
కొద్ది రోజుల క్రితమే మినీ సంగ్రామానికి తెరలేపుతూ కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించేసింది. దీంతో ప్రధాన పార్టీలన్నీ రెడీ అవుతున్నాయి. మినీ సంగ్రామంలో సత్తాచాటాలని ఆరాటపడుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల్లో విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ కూడా ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read: భాగ్యనగరిలో బతుకు భారం?
ఇప్పటికే బీహార్ ఎన్నికల్లో అంతో ఇంతో పార్టీ సత్తా చాటిన ఎంఐఎం.. ఇప్పుడు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేయనున్నట్లు ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. మీడియాతో మాట్లాడిన ఒవైసీ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘మేము తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాం. గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మా అభ్యర్థులు కొందరు విజయం సాధించారు. నేను పార్టీ సభ్యులతో సమీక్ష జరిపేందుకు రాజస్తాన్ వెళ్తున్నాను. మా పార్టీ కార్యకర్తలు ఉత్తరప్రదేశ్‌లో చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు’ అని చెప్పారు.
తమిళనాడులో ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 234 స్థానాలకు ఏప్రిల్ 6న పోలింగ్ జరగనుంది. మరోవైపు పశ్చిమ బెంగాల్‌లో 8 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మే 2న అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. పశ్చిమ బెంగాల్‌లో ఎంఐఎం బరిలో నిలిచే అంశంపై స్పందిస్తూ.. సరైనా సమయంలో ఈ అంశంపై మాట్లాడతానని చెప్పారు. గతవారం కోల్‌కతా ఎంఐఎం పార్టీ ర్యాలీకి అనుమతించకపోవడంతో.. అక్కడి తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒవైసీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: రామచంద్రయ్య ప్లేసులో ఎమ్మెల్సీ దక్కాల్సింది ఆయనకట?
‘తృణమూల్ కాంగ్రెస్ నేతలు పార్లమెంట్‌లో ప్రజాస్వామ్యం, భావ ప్రకటన స్వేచ్ఛ, అసమ్మతి గురించి చాలా గొప్పగా మాట్లాడతారు. కానీ వారిది ద్వంద్వ వైఖరి. వారు ఢిల్లీలో ఒకటి మాట్లాడతారు.. బెంగాల్‌లో అందుకు వ్యతిరేకంగా నడుచుకుంటారు’ అని ఒవైసీ విమర్శించారు. ఇక.. బెంగాల్‌లో అబ్బాస్ సిద్దిఖి నేతృత్వంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్‌తో ఎంఐఎం జత కట్టనుందనే వార్తలు వచ్చాయి. మరోవైపు.. ఇప్పటికే మహారాష్ట్ర, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం తన సత్తా చాటిన సంగతి తెలిసిందే. బలం ఉన్న చోట అభ్యర్థులను నిలిపిన ఎంఐఎం.. మంచి ఓటు బ్యాంకునే సాధించింది. ఇటీవల గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కొన్ని డివిజన్లలో విజయం సాధించింది. అదే జోష్‌తో తమిళనాడు ఎన్నికలకు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్