Homeజాతీయ వార్తలుExit Polls 2026 : 4 రాష్ట్రాలు, పుదుచ్చేరి లో అధికారం ఎవరిదంటే

Exit Polls 2026 : 4 రాష్ట్రాలు, పుదుచ్చేరి లో అధికారం ఎవరిదంటే

Exit Polls 2026 హోరాహోరీగా సాగిన నాలుగు రాష్ట్రాల, ఒక కేంద్రపాలిత ప్రాంత ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. బుధవారం ఆయా సంస్థలు సాయంత్రం తర్వాత తమ పరిశీలనలో వెళ్లడైన ఫలితాలను తెలిపాయి.. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి ఎన్నికలు జరిగాయి. తమిళనాడు రాష్ట్రంలో ఈసారి విభిన్నమైన ఫలితం వచ్చే అవకాశం లేదని.. కేరళ రాష్ట్రంలో యుడిఎఫ్, అస్సాం, పుదుచ్చేరి ప్రాంతంలో ఎన్డీఏ గెలుపు ఖాయమని అన్ని సంస్థలు దాదాపుగా అంచనా వేశాయి. బెంగాల్ రాష్ట్రంలో మాత్రం పీ మార్క్, మాట్రిచ్, చాణక్య స్ట్రాటజీస్ బిజెపి వైపు మొగ్గు చూపించాయి. పీపుల్స్ పల్స్, జన్మత్ పోల్స్ టీఎంసీ వైపు ఆసక్తి చూపించాయి. మే 4న ఈ రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయి.

తమిళనాడు రాష్ట్రంలో మరోసారి

తమిళనాడు రాష్ట్రంలో మరోసారి డీఎంకే అధికారాన్ని చేపడుతుందని ఆయా సంస్థల ఎగ్జిట్ పోల్స్ లో తెలియ వచ్చింది. ద్రావిడ సెంటిమెంట్, సీఎం స్టాలిన్ మార్క్ ప్రజాకర్షక పథకాలు మరోసారి వర్క్ అయినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడంలో విజయ్ కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఏఐడీఎంకె, ఎన్డీఏ కూటమి అంతగా ఇక్కడ ప్రభావం చూపించలేదని సమాచారం. తమిళనాడు రాష్ట్రంలో 180+ సీట్లతో డిఎంకె కూటమి విజయం సాధిస్తుందని స్మార్ట్ పోల్ సర్వే సంస్థ వెల్లడించింది. ఏఐడీఎం కే కూటమికి 28 సీట్లు, టీవీ కేకు 26 సీట్లు వస్తాయని వెల్లడించింది. ఓటు షేర్ ప్రకారం చూసుకుంటే డీఎంకేకు 42.3, ఏఐడీఎం కేకు 27.6, టీవీ కేకు 26.2% వస్తుందని తెలిపాది. మ్యాట్రిజ్ సర్వే సంస్థ డీఎంకేకు 122 నుంచి 132 సీట్లు వస్తాయని పేర్కొంది. ఏఐడీఎం కేకు 87 నుంచి 110 సీట్లు, టీవీకే కు పది నుంచి 12 స్థానాలు వస్తాయని ప్రకటించింది..

యాక్సిస్ మై ఇండియా సర్వే సంస్థ మాత్రం టీవీకే విషయంలో సంచలన విషయాన్ని వెల్లడించింది. తమిళనాడు రాష్ట్రంలో విజయ్ టీవీకే పార్టీ 98 నుంచి 120 స్థానాలు సాధించి అధికారాన్ని దక్కించుకుంటుందని ప్రకటించింది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఆయన ముఖ్యమంత్రి అవుతారు.. డీఎంకే 92 నుంచి 110, ఏఐడీఎంకే 22 నుంచి 32 స్థానాలు వస్తాయని ఆ సర్వే సంస్థ ప్రకటించింది.

వెస్ట్ బెంగాల్ లో..

చాణక్య స్ట్రాటజీస్ సర్వే ప్రకారం వెస్ట్ బెంగాల్లో బిజెపి, తమిళనాడులో డీఎంకే అధికారంలోకి వస్తుందని తెలిసింది.. వెస్ట్ బెంగాల్లో 294 స్థానాలకు బీజేపీ 150 నుంచి 160, టీ ఎంసీ 130 నుంచి 140, కాంగ్రెస్ 2 నుంచి నాలుగు, ఇతర పార్టీలు నాలుగు నుంచి ఆరు సీట్లు గెలుచుకుంటాయని తెలిసింది. తమిళనాడు రాష్ట్రంలో డీఎంకే మరోసారి అధికారులు దక్కించుకుంటుందని సమాచారం. 234 స్థానాలకు గాను కూటమి 145-160 సీట్లు, AIDMK 50-65, TVK 13-18, ఇతర పార్టీలు 5-8 సీట్లు గెలుచుకుంటాయని తెలిసింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper