Mahesh Babu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు కృష్ణ(Krishna)… ఆయన కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు తండ్రికి తగ్గ తనయుడుగా మంచి ఇమేజ్ ను సంపాదించుకోవడమే కాకుండా సూపర్ స్టార్ ఇమేజ్ ను అందుకున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే మహేష్ బాబు వరస సినిమాలను చేస్తూ మంచి విజయాలను సాధిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇక మీదట ఆయన సాధించబోయే సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ప్రస్తుతం ఆయన రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ తో పాటు ప్రపంచంలో ఉన్న ప్రేక్షకులందరిని అలరించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ఇప్పటివరకు ఆయన పాన్ ఇండియా సినిమా చేయకపోయిన రాజమౌళి సహకారంతో డైరెక్ట్ గా పాన్ వరల్డ్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు.
Also Read : జూనియర్ ఎన్టీఆర్ డిజాస్టర్ మూవీ టైటిల్ తో మహేష్ బాబు, రాజమౌళి సినిమా తెరకెక్కుతుందా..? ఇదేమి ట్విస్ట్ సామీ!
ఈ సినిమా మీద ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ ని సాధిస్తే ఆయనకున్న మార్కెట్ భారీగా పెరగడమే కాకుండా తెలుగు సినిమా స్థాయిని కూడా ప్రపంచ లెవెల్ కి తీసుకెళ్లిన వాళ్ళుగా మంచి గుర్తింపును సంపాదించుకుంటారు. తద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ అంచలంచెలుగా ఎదుగుతూ ముందుకు దూసుకెళ్తుంది. మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నటుడిగా మహేష్ బాబు కి మంచి గుర్తింపైతే ఉంది.
మరి దానిని ఇకమీదట రాబోయే సినిమాలతో కాపాడుకుంటూ మంచి విజయాలను అందుకోవాలని అతని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక గతంలో మహేష్ బాబుకి ఒక మంచి పాత్ర చేసే అవకాశమైతే వచ్చింది. కానీ ఆ అవకాశాన్ని తను చేజార్చుకున్నాడు నిజానికి గుణశేఖర్ లాంటి దర్శకుడు ఛత్రపతి శివాజీ కథ ఆధారంగా ఒక సినిమాను తెరకెక్కించాలని చూశాడు. ఆ స్టొరీ ని మహేష్ బాబు కి వినిపించాడట.
మహేష్ బాబుకి ఆ కథ బాగా నచ్చినప్పటికి ఆ క్యారెక్టర్ లో తనను తాను ఊహించుకోలేనని అలాంటి ఒక గొప్ప వ్యక్తి చరిత్రలో తను నటించే సాహసం చేయలేనని చెప్పి ఆ పాత్రను రిజెక్ట్ చేశారట. ఇక ఎప్పుడు శివాజీ కొడుకు అయిన శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా బాలీవుడ్ లో తెరకెక్కిన ‘ఛావా'(Chavaa) సినిమా భారీ రికార్డులను క్రియేట్ చేస్తూ ముందుకు సాగుతుంది. ఇక అలాగే రిషబ్ శెట్టి కూడా ఛత్రపతి శివాజీ జీవిత కథ ఆధారంగా ఒక సినిమా చేస్తున్నాడు. శివాజీ పాత్రను మహేష్ బాబు చేసి ఉంటే మంచి గుర్తింపు వచ్చేది అని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…
Also Read : జీవితంలో మహేష్ బాబుతో నటించకూడదని ఫిక్స్ అయిన సౌందర్య.. కారణం ఏమిటో తెలుసా?