Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న క్రేజీ సినిమాలో మరో కీలక పాత్ర ఉందట. ఇప్పుడు ఆ పాత్రలో కన్నడ సీనియర్ హీరో వి. రవిచంద్రన్ నటించబోతున్నాడని తెలుస్తోంది. ‘రవిచంద్రన్’ది మహేష్ కి బాబాయ్ క్యారెక్టర్ అట. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తోంది. ఫిబ్రవరి నుంచి షూట్ స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ముందుగా మహేష్ పై సోలో సాంగ్ ను అలాగే ఒక ఫైట్ ను తీస్తారట. ఆ తర్వాత లాంగ్ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తారట.
ఇక పదకొండు సంవత్సరాల తరువాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత, అల్లు అర్జున్ తో ‘అల వైకుంఠపురములో’ వంటి వరుస హిట్ చిత్రాల తర్వాత త్రివిక్రమ్ ఈ సినిమా చేస్తున్నాడు. అందుకే ఈ సినిమా పై రెట్టింపు అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ నిర్మించిబోతుంది.
ప్రస్తుతం మహేష్ బాబు , హీరోయిన్ కీర్తి సురేశ్ జంటగా నటిస్తున్న చిత్రం “సర్కారు వారి పాట”. గీత గోవిందం వంటి సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత డైరెక్టర్ పరశురామ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్, ప్రోమో వీడియో లకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తుంది. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 1 వ తేదీన రిలీజ్ కానుంది.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Kannada senior hero going to play important role in mahes babu movie
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com