
హీరోగా ఎంట్రీ ఇచ్చాక చాలా మంది మళ్లీ కమెడియన్ వేషాలు వేయలేదు. చాలా మంది దర్శకులు వారికి చాన్సులు ఇవ్వలేదు. అలానే కనుమరుగైన వారు ఎందరో.. కానీ ఇండస్ట్రీలో త్రివిక్రమ్ లాంటి దర్శకుడిని ఫ్రెండ్ గా చేసుకున్న కమెడియన్ సునీల్ అతడి ద్వారానే హీరో నుంచి మళ్లీ కమెడియన్ గా మారారు.
త్రివిక్రమ్ మూవీల ద్వారానే మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ను ఆరంభించిన సునీల్ తాజాగా వెబ్ సిరీస్ లలోనూ నటిస్తున్నాడు. రెగ్యులర్ వేషాలతోపాటు విలన్ వేశాలు వేయడానికి రెడీ అయిపోయాడు. ఇప్పుడు తాజాగా పౌరాణిక పాత్రల్లోనూ నటిస్తున్నాడట..
తాజాగా సునీల్ కు అదిరిపోయే ఆఫర్ వచ్చినట్టు సమాచారం. ఓ వెబ్ సిరీస్ కోసం బ్రహ్మగా నటించే అవకాశం వచ్చినట్టు టాక్ . ‘కలర్ ఫొటో’ మూవీ తీసిన నటులు, దర్శకులు కలిసి ఈ వెబ్ సిరీస్ తీస్తున్నట్టుగా తెలిసింది.
సునీల్ ప్రస్తుతం సినిమాలతోపాటు ఓటీటీల్లోనూ నటించడానికి రెడీ అయ్యారు. హిందీ నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయట.. ఇలా మొన్నటి దాకా అవకాశాలు లేక ఇబ్బంది పడ్డ సునీల్ ఇప్పుడు బీజీ అయిపోయారట..