ నగర ప్రజలు కోరుకుంటున్నారు.
తమ్మిడికుంట చెరువు కథలో అదిరిపోయే ట్విస్ట్!
FTL పరిధిలో ఉందని కోట్ల విలువైన N Convention కూల్చిన రేవంత్ అన్న నిర్ణయాన్ని ఇప్పుడు మెచ్చుకుంటున్న నాగార్జున గారు…
HYDRA చేస్తున్న మంచి పనులకు తన పట్టా భూమిలోని 2 ఎకరాలు ఇవ్వడానికి ముందుకొచ్చారు!
ఒకప్పుడు కూల్చివేతతో మొదలైన కథ… ఇప్పుడు చెరువుల పునరుద్ధరణలో భాగస్వామ్యంతో కొత్త మలుపు తిరిగింది!
గ్రేట్ @iamnagarjuna గారు @revanth_anumula#HYDRAA #RevanthReddy #Nagarjuna #SaveLakes #ThammidikuntaLake
— Shashi Kumar Reddy Vura (@vurashashi) November 11, 2026