Bengal Record Polling: పశ్చిమ బెంగాల్‌లో తొలివిడత పోలింగ్ ముగిసింది. 92 శాతానికిపైగా పోలింగ్ నమోదైంది. ఈసారి పశ్చిమబెంగాల్‌లో అద్భుతం జరిగింది. సర్ పేరుతో ఓట్లు తొలగించిన తర్వాత కూడా 152 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్లు సునామీ తరహాలో పోటెత్తారు. గత రికార్డులు బద్దలు కొట్టారు. సీఆర్పీఎఫ్ జవాన్లను మోహరించడం, పోలింగ్‌ను లైవ్ టెలికాస్ట్ చేయడం, అక్రమాలను నిరోధించడం, ఒకరి ఓటు మరొకరు వేయకుండా కఠినం చేయడంతో ఈసారి పోలింగ్ భారీగా పెరిగింది.
పోలింగ్ ట్రెండ్స్ ఇలా..
152 నియోజకవర్గాల్లో 3.60 కోట్ల ఓటర్లు పాల్గొన్నారు. 11 గంటలకు 42 శాతం, మధ్యాహ్నం 62 శాతం, 3 గంటలకు 78.77 శాతం (2021లో 71 శాతం) నమోదైంది. 7 గంటల వరకు 92 శాతం రికార్డు సాధించారు. సీఆర్‌పీఎఫ్ జవాన్ల మోహరింపు, లైవ్ టెలికాస్ట్, అక్రమాల నిరోధం, ఒకే ఓటు నియమం అమలుతో నమ్మకం పెరిగింది. ’సర్’ పేరుతో ఓట్లు తొలగింపు తర్వాత నిజ ఓటర్లు నిర్భయంగా ఓటు వేశారు..
సామాజిక విభజన
హిందూ మెజారిటీ నియోజకవర్గాల్లో పోలింగ్ భారీగా ఉండగా, ముస్లిం ప్రాంతాల్లో 75 శాతం వరకు నమోదైంది. బీజేపీ అనుకూల 152 సీట్లలో ఈ ట్రెండ్ పార్టీకి ప్రయోజనం కలిగించవచ్చు. భారీ పోలింగ్ టీఎంసీ ప్రభుత్వంపై వ్యతిరేకతకు సంకేతం. బీజేపీకి నుకూలంగా మారితే మమతా బెనర్జీ పాలిటికల్ బలం తగ్గవచ్చు. ముస్లిం ప్రాంతాల్లో తగ్గిన ఓటింగ్ సెక్యులర్ పార్టీలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
25 ఏళ్ల తర్వాత రెండు విడతల్లోనే ఎన్నికలు. మొదటి దశ ఉత్సాహం రెండో విడత (142 సీట్లు)లో కొనసాగితే బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పు ఖాయం. 10–15 సీట్ల తగ్గుదల టీఎంసీ పతనానికి దారితీస్తుంది. రికార్డు పోలింగ్ ఎవరిని విజయ తీరాలకు చేరుస్తుందో.. ఎవరిని అధః పాతాళానికి తొక్కుతుందో చూడాలి.