
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పీఎం కేర్స్ నుంచి విడుదలైన వెంటిలేటర్ల స్వభావాన్ని ప్రధాని మోదీ స్వభావాన్ని పోల్చుతూ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. పీఎం కేర్స్ నుంచి విడుదలైన వెంటిలేటర్లు కు ప్రధాని మోదీ గుణగణాలకు అనినాభావ సంబంధముంది. వీటి ప్రచారంలో పుట్టేడు అబద్ధాలున్నాయి. అటు మోదీ, ఇటు వెంటిలేటర్లు అప్పగించిన పనిని సరిగా చేయడం లేదు. అవసరమైన సమయంలో ఎక్కడా కనిపించడం లేదు అని అన్నారు.