spot_img
Homeక్రైమ్‌Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన భార్య పేరు మీద పది ప్లాట్లు.. ఖానామెట్ ఏరియాలో జీ+5 కమర్షియల్ భవనం.. మూసాపేట.. ఆంజనేయ నగర్ ప్రాంతంలో జి ప్లస్ త్రీ బిల్డింగ్.. నాలుగు రెసిడెన్షియల్ ప్లాట్లు.. మొత్తంగా 28.14 కోట్ల ఆస్తులు.. ఇవేవో సెలబ్రిటీ సంపాదించిన సంపద కాదు. పోనీ ఎవరైనా క్రికెటర్ అవకాశాల ద్వారా వెనకేసుకున్న సొమ్ము కాదు. ఇదంతా అవినీతి అధికారి.. లంచాల బాగోతం.

తెలంగాణ ఏసీబీ అధికారులు మరో భారీ ఆపరేషన్ చేపట్టారు. ఈసారి ఏకంగా అత్యంత భయంకరమైన అవినీతి అనకొండలాంటి అధికారిని పట్టేస్తున్నారు. ఆయన దగ్గరనుంచి పైన ఉదహరించిన ఆస్తులను గుర్తించారు. అవినీతిలోనే అనకొండ లాంటి ఈ అధికారి పేరు ముత్యం వెంకటరమణ. ట్రాన్స్కో డిపార్ట్మెంట్లో డీఈ గా పని చేస్తున్నారు. ఈయన లంచాలు ఇవ్వకుండా ఏ పని కూడా చేయరు. పైగా ప్రతి దానికి ఒక రేట్ ఫిక్స్ చేస్తూ ఉంటారు. ఆ ఫిక్స్ చేసిన రేట్ ప్రకారం ఇస్తేనే పనిచేస్తారు. లేకపోతే అంతే సంగతులు.

వెంకటరమణ మీద విపరీతంగా ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఇంట్లో అక్రమంగా నిలువ చేసిన బంగారాన్ని.. నగదును.. విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఏసీబీ అధికారులు అభియోగాలు నమోదు చేశారు. అంతేకాదు వెంకటరమణ బంధువుల గృహాలలో కూడా తనిఖీలు మొదలుపెట్టారు. కొద్దిరోజులుగా వెంకటరమణ మీద ఏసీబీ అధికారులు దృష్టి పెట్టారు. ఆయన బాధితుల ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత మెరుపు దాడులు చేశారు. ఆయన ఆస్తులను చూసిన ఏసీబీ అధికారులకు దిమ్మ తిరిగిపోయింది. ఇటీవల కాలంలో అవినీతి అనకొండలను తెలంగాణ ఏసీబీ అధికారులు పట్టుకుంటున్నారు. వారు సంపాదించిన అక్రమ ఆస్తుల వివరాలను బయటపెడుతున్నారు.ఏసీబీ అధికారులు ఈ స్థాయిలో దాడులు చేస్తున్నప్పటికీ కొంతమంది అధికారులు ఇంకా మారడం లేదు. లంచాల కోసం కొత్త కొత్త దారులు వెతుకుతున్నారు. అంతేకాదు పని కోసం వచ్చిన ప్రజలను జలగల మాదిరిగా పట్టిపీడిస్తున్నారు. ఏసీబీ విస్తృతంగా దాడులు చేస్తున్నప్పటికీ అధికారుల తీరు మారడం లేదంటే వారు లంచాల కోసం ఏ విధంగా మరిగిపోయారో అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి అధికారులను సర్వీస్ నుంచి రిమూవ్ చేస్తేనే.. మిగతా అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తారని ప్రజలు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడిన అషు రెడ్డి.. వీడియో వైరల్

Sudigali Sudheer : బుల్లితెర పై ప్రస్తుతం సుడిగాలి సుధీర్ హవా ఎవ్వరూ ఊహించని రేంజ్ లో కొనసాగుతోంది. ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా అనేక ఎంటర్టైన్మెంట్ షోస్ తో ప్రేక్షకులను అలరించిన...
Oktelugu Epaper