Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan: నేటి తరానికి మోడీ విలువ తెలియదు.. వాళ్లకు సంస్కారం నేర్పించాలి అంటూ పవన్...

Pawan Kalyan: నేటి తరానికి మోడీ విలువ తెలియదు.. వాళ్లకు సంస్కారం నేర్పించాలి అంటూ పవన్ కళ్యాణ్ ఎమోషనల్..

Pawan Kalyan: మరోసారి మోదీ పట్ల తనకున్న అభిప్రాయాన్ని బయటపెట్టారు పవన్ కళ్యాణ్. ఇందుకు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం వేదికగా మారింది. పవన్ కళ్యాణ్ ఎమోషన్ అయ్యారు. జాతీయస్థాయిలో ఇటీవల జరిగిన పరిణామాల క్రమంలో ప్రధాని విషయంలో జరిగిన ప్రచారాన్ని ప్రస్తావించారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళనల విషయాన్ని గుర్తు చేశారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీపై వచ్చిన విమర్శలపై స్పందించారు. ప్రధాని నరేంద్ర మోడీ లాంటి నాయకత్వం ఈ దేశానికి […]

Pawan Kalyan: మరోసారి మోదీ పట్ల తనకున్న అభిప్రాయాన్ని బయటపెట్టారు పవన్ కళ్యాణ్. ఇందుకు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం వేదికగా మారింది. పవన్ కళ్యాణ్ ఎమోషన్ అయ్యారు. జాతీయస్థాయిలో ఇటీవల జరిగిన పరిణామాల క్రమంలో ప్రధాని విషయంలో జరిగిన ప్రచారాన్ని ప్రస్తావించారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళనల విషయాన్ని గుర్తు చేశారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీపై వచ్చిన విమర్శలపై స్పందించారు. ప్రధాని నరేంద్ర మోడీ లాంటి నాయకత్వం ఈ దేశానికి అవసరం అని.. ఈ దేశానికి ఏం కావాలో తెలిసిన నాయకుడు అని.. ఆయనలో ఉన్న సహనం, ధైర్యాన్ని ప్రస్తావిస్తూ పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ మాట్లాడుతున్నంత సేపు ప్రధాని నరేంద్ర మోడీ శ్రద్ధగా విన్నారు కూడా.

* జెన్ జీ ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ..
ఇటీవల జెన్ జీ ఉద్యమం పతాక స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారానికి సంబంధించి జాతీయస్థాయిలో ఒక ఉద్యమం నడిచింది. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద భారీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో పార్లమెంటు వైపు చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కొందరు అతిగా వ్యవహరించారన్న విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా చాలా రకాల ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ ఘటనను చాలా ప్రశాంతంగా పరిష్కరించారు ప్రధాని మోదీ. ముందుగా తాను స్పందించారు. ఒక ప్రత్యేక వీడియో విడుదల చేశారు. ఈ ఘటనను దురదృష్టకరంగా అభివర్ణించారు. పటిష్ట చర్యలు చేపడతామని కూడా చెప్పుకొచ్చారు. మరోవైపు విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేయించారు. కేవలం జాతీయ స్థాయిలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు చాలా చతురతతో ప్రధాని వ్యవహరించినట్లు అభినందనలు వచ్చాయి. మరోవైపు ఇంతటి ఉద్యమానికి కారణమైన యువతను.. తనను దూషించిన పిల్లలను సైతం క్షమిస్తున్నట్లు బాహటంగా ప్రకటించారు మోడీ.

* ప్రధాని గొప్పతనాన్ని వివరిస్తూ..
అయితే విమానాశ్రయ ప్రారంభోత్సవ వేడుకల్లో పవన్ మాట్లాడుతూ ఇదే విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. తనను దూషించిన వారిని సైతం క్షమించగల గొప్ప గుణం ప్రధాని నరేంద్ర మోడీది అని అభివర్ణించారు. ఒకానొక దశలో ఎమోషన్ అయ్యారు పవన్ కళ్యాణ్. అయితే పవన్ మాటలు బిజెపి శ్రేణులకు ఫిదా చేశాయి. కూటమి వర్గాల్లో సైతం ఒక రకమైన ఉత్సాహం కనిపించింది. ఇటీవల ఈ ఉద్యమంతో బిజెపి గ్రాఫ్ పడిపోతుందని అంచనా వేశారు కొందరు. కానీ అదే సమయంలో అదే ఉద్యమం లో ఉన్న లోపాలు బయటపడ్డాయి. అయితే ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఆ ఉద్యమాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. నేటి తరానికి మోడీ విలువ తెలియదు అని.. దేశ స్థితిగతులను మార్చిన గొప్ప నాయకుడు అంటూ పవన్ కళ్యాణ్ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper