Homeఅంతర్జాతీయంModi Shock To Bangladesh: బంగ్లాదేశ్‌కు దెబ్బమీద దెబ్బ.. సైలెంట్‌గా షాక్‌ ఇస్తున్న మోదీ!

Modi Shock To Bangladesh: బంగ్లాదేశ్‌కు దెబ్బమీద దెబ్బ.. సైలెంట్‌గా షాక్‌ ఇస్తున్న మోదీ!

Modi Shock To Bangladesh: భారత దేశం పొరుగు దేశాలతో సఖ్యతగా ఉండేందుకు ఏటా రూ.5 వేల కోట్ల రూపాయలు సహయాం చేస్తుంది. మన అవసరాలు తీర్చుకోవడంతోపాటు సోషల్‌ రెస్సాన్స్‌లో భాగంగా పాఠశాలలు, ఆస్పత్రులు, రోడ్లు పోర్టుల నిర్మాణం కోసం నిధులు వెచ్చిస్తోంది. ఈ ఏడాది కూడా బడ్జెట్‌లో కేంద్రం రూ.5,685 కోట్లు విదేశాల కోసం కేటాయించింది. అయితే ఇందులో బంగ్లాదేశ్‌కు షాక్‌ ఇచ్చింది. ఆ దేశానికి ఇచ్చే నిధులను సగానికి తగ్గించింది. ఇప్పటికే భారత్‌–ఈయూ ఒప్పందంతో […]

Modi Shock To Bangladesh: భారత దేశం పొరుగు దేశాలతో సఖ్యతగా ఉండేందుకు ఏటా రూ.5 వేల కోట్ల రూపాయలు సహయాం చేస్తుంది. మన అవసరాలు తీర్చుకోవడంతోపాటు సోషల్‌ రెస్సాన్స్‌లో భాగంగా పాఠశాలలు, ఆస్పత్రులు, రోడ్లు పోర్టుల నిర్మాణం కోసం నిధులు వెచ్చిస్తోంది. ఈ ఏడాది కూడా బడ్జెట్‌లో కేంద్రం రూ.5,685 కోట్లు విదేశాల కోసం కేటాయించింది. అయితే ఇందులో బంగ్లాదేశ్‌కు షాక్‌ ఇచ్చింది. ఆ దేశానికి ఇచ్చే నిధులను సగానికి తగ్గించింది. ఇప్పటికే భారత్‌–ఈయూ ఒప్పందంతో బంగ్లాదేశ్‌ టెక్స్‌టైల్‌ ఎక్స్‌పోర్టును దెబ్బకొట్టింది. విద్యుత్‌ సరఫరాను నిలిపవేసింది. తాజాగా నిధుల్లో కోత పెట్టింది.

భారత వ్యతిరేకతకు ప్రతీకారం..
గత ఏడాదిన్నరంగా బంగ్లాదేశ్‌ భారత వ్యతిరేక చర్యలు చేపట్టింది. హిందువులపై దాడులు, విద్యార్థి నేత మరణంపై ఆరోపణలు, సులిగుడి కారిడార్‌ విషయంలో వివాదాలు, చైనా మద్దతుతో రెచ్చగొట్టుకోవడం కొనసాగుతున్నాయి. దీనికి ప్రతీకారంగా భారత సహాయ కోత బంగ్లాదేశ్‌కు మరో పెద్ద దెబ్బ.

మిత్రదేశాలకు నిధులు..
భూటాన్‌కు రూ.2,288 కోట్లు (మొత్తం 40%) కేటాయించారు. హైడ్రో ప్రాజెక్టుల ద్వారా విద్యుత్‌ సరఫరా, చైనాతో బఫర్‌ స్థానం, హిమాలయ భద్రతా వ్యవస్థలో దాని పాత్ర కారణంగా పాఠశాలలు, ఆసుపత్రులు, రోడ్లు, విద్యుత్‌ కేంద్రాలకు నిధులు. నేపాల్‌కు రూ.200 కోట్లు సాంస్కృతిక సంబంధాల ఆధారంగా.

మాల్దీవ్స్, మారిషస్‌కు..
మాల్దీవ్స్, మారిషస్‌కు కలిపి రూ.550 కోట్లు. మారిషస్‌లో 2024లో భారతులపై వివక్ష జరిగినప్పటికీ, హిందూ మహాసముద్రంలో దాని స్ట్రాటజిక్‌ పోర్టుల కారణంగా కోత లేదు. ఇవి భారత భద్రతా ఆసక్తులకు ముఖ్యం.

ఇరాన్‌ పోర్టు నిలిపివేత
ఇరాన్‌ చాబహార్‌ పోర్టు అభివృద్ధికి నిధులు భారత్‌ నిధులు ఆపేసింది. అమెరికా–ఇరాన్‌ ఉద్రిక్తతలు దీనికి కారణం. మన సహాయం చేస్తే అమెరికా దానిని సాకుగా చూపి భారత్‌పై ఆంక్షలు విధించే అవకాశం ఉంది. అందుకే తాత్కాలికంగా నిధులు నిలిపివేసింది.

భారత విదేశీ సహాయం స్నేహ సంబంధాలు, భౌగోళిక కీలకత్వం, భద్రతా అవసరాలపై ఆధారపడి ఉంటుంది. బంగ్లాదేశ్‌ వంటి వ్యతిరేకతకు కోతలు విధించడం ద్వారా సందేశం ఇస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper