Homeజాతీయ వార్తలుINS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక... శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక యుద్ధ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకుంది. ఐఎన్‌ఎస్‌ మల్వాన్‌ అనే కొత్త నౌక నేవీలో చేరింది. శత్రు సబ్‌మెరైన్‌లను గుర్తించి, వాటిని నాశనం చేయడంలో ఇది అత్యంత సమర్థవంతమైన నౌకగా రూపొందించబడింది. నౌక ప్రత్యేకతలు ఇవీ.. ఐఎన్‌ఎస్‌ మల్వాన్‌ 80 మీటర్ల పొడవు, […]

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక యుద్ధ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకుంది. ఐఎన్‌ఎస్‌ మల్వాన్‌ అనే కొత్త నౌక నేవీలో చేరింది. శత్రు సబ్‌మెరైన్‌లను గుర్తించి, వాటిని నాశనం చేయడంలో ఇది అత్యంత సమర్థవంతమైన నౌకగా రూపొందించబడింది.

నౌక ప్రత్యేకతలు ఇవీ..
ఐఎన్‌ఎస్‌ మల్వాన్‌ 80 మీటర్ల పొడవు, 1,100 టన్నుల బరువు కలిగి ఉంది. దీన్ని కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ నిర్మించింది. నౌకలో 80 శాతం పరికరాలు స్వదేశీంగా తయారు చేయబడ్డాయి. ఇది ఆత్మనిర్భర భారత్‌ లక్ష్యానికి మరో మైలురాయిగా నిలుస్తోంది.

సాంకేతిక సామర్థ్యాలు..
ఈ నౌకలో అత్యాధునిక టార్పెడోలు, మల్టీ ఫంక్షనల్‌ యాంటీ సబ్‌మెరైన్‌ రాకెట్లు, శక్తివంతమైన సోనార్‌ వ్యవస్థలు అమర్చబడ్డాయి. ఇవి సముద్రంలోని శత్రు సబ్‌మెరైన్‌లను కచ్చితంగా గుర్తించి, వాటిని ఎదుర్కొనే సామర్థ్యాన్ని ఇస్తాయి. ఆధునిక యుద్ధ వాతావరణంలో ఈ సామర్థ్యాలు భారత నేవీకి పెద్ద బలం.

చారిత్రక స్ఫూర్తి
ఐఎన్‌ఎస్‌ మల్వాన్‌ అధికారిక చిహ్నానికి ఛత్రపతి శివాజీ మహారాజు ఉపయోగించిన ’పులిగోరు’ స్ఫూర్తినిచ్చింది. ఈ చారిత్రక సంకేతం భారతీయ సైనిక సంప్రదాయాలతో ఆధునిక రక్షణ సాంకేతికతను మిళితం చేస్తోంది.

భారత నేవీకి కీలకం..
ఐఎన్‌ఎస్‌ మల్వాన్‌ చేరిక భారత నేవీ సబ్‌మెరైన్‌ వ్యతిరేక యుద్ధ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది. ఇండియన్‌ ఓషన్‌లో చైనా, పాకిస్తాన్‌ వంటి దేశాల సబ్‌మెరైన్‌ కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి నౌకలు చాలా అవసరం. ఇది 80 శాతం స్వదేశీ పరిజాఞనంతో నిర్మితమైంది.

మొత్తంమీద, ఐఎన్‌ఎస్‌ మల్వాన్‌ భారత నేవీని మరింత బలపరుస్తుంది. సముద్ర సరిహద్దుల రక్షణలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఆత్మనిర్భర భారత్‌ లక్ష్యం సాధించడంలో ఇలాంటి ప్రాజెక్టులు ముఖ్యమైనవి. భారత నేవీ ఇంకా మరిన్ని అధునాతన నౌకలను చేర్చుకుంటూ, దేశ రక్షణను బలోపేతం చేస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper