spot_img
Homeజాతీయ వార్తలుBJP Manifesto: కాంగ్రెస్ కంటే కూడా.. బీజేపీ మేనిఫెస్టోలో ఏం ఉండనుంది..?

BJP Manifesto: కాంగ్రెస్ కంటే కూడా.. బీజేపీ మేనిఫెస్టోలో ఏం ఉండనుంది..?

BJP Manifesto: పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మేనిఫెస్టో రెడీ అయింది. కాంగ్రెస్‌ ఇప్పటికే మేనిఫెస్టో విడుదల చేసింది. పాంచ్‌ న్యాయ్‌.. పచ్చీస్‌ గ్యారంటీ పేరుతో మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఇప్పడు కాంగ్రెస్‌కు దీటుగా బీజేపీ మేనిఫెస్టోను సిద్ధం చేసింది ‘మోదీస్‌ గ్యారెంటీ.. డెవలప్డ్‌ ఇండియా 2047’ అనే థీమ్‌తో లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను సిద్ధం చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డా, హోం మంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ తదితరుల సమక్షంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ మేనిఫెస్టోను ఆదివారం(ఏప్రిల్‌ 14న) విడుదల చేయనున్నారు.

అభివృద్ధిపై ప్రధాన దృష్టి..
ఇక బీజేపీ జాతీయ మేనిఫెస్టోలో ప్రధానంగా అభివృద్ధి భారతంపైనే ఫోకస్‌ పెట్టినట్లు తెలుస్తోంది. మహిళలు, యువత, పేదలు, రైతుల అభ్యున్నతికి మేనిఫెస్టో భరోసా ఇవ్వనున్నట్లు సమాచారం. సాధ్యమయ్యే హామీలను మాత్రమే ఇవ్వడం, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం మేనిఫెస్టో ప్రధాన ఉద్దేశంగా చెప్పనుంది. కల్చరల్‌ నేషనలిజంపై దృష్టిసారిస్తూ 2047 నాటికి అభివృద్ధి భారతం సాధిస్తామనేది మోదీ ప్రధాన గ్యారెంటీగా ఉండనుంది. ‘సబ్‌ కా సాథ్‌ సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్‌ సబ్‌కా ప్రయాస్‌’ అనే మంత్రంతో సంకల్ప్‌ పాత్ర (బీజేపీ మేనిఫెస్టో) ఉంటుంది.

మేనిఫెస్టో కమిటీ..
ఇదిలా ఉండగా మేనిఫెస్టో రూపకల్పనకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సారథ్యంలోని మేనిఫెస్టో కమిటీ ఇప్పటికీ రెండుసార్లు సమావేశమైంది. మేనిఫెస్టో కోసం ప్రజల నుంచి సూచనలు స్వీకరించింది. 15 లక్షల సూచనలు బీజేపీకి వచ్చాయి. వాటిలో 4 లక్షల సూచనలు నమో యాప్‌ ద్వారా, 11 లక్షల సలహాలు వీడియోల రూపంలో వచ్చాయి. 27 మందితో కూడిన మేనిఫెస్టో కమిటీకి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కో–ఆర్డినేటర్‌గా, కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ కో–కోఆర్డినేటర్‌గా ఉన్నారు. ఇక 543 మంది సభ్యులున్న 18వ లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్‌ 19తో మొదలు కానున్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ 14న మేనిఫెస్టో విడుదల చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper