HomeతెలంగాణV Hanumantha Rao: మోడీ సార్ పాన్ రేటు కూడా పెంచుతరా.. మా హనుమంతన్న బాధ...

V Hanumantha Rao: మోడీ సార్ పాన్ రేటు కూడా పెంచుతరా.. మా హనుమంతన్న బాధ మీకు అర్థమైత లేదు..

V Hanumantha Rao: పెట్రోల్ పెరిగింది. డీజిల్ ధర కూడా పెరిగింది. నిత్యావసరల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఏం కొనేటట్టు లేదు.. యుద్ధం వల్ల ధరలు అమాంతం పెరిగిపోవడంతో ప్రజలు తట్టుకునే పరిస్థితి లేదు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి యుద్ధాన్ని సాకుగా చూపి కేంద్రం అడ్డగోలుగా ధరలు పెంచిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు.. ఆందోళనలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ […]

V Hanumantha Rao: పెట్రోల్ పెరిగింది. డీజిల్ ధర కూడా పెరిగింది. నిత్యావసరల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఏం కొనేటట్టు లేదు.. యుద్ధం వల్ల ధరలు అమాంతం పెరిగిపోవడంతో ప్రజలు తట్టుకునే పరిస్థితి లేదు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి యుద్ధాన్ని సాకుగా చూపి కేంద్రం అడ్డగోలుగా ధరలు పెంచిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

ప్రతిపక్ష కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు.. ఆందోళనలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ధరలు పెంచడం వల్ల సామాన్యుల జీవితం మీద తీవ్రమైన ఇబ్బంది పడుతోందని.. ధరలు పెంచకుండా కేంద్రం చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు మొత్తం కలిపి మాట్లాడే విధానం ఒక విధంగా ఉంటే.. ఆ పార్టీ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు మాట్లాడే మాటలు మరో విధంగా ఉన్నాయి. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారితీస్తున్నాయి.

మన దేశంలో ఉపయోగించే క్రూడ్ ఆయిల్ అరబ్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం. అంతేకాదు డ్రై ఫ్రూట్స్ నుంచి మొదలుపెడితే.. అత్యంత ఖరీదైన బంగారం వరకు అక్కడి నుంచే కొనుగోలు చేస్తాం. కేవలం ఇవి మాత్రమే.. చాలామంది సరదాగా తినే పాన్ లో ఉపయోగించే ముడి సరుకులు గల్ఫ్ దేశాల నుంచి దిగుమతి అవుతుంటాయి. అయితే యుద్ధం వల్ల పాన్ తయారీలో ఉపయోగించే ముడి సరుకులు ధర కూడా విపరీతంగా పెరిగింది. దీనిపై వి హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.”పెట్రోల్ ధరలు పెంచినవ్. డీజిల్ ధర కూడా పెంచినవ్.. అన్ని రేట్లు అడ్డగోలుగా పెంచినవ్. ఏం చేస్తున్నవో అర్థం కావడం లేదు. చివరికి పాన్ లో వాడే వస్తువులను కూడా వదిలిపెట్టవ. పాన్ తినే వాళ్ళ పరిస్థితి ఏంది. ఇంత ధరలు పెంచితే ఎట్ల తింటరు..మోడీ నీకు ఇది న్యాయం కాదు” అని హనుమంతరావు విమర్శించారు.

వాస్తవానికి ఈ కోణంలో ఏ కాంగ్రెస్ నాయకుడు.. ఏ బిఆర్ఎస్ నాయకుడు ఆలోచించలేదు. ఎంతసేపటికి పెట్రోల్ ధరలు.. డీజిల్ ధరల గురించి మాత్రమే మాట్లాడారు. కానీ చాలామంది పాన్ తినేవాళ్లు.. ధరలు పెరగడం వల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అందువల్లే వారి తరఫున వి హనుమంతరావు వకల్తా పుచ్చుకున్నారు. మోడీ ధరలు తగ్గించు అంటూ డిమాండ్ చేశారు. హనుమంతరావు డిమాండ్ తో మోడీ తలవంచుతారా.. ధరలు తగ్గిస్తారా.. ఒకవేళ ధరలు తగ్గిస్తే మాత్రం హనుమంతరావు రేంజ్ తెలంగాణలో అమాంతం పెరుగుతుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper