Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu-Harish Shankar : మహేష్ బాబు - హరీష్ శంకర్ కాంబోలో మిస్ అయిన...

Mahesh Babu-Harish Shankar : మహేష్ బాబు – హరీష్ శంకర్ కాంబోలో మిస్ అయిన సినిమా ఏంటంటే..?

Mahesh Babu-Harish Shankar : తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబుకి చాలా మంచి క్రేజ్ ఉంది. ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా ప్రేక్షకుడిని మెప్పించడమే కాకుండా యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీని సైతం తన వైపు తిప్పుకునేలా చేశాడు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో తను నెంబర్ వన్ హీరోగా మారతాడని ప్రతి ఒక్కరు అనుకున్నారు. కానీ మధ్యలో అతనికి కొన్ని ఫ్లాప్ సినిమాలు రావడం, అలాగే ఇతర హీరోలు పాన్ ఇండియా […]

Mahesh Babu-Harish Shankar : తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబుకి చాలా మంచి క్రేజ్ ఉంది. ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా ప్రేక్షకుడిని మెప్పించడమే కాకుండా యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీని సైతం తన వైపు తిప్పుకునేలా చేశాడు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో తను నెంబర్ వన్ హీరోగా మారతాడని ప్రతి ఒక్కరు అనుకున్నారు. కానీ మధ్యలో అతనికి కొన్ని ఫ్లాప్ సినిమాలు రావడం, అలాగే ఇతర హీరోలు పాన్ ఇండియా సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్లడంతో ఆయన కొంతవరకు వెనుకబడిపోయాడు. అయినప్పటికి ఇప్పుడు రాజమౌళితో చేస్తున్న ‘వారణాసి’ సినిమాతో మరోసారి తన స్టామినా చూపించడానికి సిద్ధమవుతున్నాడు… ఇక ఏది ఏమైనా కూడా ఇప్పుడు చేయబోతున్న సినిమాతో భారీ విజయాన్ని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు. కాబట్టి ఈ సినిమా కోసం తను చాలా వరకు కష్టపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా వచ్చే సంవత్సరం ఏప్రిల్ లో రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా మీద ఇప్పటినుంచే ప్రేక్షకుల్లో భారీ అంచనాలైతే ఉన్నాయి…

ఇక రాజమౌళి సైతం ఈ సినిమాను చాలా ప్రెస్టేజీయస్ గా తీసుకొని మరి తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే హాలీవుడ్ సినిమా మేకర్స్ అందరికీ పోటీ ఇచ్చే విధంగా ఈ సినిమా ఉండాలని రాజమౌళి దానికి తగ్గట్టుగానే ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నాడు…

ఇక ఈ మూవీ విషయం పక్కన పెడితే కమర్షియల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపుని సంపాదించుకున్న హరీష్ శంకర్ దర్శకత్వంలో మహేష్ బాబు ఒక సినిమా చేయాల్సి ఉంది. ఆయన గబ్బర్ సింగ్ సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించిన తర్వాత ఎన్టీఆర్ తో ‘రామయ్య వస్తావయ్య’ సినిమా చేస్తున్న సందర్భంలో మహేష్ బాబుతో కూడా ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేశాడు.

ఆ సినిమా స్టోరీ ని కూడా మహేష్ బాబు కి చెప్పి ఒప్పించినట్టుగా తెలుస్తుంది. కానీ రామయ్య వస్తావయ్య సినిమా ఫ్లాప్ అవడంతో మహేష్ బాబు హరీష్ శంకర్ ను పక్కన పెట్టాడు. ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళ కాంబోలో సినిమా వచ్చుంటే మాత్రం ఆ మూవీ బ్లాక్ బాస్టర్ సక్సెస్ గా నిలిచేదని ప్రతి ఒక్కరు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper