Homeక్రీడలుక్రికెట్‌India Naval Modernization: ఒకేసారి మూడు.. సముద్రాల పై భారత్ కు గట్టిపట్టు.. మోడీ ప్లాన్...

India Naval Modernization: ఒకేసారి మూడు.. సముద్రాల పై భారత్ కు గట్టిపట్టు.. మోడీ ప్లాన్ అదిరిపోయింది గా..

India Naval Modernization: ఆకాశం, నీరు, నిప్పు.. ఈ మూడింటి ఆధారంగానే మనిషి మనుగడ సాగుతూ ఉంటుంది. వీటి మీద పట్టు చిక్కితే మనిషి జీవితం సులభం అవుతుంది. మనిషి అంటే కేవలం ఒకరు మాత్రమే కాదు.. ఈ యావత్ ప్రపంచం. నిప్పు మీద పట్టును కాస్త పక్కన పెడితే.. గగనం.. సంద్రం మీద పట్టు సాధించిన వారే గొప్పగా మనుగడ సాగిస్తూ ఉంటారు. ఇప్పటివరకు ప్రపంచంలో అమెరికా.. రష్యా.. చైనా.. ఇంకా కొన్ని దేశాలు గగనతలం […]

India Naval Modernization: ఆకాశం, నీరు, నిప్పు.. ఈ మూడింటి ఆధారంగానే మనిషి మనుగడ సాగుతూ ఉంటుంది. వీటి మీద పట్టు చిక్కితే మనిషి జీవితం సులభం అవుతుంది. మనిషి అంటే కేవలం ఒకరు మాత్రమే కాదు.. ఈ యావత్ ప్రపంచం. నిప్పు మీద పట్టును కాస్త పక్కన పెడితే.. గగనం.. సంద్రం మీద పట్టు సాధించిన వారే గొప్పగా మనుగడ సాగిస్తూ ఉంటారు.

ఇప్పటివరకు ప్రపంచంలో అమెరికా.. రష్యా.. చైనా.. ఇంకా కొన్ని దేశాలు గగనతలం మీద పట్టు సాధించాయి.. సముద్రంలో కూడా సత్తా చాటాయి. అందువల్లే ఈ దేశాలకు ప్రపంచం మీద పెత్తనం ఎక్కువగా ఉంటుంది. అవి ఏం చెప్తే అదే చేయాలి. ఎలాంటి ఆదేశాలిస్తే వాటిని పాటించాలి.. అయితే ఇప్పుడు భారత్ వాటి సరసన చేరింది. మరి కొద్ది రోజుల్లో అయితే వాటిని మించిపోతుంది. దీనికి ప్రధాన కారణం దేశ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాలు.

గడచిన కొంతకాలంగా మన దేశ నౌకాదళ వ్యవస్థలోకి 40 యుద్ధ.. సర్వే నౌకలు.. జలాంతర్గాములు వచ్చాయి. ఇంకా 45 తదుపరి దశలో ఉన్నాయి. అంతేకాదు అత్యాధునిక స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన స్టెల్త్ ఫ్రీగేట్ ఐఎన్ఎస్ దునగిరి, సర్వే నౌక, ఐఎన్ఎస్ సంషోదక్, జలాంతర్గామి వ్యతిరేక యుద్ధనౌక ఐఎన్ఎస్ అగ్రయ్ అనే మూడు నౌకలను ప్రధానమంత్రి ప్రారంభించారు. కోల్ కతా లోని శామ ప్రసాద్ ముఖర్జీ పోర్టు వద్ద జరిగిన కార్యక్రమంలో వీటిని జాతికి అంకితం చేశారు. ఈ మూడు నౌకలు అత్యంత ప్రత్యేకమైనవి. వీటివల్ల మన నౌకాదళం మరింత బలాన్ని పెంచుకుంది.

దునగిరి

ఇది అత్యంత పెద్దది. స్టెల్త్ ఫ్రిగేట్ విభాగంలో ఇది బాహుబలి లాగా ఉంటుంది. శత్రువుల రాడార్లు.. సెన్సార్లకు ఏమాత్రం చిక్కదు. పైగా ఇది అత్యాధునిక టెక్నాలజీతో పనిచేస్తూ ఉంటుంది. మన నౌకా దళంలో ఐఎన్ఎస్ నీలగిరికి ప్రత్యేకమైన పేరు ఉంది. ఈ ప్రాజెక్టు 17 ఏ లో భాగంగానే దీనిని నిర్మించారు. ఇందులో బ్రహ్మోస్ మిస్సైల్స్.. మిడిల్ రేంజ్ మిస్సైల్స్.. మల్టీ ఫంక్షన్ సర్వే లైన్స్.. ట్రాక్ గైడెన్స్ రాడార్.. సోనార్ సెన్సార్లు.. ఎలక్ట్రానిక్ వార్ ఫెయిర్ వ్యవస్థలు ఇందులో ఉంటాయి. ఇది ఏకంగా 149 మీటర్ల పొడవు..6670 టన్నుల బరువు ఉంటుంది. ఇది గంటకు 52 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది.

సంషోదక్

ఇది హై అండ్ టెక్నాలజీ తో రూపొందించిన హైడ్రోగ్రాఫిక్ సర్వే నౌక. ఇది పూర్తిగా సముద్ర గర్భాన్ని మ్యాపింగ్ చేస్తూ ఉంటుంది. మహా సముద్రాల లోతును కొలుస్తూ ఉంటుంది. సముద్ర మార్గాలను నిత్యం అన్వేషిస్తూ ఉంటుంది. దీని పొడవు 110 మీటర్లు. బరువు 3400 టన్నులు ఉంటుంది. ఇది గంటకు 18 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణం సాగిస్తూ ఉంటుంది. దీనిని దేశ అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు. నీటి అడుగున ఇది మ్యాపింగ్ చేస్తూ ఉంటుంది. దూర ప్రాంతాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తూ ఉంటుంది. అటానమస్ అండర్ వాటర్ వాహకాలు ఇందులో ప్రత్యేకంగా ఉన్నాయి. మనుషులు లేకుండానే దీని ద్వారా సముద్ర అంతర్భాగంలో పరిశోధనలు సులభంగా చేయవచ్చు.

అగ్రయ్

దునగిరి, సంషోదక్ వంటి వాటితో పోల్చి చూస్తే అగ్రయ్ అత్యంత చిన్న నౌక.. ఇది పూర్తిగా జలాంతర్గామి విధ్వంసక యుద్ద నౌక. ఇది శత్రు జలాంతర్గములను గుర్తిస్తూ ఉంటుంది. వాటిని నిత్యం ట్రాక్ చేస్తూ ఉంటుంది. తేలికపాటి టార్పెడో లేదా రాకెట్ల ద్వారా వాటిని ఇది ధ్వంసం చేస్తూ ఉంటుంది. ఇందులో షాలో వాటర్ సోనర్ వ్యవస్థ ఉంటుంది. ఇది అత్యంత కఠినమైన జలాల్లో కూడా పనిచేస్తూ ఉంటుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper