Trivikram : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోల వాళ్ల కంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక స్టార్ హీరోలు పాన్ ఇండియా నేపధ్యంలో సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో యంగ్ హీరోలు సైతం వాళ్లకు పోటీని ఇచ్చే విధంగా వరుస సినిమాలను చేసుకుంటూ తనకంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొదట రైటర్ గా తన కెరీయర్ ను మొదలుపెట్టిన ‘త్రివిక్రమ్ శ్రీనివాస్’ (Trivikram Srinivas) చాలా తొందరగా స్టార్ రైటర్ గా ఎదగడమే కాకుండా భారీ రెమ్యూనరేషన్ తీసుకునే రైటర్ గా కూడా పేరు సంపాదించుకున్నాడు. ఇక ఇలాంటి సందర్భంలోనే ఆయన అందించిన కథలకు మంచి గుర్తింపు రావడమే కాకుండా స్టార్ రైటర్ గా కొన్ని సంవత్సరాలపాటు వెలుగొందాడు. ఇక ఆ తర్వాత ఆయన దర్శకుడిగా మారి వరుస సినిమాలు చేస్తూ మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఆయన అల్లు అర్జున్ (Allu Arjun) తో ఒక సినిమా చేయాల్సింది. కానీ ఆ ప్రాజెక్టు ఇప్పుడప్పుడే స్టార్ట్ అయ్యే విధంగా కనిపించడం లేదు. ఇక అల్లు అర్జున్ మొదట త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి కమిట్ అయినప్పటికి మధ్యలో తమిళ్ డైరెక్టర్ అయిన అట్లీ ఎంట్రీ ఇవ్వడంతో ప్రాజెక్ట్ హోల్డ్ లో పడింది. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీతో సినిమా చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది.
Also Read : బన్నీ పక్కన పెట్టాడు.. ప్రభాస్ కి గాలం వేస్తున్న త్రివిక్రమ్… సెట్ చేసే పనిలో ఆ స్టార్ ప్రొడ్యూసర్
త్రివిక్రమ్ సైతం అల్లు అర్జున్ ని పక్కన పెట్టి ప్రభాస్ తో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. నిజానికి ప్రభాస్ సైతం ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు. మూడు సంవత్సరాల వరకు అతని డేట్స్ అయితే ఖాళీగా లేవు. మరి ఇలాంటి సందర్భంలో త్రివిక్రమ్ ప్రభాస్ తో సినిమా చేయాలంటే చాలా సమయం పట్టే అవకాశాలైతే ఉన్నాయి. కానీ త్రివిక్రమ్ మాత్రం ప్రభాస్ తోనే సినిమా చేయాలని అనుకుంటున్నాడట.
మరి ఏది ఏమైనా కూడా త్రివిక్రమ్ ఇప్పుడు ఎవరితో సినిమా చేయబోతున్నాడనేది అనౌన్స్ అయితే తప్ప సరైన క్లారిటీ అయితే రాదనే చెప్పాలి. ఎందుకంటే అటు అల్లు అర్జున్ బిజీగా ఉన్నాడు, ఇటు ప్రభాస్ సైతం బిజీగానే ఉన్నాడు, మరి ఈ ఇద్దరు హీరోల మధ్య త్రివిక్రమ్ ఎవరితో సినిమా చేస్తాడు. ఎలాంటి సినిమా చేస్తాడు తద్వారా ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధించబోతున్నాడనేది కూడా ఇప్పుడు కీలకంగా మారబోతుంది.
ఇంకా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లందరూ వరుస సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. కానీ ఇప్పటివరకు ఒక పాన్ ఇండియా సినిమా కూడా చేయని త్రివిక్రమ్ మాత్రం చాలా వరకు సతమతమవుతూ కన్ఫ్యూజన్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి తను అనుకున్నట్టుగానే ఒక భారీ సినిమాను స్టార్ హీరో తో చేసి సూపర్ సక్సెస్ ని సాధిస్తే తప్ప ఆయనకు మరోసారి పూర్వ వైభవం అయితే రాదనే చెప్పాలి…
Also Read : త్రివిక్రమ్ ను ఇండస్ట్రీ కి ఎందుకు తీసుకువచ్చారు అంటూ పోసాని మీద ఘాటు కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్…