Homeజాతీయ వార్తలుహరీశ్‌కు ఎమ్మెల్సీ బాధ్యతల వెనుక ఉన్న ఆంతర్యం అదేనా

హరీశ్‌కు ఎమ్మెల్సీ బాధ్యతల వెనుక ఉన్న ఆంతర్యం అదేనా

Harish Rao
తెలంగాణలో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల సీజన్‌ నడుస్తోంది. మరికొద్ది రోజుల్లో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్‌ జరగబోతోంది. ఈ ఎన్నికల్లో గెలుపొందేందుకు పార్టీలు కష్టపడుతూనే ఉన్నాయి. ఎలాగైనా ఆ రెండు సీట్లను తమ ఖాతాల్లోనే వేసుకోవాలని ప్రధాన పార్టీలన్నీ యుద్ధం చేస్తున్నాయి. అటు అధికార పార్టీ సైతం ఈ రెండు సీట్లను ఛాలెంజ్‌గా తీసుకుంది. ఇప్పటికే మంచి ఊపుతో ఉన్న బీజేపీ పోరాడుతోంది. కాంగ్రెస్‌ కూడా అదే స్థాయిలో కష్టపడుతోంది.

Also Read: భాగ్యనగరిలో బతుకు భారం?

అయితే.. అధికార టీఆర్‌‌ఎస్‌ పార్టీ మాత్రం హైదరాబాద్‌–రంగారెడ్డి–మహబూబ్‌నగర్‌‌ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న పీవీ కుమార్తె వాణీదేవిని గెలిపించేందుకు ట్రబుల్‌ షూటర్‌‌ హరీశ్‌ రావుకు బాధ్యతలు ఇచ్చారు. అయితే.. చాలాకాలంగా పార్టీలో సైడవుతూ వచ్చిన హరీష్ రావు.. ఇటీవలి కాలం వరకు ఉమ్మడి మెదక్ జిల్లాకే పరిమితం అయ్యారు. పార్టీలోనూ ఆయనకు ఎలాంటి ప్రాధాన్యం దక్కడం లేదు. ఆర్థిక మంత్రిగా నామమాత్రంగా ఉన్నారు అంతే. ఆయన నిర్వహిస్తున్న విధులు కూడా పెద్దగా లేవు. దుబ్బాక ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన పనైపోయిందని అనుకున్నారు. కానీ.. ఇప్పుడు ఆయన అవసరం కేసీఆర్‌‌కు పడింది.అందుకే ప్రగతి భవన్‌కు పిలిపించి మరీ కీలక బాధ్యతలిచ్చారు.

ఇటీవల టీఆర్ఎస్ కు వరుస ఎన్నికల్లో చేదు అనుభవం ఎదురవుతోంది. బీజేపీ స్పీడ్‌లో దూసుకెళ్తోంది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీలో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. పీఆర్సీ రాక ఉద్యోగులు, నియామకాల పట్ల నిరుద్యోగ యువత ఇప్పటికే అసంతృప్తితో ఉన్నారు. ఈ ఎన్నికల్లో కూడా ఓడితే పార్టీ మీద తీవ్ర ప్రభావం ఉంటుంది. అందుకే.. పార్టీకి వ్యతిరేక ఓట్లు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేస్తున్న రంగారెడ్డి జిల్లా బాధ్యతలను హరీశ్‌ రావుకు పిలిచి మరీ అప్పగించారు. కేసీఆర్ చెప్పిన వెంటనే రంగంలోకి దిగిన హరీశ్‌ జోరుగా ప్రచారం చేస్తున్నారు. తెరవెనుక వ్యూహాలను కూడా ప్రారంభించారు. ఇతర పక్షాలకు అనుకూలంగా ఉన్నాయనే ఓట్ల లెక్కలు తీసి తమ వైపు తిప్పే పని మొదలు పెట్టారు.

Also Read: రామచంద్రయ్య ప్లేసులో ఎమ్మెల్సీ దక్కాల్సింది ఆయనకట?

ఇదిలా ఉండగా.. కేసీఆర్‌‌ వ్యూహంపై టీఆర్‌‌ఎస్‌లోనూ భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపిస్తే ఆ క్రెడిట్ కేసీఆర్‌‌కు పోతుందని.. ఓడిపోతే హరీశ్‌ ఖాతాలో మరో మైనస్ వేయవచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది. హరీశ్‌ టీఆర్ఎస్‌లో ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారన్నది నిజం. ఆయనకు పూర్వ వైభవం వస్తుందా లేకపోతే.. ఓటములకు బాధ్యుల్ని చేసి ప్రయత్నం చేస్తున్నారా అన్నది ఎవరికీ అంతు చిక్కని విషయంగా మారింది. పోలింగ్‌ ముగిసి రిజల్ట్‌ వస్తే కానీ తెలియదు మొత్తం పరిస్థితులు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper