Homeఎంటర్టైన్మెంట్Soundarya Husband Raghu: హీరోయిన్ సౌందర్య భర్త.. ఇప్పుడు ఎలా ఉన్నాడో.. ఏమి చేస్తున్నాడో చూస్తే...

Soundarya Husband Raghu: హీరోయిన్ సౌందర్య భర్త.. ఇప్పుడు ఎలా ఉన్నాడో.. ఏమి చేస్తున్నాడో చూస్తే ఆశ్చర్యపోతారు..

Soundarya Husband Raghu: తెలుగు సినీ ప్రేక్షకులు చిరస్థాయిగా తమ గుండెల్లో పెట్టుకున్న హీరోయిన్స్ లో ఒకరు సౌందర్య. దాదాపుగా అన్ని భాషల్లోనూ నటించిన ఈమె , అతి తక్కువ సమయం లోనే లేడీ సూపర్ స్టార్ గా ఎదిగారు. అందాల అరోబోతకు ఛాన్స్ ఇవ్వకుండా , కేవలం నటనకు ప్రాధాన్యం ఇస్తూ , ఈ రేంజ్ కి ఎదగడం అనేది చిన్న విషయం కాదు. మన టాలీవుడ్ లో చిరంజీవి , బాలకృష్ణ , వెంకటేష్ […]

Soundarya Husband Raghu: తెలుగు సినీ ప్రేక్షకులు చిరస్థాయిగా తమ గుండెల్లో పెట్టుకున్న హీరోయిన్స్ లో ఒకరు సౌందర్య. దాదాపుగా అన్ని భాషల్లోనూ నటించిన ఈమె , అతి తక్కువ సమయం లోనే లేడీ సూపర్ స్టార్ గా ఎదిగారు. అందాల అరోబోతకు ఛాన్స్ ఇవ్వకుండా , కేవలం నటనకు ప్రాధాన్యం ఇస్తూ , ఈ రేంజ్ కి ఎదగడం అనేది చిన్న విషయం కాదు. మన టాలీవుడ్ లో చిరంజీవి , బాలకృష్ణ , వెంకటేష్ , నాగార్జున , శ్రీకాంత్ , జగపతి బాబు ఇలా అందరి హీరోలతో కలిసి నటించిన సౌందర్య , ఫ్యామిలీ ఆడియన్స్ కి అత్యంత దగ్గరైంది. ఏ హీరో తో చేసినా ‘మేడ్ ఫర్ ఈచ్ అథర్ ‘ లాగా అనిపించడం సౌందర్య స్పెషాలిటీ. అందుకే ఆరోజుల్లో ఆమె లేని సినిమా ఉండేది కాదు.

స్టార్ హీరోలు సౌందర్య డేట్స్ కోసం పడిగాపులు కాచే వారు. అలాంటి సౌందర్య నేడు మన మధ్య లేకపోవడం సినీ ఇండస్ట్రీ చేసుకున్న దురదృష్టం. ఏప్రిల్ 17, 2004 వ సంవత్సరం లో సౌందర్య హెలికాప్టర్ ప్రమాదం లో చనిపోయారు. కేవలం 31 ఏళ్ళ వయస్సులోనే ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది. ఆమె ప్రమాదానికి గురైన విషయాన్ని తెలుసుకున్న వెంటనే ఆరోజుల్లో సినీ పరిశ్రమ శోక సంద్రం లో మునిగిపోయింది. ఆమెతో కలిసి నటించిన హీరోలు వెక్కి వెక్కి ఏడ్చారు. అయితే ఈమె చనిపోయే ముందు సంవత్సరం , అనగా 2003 లో తన చిన్ననాటి స్నేహితుడు, సాఫ్ట్ వేర్ ఉద్యోగి అయినటువంటి రఘు ని పెళ్లాడింది. అయితే సౌందర్య చనిపోయిన తర్వాత ఆమెకు సంబంధించిన 50 కోట్ల విలువైన ఆస్తులను , తమకు దక్కకుండా చేస్తున్నారని సౌందర్య తల్లిదండ్రులు రఘు పై పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన ఘటన అప్పట్లో పెద్ద సంచలనం రేపింది.

అంతే కాకుండా 2025 వ సంవత్సరం లో ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ సౌందర్య ప్రమాదానికి గురి అవ్వడానికి సీనియర్ హీరో మోహన్ బాబు ఒక కారణమని , అందుకు కారణం ల్యాండ్ వివాదమే అంటూ ఒక పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. అయితే అందులో ఎలాంటి నిజం లేదని సౌందర్య భర్త రఘు మీడియా కి తెలిపారు. ఇదంతా పక్కన పెడితే సౌందర్య చనిపోయిన తర్వాత కొన్నాళ్ళు సోలో జీవితాన్ని గడిపిన రఘు , 2011 వ సంవత్సరం లో రెండవ పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన తన కుటుంబం తో సంతోషంగా జీవిసున్నారు , పెద్ద వ్యాపారవేత్తగా స్థిరపడ్డాడు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper