Seethamma Vakitlo Sirimalle Chettu : సూపర్ స్టార్ మహేష్ బాబు(Super Star Mahesh Babu) ని ఓవర్సీస్ కింగ్ అని పిలవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అప్పటి వరకు ఒక మోస్తారు మార్కెట్ మాత్రమే మన తెలుగు సినిమా ఇండస్ట్రీ కి ఓవర్సీస్ లో ఉండేది. కానీ మహేష్ బాబు మన మార్కెట్ ని తారాస్థాయికి తీసుకెళ్లాడు. ఆయన హీరోగా నటించిన దూకుడు సినిమాతో మన తెలుగు సినిమాకి మొట్టమొదటి 1 మిలియన్ డాలర్ సినిమాని అందించాడు. ఆరోజుల్లో దూకుడు చిత్రం 1 మిలియన్ గ్రాస్ ని రాబట్టగానే అందరూ షాక్ కి గురయ్యారు. మన టాలీవుడ్ కి ఇంత పొటెన్షియల్ ఉందా అని ఈ సినిమాతోనే రుజువు అయ్యింది. ఈ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్(Deputy Cm Pawan Kalyan) ‘గబ్బర్ సింగ్’ తో 1 మిలియన్ మార్కుని అందుకున్నాడు. కానీ ఓవర్సీస్ లో అప్పట్లో ఓపెనింగ్స్ దగ్గర నుండి క్లోజింగ్ వరకు అన్ని మహేష్ ఖాతాలోనే ఉండేవి. ఆయన ఫ్లాప్ సినిమాలు సైతం ఆరోజుల్లోనే 1 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టేవి.
అందుకే మహేష్ బాబు ని ఓవర్సీస్ కింగ్ అని పిలిచేవారు అక్కడి ట్రేడ్ పండితులు. ఇప్పుడు పాన్ ఇండియన్ సినిమాల ట్రెండ్ లో మహేష్ బాగా వెనుకబడ్డాడు, ప్రభాస్, అల్లు అర్జున్ స్థాయి వసూళ్లు ఇక ఓవర్సీస్ లో అతనికి రావేమో అని కొంతమంది అనుకున్నారు. కానీ మహేష్ క్రేజ్ ఓవర్సీస్ లో చెక్కు చెదరలేదు అనేది రీసెంట్ రీసెంట్ గా రీ రిలీజ్ అయిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'(#SVSCReRelease) సినిమాతో రుజువు అయ్యింది. మొదటి రోజు ఈ చిత్రానికి నార్త్ అమెరికా లో 22 వేల డాలర్లు వచ్చాయి. అదే విధంగా రెండవ రోజు కూడా అదే తరహా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. మొత్తం మీద రెండు రోజులకు కలిపి 44 వేల డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, సరైన ప్లానింగ్ తో వచ్చి ఉండుంటే కచ్చితంగా ఆల్ టైం రికార్డుని నెలకొల్పేది అని మహేష్ ఫ్యాన్స్ అంటున్నారు. ప్రస్తుతం నార్త్ అమెరికా లో ఆల్ టైం రికార్డు గ్రాస్ ని రాబట్టిన సినిమాగా పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ చిత్రం నిల్చింది. ఈ సినిమాకి 66 వేల డాలర్లు వచ్చాయి.
Also Read : రీ రిలీజ్ కి సిద్దమైన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ మూవీ..త్వరలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్!