Homeజాతీయ వార్తలుKishtwar’s Chatroo Village: ఉగ్రవాదులకు అడ్డాగా మారిన కుగ్రామం.. ఏడాదిలో నాలుగు ఎన్‌కౌంటర్లు!

Kishtwar’s Chatroo Village: ఉగ్రవాదులకు అడ్డాగా మారిన కుగ్రామం.. ఏడాదిలో నాలుగు ఎన్‌కౌంటర్లు!

Kishtwar’s Chatroo Village: జమ్మూ కశ్మీర్‌ భౌగోళిక పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. అక్కడి వాతావరణంతోపాటు ప్రజలు కూడా భిననమైనవారు ఉన్నారు. ప్రజలు, ఉద్యోగులు, వ్యాపారుల సహకారంతో ఉగ్రవాదులు దేశంలోకి వస్తున్నారు. కార్యకలాపాటు నిర్వహిస్తున్నారు. ఇక కశ్మీర్‌లోని ఓ చిన్న గ్రామం ఉగ్రవాదులకు అడ్డాగా మారింది. ఏడాది వ్యవధిలో ఇక్కడ నాలుగు ఎన్‌కౌంటర్లు జరగడమే ఇందుకు నిదర్శనం. సేఫ్‌ హెవెన్‌గా చాత్రు.. తాజాగా ఫిబ్రవరి 2 నుంచి 5 వరకు కిస్త్‌వాడ్‌ జిల్లా చాత్రు గ్రామంలో జరిగిన తీవ్రమైన […]

Kishtwar’s Chatroo Village: జమ్మూ కశ్మీర్‌ భౌగోళిక పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. అక్కడి వాతావరణంతోపాటు ప్రజలు కూడా భిననమైనవారు ఉన్నారు. ప్రజలు, ఉద్యోగులు, వ్యాపారుల సహకారంతో ఉగ్రవాదులు దేశంలోకి వస్తున్నారు. కార్యకలాపాటు నిర్వహిస్తున్నారు. ఇక కశ్మీర్‌లోని ఓ చిన్న గ్రామం ఉగ్రవాదులకు అడ్డాగా మారింది. ఏడాది వ్యవధిలో ఇక్కడ నాలుగు ఎన్‌కౌంటర్లు జరగడమే ఇందుకు నిదర్శనం.
సేఫ్‌ హెవెన్‌గా చాత్రు..
తాజాగా ఫిబ్రవరి 2 నుంచి 5 వరకు కిస్త్‌వాడ్‌ జిల్లా చాత్రు గ్రామంలో జరిగిన తీవ్రమైన ఎదుర్కోల్పులో ముగ్గురు పాకిస్తాన్‌ మూలాల ఉగ్రవాదులు తుది శ్వాస తీసుకున్నారు. వీరిలో ప్రముఖుడు ఆదిల్, జైష్‌–ఎ–మహ్మద్‌ కమాండర్‌గా పనిచేస్తూ స్థానికంగా దశాబ్దాలుగా కార్యకలాపాలు నడుపుతున్నాడు. ఆపరేషన్‌ త్రాషీలో భాగంగా భద్రతా దళాలు అటవీ ప్రాంతాల్లో జంగిల్‌ వార్‌ఫేర్‌ ఉపయోగించి విజయం సాధించాయి. ఈ ఘటన చాత్రును ఉగ్రుల ’సేఫ్‌ హెవెన్‌’గా మార్చింది.
పర్వతాల మధ్య మార్గాలు..
పీర్‌ పంజాల్‌ పర్వతాలు, దట్ట అడవులు, గుహలతో కూడిన చాత్రు గ్రామం జమ్మూ–కశ్మీర్‌ మధ్య కీలకంగా నిలిచింది. ఉత్తరంలో గాదర్వల్, పశ్చిమంలో అనంత్‌నాగ్, తూర్పులో లద్దాఖ్, దక్షిణంలో రజౌరీ–పూంచ్‌ వైపు మార్గాలు ఇక్కడి నుంచి సులభంగా అందుబాటులో ఉంటాయి. సింథన్‌ కనుమ దాటితే కశ్మీర్‌కు, హైవేల సమీపంలో ఉండటంతో ఉగ్రులు ఈ ప్రదేశాన్ని ఎంపిక చేసుకున్నారు. గతేడాది ఏప్రిల్, జనవరి 17, 19లో జరిగిన ఘటనల్లో ఆయుధాలు, సామగ్రి సేకరణలు దొరికి, ఈ ప్రాంతం లాజిస్టిక్‌ హబ్‌గా మారినట్టు స్పష్టమవుతోంది.
ఓవర్‌గ్రౌండ్‌ నెట్‌వర్క్‌ చాలెంజ్‌…
చిన్న గ్రామంలోనే ఏడాదికి నాలుగు ఎన్‌కౌంటర్లు జరగడం స్థానికులలో కొందరు ఉగ్రులకు సహకరిస్తున్నారనే ఆందోళనను రేకెత్తిస్తోంది. ఓవర్‌గ్రౌండ్‌ వర్కర్లు సమాచారం, ఆధారాలు, ఆర్థిక సహాయం అందించడంతోపాటు, తరలింపులు నిర్వహిస్తున్నారు. ఇది భద్రతా దళాలకు సంక్లిష్టతను పెంచుతోంది. జనవరి ఘటనల్లో ఏడుగురు భద్రతా సిబ్బంది గాయపడటం ఈ సమస్య ఎంత లోతైనదో చెబుతోంది.
ఇటీవల భద్రతా దళాలు కశ్మీర్‌ లోతులు, అంతర్జాతీయ రహదారుల నుంచి చిన్న ప్రాంతాల వైపు దృష్టి మళ్లించాయి. ఆపరేషన్‌ త్రాషీ వంటి ప్రత్యేక చర్యలు జంగిల్‌ వార్‌ఫేర్‌తో ఉగ్రులను గుర్తించి, ధ్వంసం చేస్తున్నాయి. దీర్ఘకాలంలో స్థానికులలో అవగాహన పెంపు, ఇంటెలిజెన్స్‌ నెట్‌వర్క్‌ బలోపేతం అవసరం.
Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper