spot_img
Homeక్రీడలుక్రికెట్‌India U19 World Cup : యువభారత్ కు ఇది ఆరో అండర్ 19 వరల్డ్...

India U19 World Cup : యువభారత్ కు ఇది ఆరో అండర్ 19 వరల్డ్ కప్.. గతంలో ఎవరి సారథ్యంలో గెలిచిందంటే.. 

India U19 World Cup : యువ భారత్ గెలిచింది. హరారే వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ 100 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. తద్వారా ఆరవసారి అండర్ 19 వరల్డ్ కప్ ను సొంతం చేసుకుంది. ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా భారత్ ఆవిర్భవించింది.
ఆయుష్ మాత్రే నాయకత్వంలో టీమిండియా ఏ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఈ టోర్నీలో విజయ దుందుభి మోగించింది. పాకిస్తాన్ నుంచి మొదలు పెడితే ఇంగ్లాండ్ వరకు ఏ జట్టును కూడా వదలకుండా భారత ప్లేయర్లు తమ పరాక్రమాన్ని చూపించారు. తద్వారా అండర్ 19 ఫార్మాట్లో టీమ్ ఇండియాకు ఉన్న తిరుగులేని రికార్డును కొనసాగించారు.
టీమిండియా విజయంలో వైభవ్ సూర్య వంశీ చేసిన 175 పరుగులు ముఖ్య భూమిక పోషించాయి. దీంతో భారత్ ఏకంగా 411 పరుగులు చేసింది. మిడిల్ ఆర్డర్లో బ్యాటర్లు సరిగా ఆడగలిగితే టీమిండియా మరింత భారీ స్కోర్ చేసేది. ఏది ఏమైనప్పటికీ అండర్ 19 లో టీమిండియా ఈ స్థాయిలో స్కోర్ చేయడం ఒకరకంగా ఇంగ్లాండ్ జట్టును డిఫెన్స్ లో పడేసింది.
టీమిండియా అండర్ 19 వరల్డ్ కప్ గెలవడం ఇది ఆరవసారి. మొత్తంగా అండర్ 19 ఫార్మాట్లో టీమిండియా ఫైనల్ దాకా రావడం ఇది పదవసారి. పదిసార్లు ఫైనల్ వెళితే ఆరుసార్లు ట్రోఫీని అందుకుంది టీమిండియా. తద్వారా సరికొత్త రికార్డులను సృష్టించింది.
2000 సంవత్సరంలో జరిగిన అండర్ 19 వరల్డ్ కప్లో మహమ్మద్ ఖైఫ్ నాయకత్వంలో టీమిండియా ట్రోఫీ అందుకుంది. ఆ తర్వాత 2008 సంవత్సరంలో విరాట్ కోహ్లీ సారధ్యంలో టీమిండియా అండర్ 19 వరల్డ్ కప్ గెలుచుకుంది. 2012 సంవత్సరంలో ఉన్ముక్త్ నాయకత్వంలో టీమిండియా అండర్ 19 వరల్డ్ కప్ దక్కించుకుంది. 2018లో పృథ్వి షా కెప్టెన్సీలో టీమిండియా అండర్ 19 వరల్డ్ కప్ అందుకుంది. 2022లో యష్ కెప్టెన్సీలో టీమిండియా అండర్ 19 వరల్డ్ కప్ తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు ఆయుష్  మాత్రే నాయకత్వంలో టీమిండియా అండర్ 19 వరల్డ్ కప్ దక్కించుకుంది.
ఆరుసార్లు విజేతగా నిలిచిన టీమ్ ఇండియా.. నాలుగు సార్లు రన్నర్ అప్ నిలిచింది. 2006లో రవికాంత్ నాయకత్వంలో టీమిండియా ఫైనల్ వెళ్లినప్పటికీ ట్రోఫీ అందుకోలేకపోయింది. 2016 లో ఇషాన్ కిషన్ జట్టును ఫైనల్ దాకా తీసుకెళ్లినప్పటికీ విజేతగా నిలబెట్టలేకపోయాడు. 2020లో ప్రియాం జట్టును చివరి అంచు వరకు తీసుకెళ్లినప్పటికీ ట్రోఫీ అందించలేకపోయాడు. 2024 లో ఉదయ్ నాయకత్వంలో టీమిండియా ఫైనల్ వెళ్ళినప్పటికీ విజేతగా నిలవలేకపోయింది.
Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper