spot_img
Homeక్రీడలుUnder 19 cricket world cup final : యువభారత్ ఆరోసారి విజేత అవుతుందా?

Under 19 cricket world cup final : యువభారత్ ఆరోసారి విజేత అవుతుందా?

Under 19 cricket world cup final : అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ శుక్రవారం జరగనుంది. ఫైనల్ మ్యాచ్లో భారత్, ఇంగ్లాండ్ తలపడబోతున్నాయి. టీమిండియా కు ఆయుష్ మాత్రే నాయకత్వం వహిస్తున్నాడు. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ అద్భుతమైన విజయం సాధించింది. 300కు పైగా పరుగుల లక్ష్యాన్ని సులువుగా సాధించింది. తద్వారా ప్రపంచ రికార్డు నెలకొల్పింది.

పాకిస్తాన్ మీద గెలిచి సెమీఫైనల్ లోకి వచ్చిన టీమిండియా.. సెమీఫైనల్ లో ఆఫ్ఘనిస్తాన్ జట్టును ఓడించి ఫైనల్ వెళ్ళింది. ఇప్పటివరకు ఈ టోర్నీలో ఇప్పటివరకు టీం ఇండియా ఒక మ్యాచ్ కూడా ఓడిపోలేదు.

అటు ఇంగ్లాండ్ జట్టు కూడా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండానే ఫైనల్ దాకా వచ్చింది. సెమీఫైనల్ లో బలమైన ఆస్ట్రేలియా జట్టును ఓడించి ఫైనల్లో ప్రవేశించింది. రెండు జట్లలో సమర్థవంతమైన ప్లేయర్లు ఉన్న నేపథ్యంలో పోటీ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది.

ఇంగ్లాండ్ జట్టు అండర్ 19 వరల్డ్ కప్ లో ఫైనల్ దాకా రావడం ఇది మూడవసారి. 1998లో కివీస్ జట్టును ఓడించి ఇంగ్లాండ్ ట్రోఫీ అందుకుంది.

భారత్ అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్లో అడుగుపెట్టడం ఇది పదవసారి. ఇప్పటివరకు అండర్ 19 ప్రపంచకప్ లు 16 సార్లు జరిగాయి. ఈసారి విజయం సాధించి ఆరోసారి అండర్ 19 వరల్డ్ కప్ ను అందుకోవాలని భారత్ భావిస్తుంది.

2000 సంవత్సరంలో మహమ్మద్ ఖైఫ్, 2008 సంవత్సరంలో విరాట్ కోహ్లీ, 2012 సంవత్సరంలో ఉన్ముక్త్, 2018 సంవత్సరంలో పృథ్వీ షా, 2020 సంవత్సరంలో ప్రియామ్ గార్గ్, 2022 సంవత్సరంలో యశ్ నాయకత్వంలో టీమిండియా ట్రోఫీలు అందుకుంది. ..

2006లో రవికాంత్, 2016లో ఇషాన్ కిషన్, 2020లో ప్రియాం, 2024లో ఉదయ్ నాయకత్వంలో టీమిండియా రన్నర్ అప్ గా నిలిచింది.

అండర్ 19 ప్రపంచకప్ లో ఇంగ్లాండ్ జట్టుపై భారత జట్టుకు మంచి రికార్డు ఉంది.. ఇరుజట్లు 8 సార్లు తలపడగా, ఇండియా ఆరుసార్లు గెలిచింది.

అండర్ 19 ప్రపంచ కప్ ఫైనల్లో భారత్, ఇంగ్లీష్ జట్లు పోటీ పడటం ఇది రెండవసారి. 2022లో ఇంగ్లాండ్ జట్టును భారత్ ఓడించి ట్రోఫీ అందుకుంది . ఇంగ్లాండ్ జట్టు ఫైనల్ దాకా వెళ్లడం ఇది మూడవసారి. 1998లో న్యూజిలాండ్ జట్టును ఓడించి ట్రోఫీ అందుకుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular