Seethamma Vakitlo Sirimalle Chettu : రీ రిలీజ్ చిత్రాలలో అత్యధిక వసూళ్లను రాబెట్టే హీరోలలో సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu) ముందు వరుసలో ఉంటాడు. మన టాలీవుడ్ లో , నేటి తరం హీరోలలో మహేష్ బాబు కి ఉన్నన్ని కల్ట్ క్లాసిక్ చిత్రాలు ఏ హీరోకి కూడా లేవని అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆయన ఫ్లాప్ సినిమాలు కూడా కాలం గడిచే కొద్దీ కల్ట్ క్లాసిక్ స్థాయిని దక్కించుకుంటూ ఉంటాయి. ఉదాహరణకు ఖలేజా, 1 నేనొక్కడినే, గుంటూరు కారం వంటివి ఉన్నాయి. వీటిని రీ రిలీజ్ చేసినా బంపర్ రెస్పాన్స్ వస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రీసెంట్ గానే మహేష్ కెరీర్ లో ఆల్ టైం క్లాసిక్ గా నిల్చిన చిత్రాలలో ఒకటైన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె'(#SVSCReRelease) ని గ్రాండ్ రీ రిలీజ్ చేశాడు ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు.
థియేటర్స్ లో ప్రస్తుతం ఏ సినిమా లేదు కదా, కనీసం థియేటర్స్ నడిచేందుకు ఫీడింగ్ కోసం అయినా పనికొస్తుందని ఈ సినిమాని రిలీజ్ చేసారు. కానీ రెస్పాన్స్ కలలో కూడా ఊహించని రేంజ్ లో వచ్చింది. దాదాపుగా థియేట్రికల్ రన్ క్లోజింగ్ కి వచ్చేసిన ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల 20 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఇది సాధారణమైన విషయం కాదు. దీంతో టాలీవుడ్ లో రీ రిలీజ్ సినిమాలలో అత్యధిక 5 కోట్ల రూపాయిల గ్రాస్ సినిమాలు కలిగిన హీరోగా మహేష్ బాబు చరిత్ర సృష్టించాడు. మురారి, బిజినెస్ మ్యాన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చిత్రాలు 5 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టాయి. ఇక ఆయన తర్వాతి స్థానంలో పవన్ కళ్యాణ్ మాత్రమే ఉన్నాడు. ఆయన హీరో గా నటించిన ఖుషి, గబ్బర్ సింగ్ చిత్రాలు రీ రిలీజ్ లో 5 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టాయి.
మిగిలిన స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా రేంజ్ కి తమ స్థాయిని విస్తరింపచేసుకున్నప్పటికీ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు దరిదాపుల్లోకి కూడా రాలేకపోతున్నారు. మహేష్ బాబు తన కల్ట్ క్లాసిక్ సినిమాలతో ఈ ఫీట్ ని చేసి చూపిస్తే, పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) తనకు ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ పవర్ తో రీ రిలీజ్ రికార్డ్స్ పెట్టాడు. ఇలా ఇద్దరికీ ఇద్దరే, వీళ్లకు పోటీ మరో హీరో లేరు అన్నట్టు సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతుంది. ఇకపోతే ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ కే ఈ రేంజ్ గ్రాస్ వస్తే, ఇక మహేష్ ఫ్యాన్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘అతడు’ సినిమాకు ఏ రేంజ్ గ్రాస్ వస్తుందో మీ ఊహలకే వదిలేస్తున్నాం అంటూ మహేష్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆగస్టు 9 న మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Also Read : ఓవర్సీస్ లో 2వ రోజు కూడా దుమ్ములేపిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ రీ రిలీజ్..ఎంత గ్రాస్ వచ్చిందంటే!