Homeఎంటర్టైన్మెంట్Jana Nayagan Release : 'జన నాయగన్' టికెట్ రేట్స్ పై సీఎం విజయ్ సంచలన...

Jana Nayagan Release : ‘జన నాయగన్’ టికెట్ రేట్స్ పై సీఎం విజయ్ సంచలన నిర్ణయం..

Jana Nayagan Release : తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ నుండి రాబోతున్న మొట్టమొదటి చిత్రం ‘జన నాయగన్ ‘. జనవరి 9 న సంక్రాంతి కానుకగా విడుదల అవ్వాల్సిన ఈ సినిమా , సెన్సార్ సభ్యులు సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరించడంతో సుమారుగా 6 నెలలు వాయిదా పడి , ఎట్టకేలకు సెన్సార్ క్లియరెన్స్ ని రప్పించుకొని ఈ నెల 23 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో తెలుగు , తమిళ భాషల్లో […]

Jana Nayagan Release : తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ నుండి రాబోతున్న మొట్టమొదటి చిత్రం ‘జన నాయగన్ ‘. జనవరి 9 న సంక్రాంతి కానుకగా విడుదల అవ్వాల్సిన ఈ సినిమా , సెన్సార్ సభ్యులు సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరించడంతో సుమారుగా 6 నెలలు వాయిదా పడి , ఎట్టకేలకు సెన్సార్ క్లియరెన్స్ ని రప్పించుకొని ఈ నెల 23 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో తెలుగు , తమిళ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ దాదాపుగా అన్ని ప్రాంతాల్లో మొదలయ్యాయి. ఒక్క తమిళనాడు లోనే ఈ చిత్రం 950 థియేటర్స్ లో విడుదల కాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 3000 స్క్రీన్స్ లో రిలీజ్ ఉంటుందట. అయితే అభిమానులు ఈ చిత్రాన్ని ఏ హీరో కూడా ముట్టుకోలేని రేంజ్ కలెక్షన్స్ ని అందించాలని అందుకున్నారు.

అందుకోసం తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా టికెట్ రేట్స్ పెంచితే బాగుంటుందని సోషల్ మీడియా లో సీఎం విజయ్ ని ట్యాగ్ చేసి పోస్టులు వేశారు. కానీ విజయ్ మాత్రం అందుకు అనుమతి ఇవ్వలేదట. సినిమా అనేది ప్రేక్షకులకు తక్కువ ధర తో అందాలని , ఎలాంటి టికెట్ రేట్స్ పెంచేది లేదని , ఒకవేళ ఏ థియేటర్ అయినా టిక్కెట్ రేట్స్ పెంచినట్టు నా దృష్టికి వస్తే కఠినమైన చర్యలు తీసుకుంటానని విజయ్ హెచ్చరించారు. దీంతో సాధారణ టికెట్ రేట్స్ తోనే ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ ని బుకింగ్స్ ని తమిళనాడు లో నిన్న ప్రారంభించారు. బుకింగ్స్ మొదలు పెట్టిన అతి తక్కువ సమయం లోనే టికెట్స్ హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోయాయి. ముఖ్యంగా చెన్నై సిటీ లో టికెట్ ముక్క దొరకడం చాలా కష్టమైపోయింది. విజయ్ చివరి చిత్రం అంటే ఆ మాత్రం ఉంటుంది కదా మరీ.

అయితే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 100 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబడుతుందా లేదా అనే సందేహాలు ట్రేడ్ విశ్లేషకుల్లో ఉన్నాయి. ఎందుకంటే ఓవర్సీస్ లో ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ ఇంకా పూర్తి స్థాయిలో మొదలు అవ్వలేదు. నార్త్ అమెరికా లో సాధారణంగా ఒక సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ కనీసం రెండు వారాల ముందు మొదలు పెడుతుంటారు. కానీ ఈ చిత్రం విడుదలకు కేవలం 3 రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికీ అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టలేదు. ఇది కాస్త ఓపెనింగ్స్ పై ప్రభావం చూపించే అవకాశం ఉంది. తెలుగు లో సూపర్ హిట్ గా నిల్చిన ‘భగవంత్ కేసరి ‘ కి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటించగా , విజయ్ కి కూతురిగా మమిత బైజు నటించింది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper