Homeక్రీడలుక్రికెట్‌Ben Stokes: ఒంట్లో కండలేదు.. కళ్ళల్లో కాంతి లేదు.. ఈ ఆటగాడికి ఏమైంది..

Ben Stokes: ఒంట్లో కండలేదు.. కళ్ళల్లో కాంతి లేదు.. ఈ ఆటగాడికి ఏమైంది..

Ben Stokes: బవిరి గడ్డం.. బలమైన దేహం.. వేగంగా పరుగులు తీసే సామర్థ్యం.. కఠినంగా బంతులు వేసే నైపుణ్యం.. రోజుల తరబడి బ్యాటింగ్ చేసే దారుఢ్యం అతడి సొంతం. అలాంటి ఆటగాడు ఇప్పుడు కుంగి పోయాడు. కళ్ళల్లో కాంతి లేదు. దేహంలో శక్తి లేదు.. ఒంట్లో జీవం లేదు. మొత్తంగా అతడు స్కెల్టన్ లాగా మారిపోయాడు. గొప్పగా ఆడి.. అద్భుతమైన ఇన్నింగ్స్ నిర్మించిన అతడు ఇప్పుడు దారుణంగా మారిపోయాడు. ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు కెప్టెన్ స్టోక్స్ దేహ […]

Ben Stokes: బవిరి గడ్డం.. బలమైన దేహం.. వేగంగా పరుగులు తీసే సామర్థ్యం.. కఠినంగా బంతులు వేసే నైపుణ్యం.. రోజుల తరబడి బ్యాటింగ్ చేసే దారుఢ్యం అతడి సొంతం. అలాంటి ఆటగాడు ఇప్పుడు కుంగి పోయాడు. కళ్ళల్లో కాంతి లేదు. దేహంలో శక్తి లేదు.. ఒంట్లో జీవం లేదు. మొత్తంగా అతడు స్కెల్టన్ లాగా మారిపోయాడు. గొప్పగా ఆడి.. అద్భుతమైన ఇన్నింగ్స్ నిర్మించిన అతడు ఇప్పుడు దారుణంగా మారిపోయాడు.

ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు కెప్టెన్ స్టోక్స్ దేహ ఆకృతి పూర్తిగా మారిపోయింది. బవిరి గడ్డం లేదు.. వేగంగా పరుగులు పెట్టే సామర్థ్యం లేదు. అతడు పూర్తిగా మారిపోయాడు. సింహబలుడిగా కనిపించే అతడు చిక్కిపోయి దర్శనమిస్తున్నాడు.. అసలు ఇలా అతడు ఎలా మారిపోయాడు.. ఇంతలా ఎందుకు బక్క చిక్కిపోయాడని సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.. టయోటా కంపెనీ తో కలిసి ఇంగ్లాండ్ బోర్డు ఒక వీడియో షేర్ చేసింది. ఆ వీడియోలో స్టోక్స్ పూర్తిగా బక్క చిక్కిపోయి కనిపించాడు. అతడి కళ్ళల్లో కళ ఏ మాత్రం లేదు. ఇటీవల ప్రాక్టీస్ మ్యాచ్లో అతని ముఖానికి తీవ్రమైన గాయమైంది. వైద్యులు పదవికి మేజర్ ఫేషియల్ సర్జరీ చేశారు. దీంతో అతడు ఇలా మారిపోయాడు. వాస్తవానికి ఫేషియల్ సర్జరీ చేస్తే ఇలా అయిపోతారు అంటూ సోషల్ మీడియాలో అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

స్టోక్స్ నాయకత్వంలో ఇంగ్లాండ్ జట్టు ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేకపోతోంది. అంతకుముందు టీమిండియాతో టెస్ట్ సిరీస్ సమం చేసుకుంది. ఆస్ట్రేలియా జట్టు చేతిలో యాషెస్ సిరీస్ కోల్పోయింది. ఆటగాళ్లలో క్రమశిక్షణ కూడా లోపించింది. వరుస ఓటములు ఎదురవుతున్నప్పటికీ.. ప్లేయర్లు తప్ప తాగడం.. మీడియా ముందు చిందులు తొక్కడంతో విమర్శల పాలయ్యారు. చివరికి మేనేజ్మెంట్ కల్పించుకొని హెచ్చరికలు జారీ చేయడంతో ఆటగాళ్లు మారారు.

ఇంగ్లాండ్ జట్టు వరుసగా ఓటములు ఎదుర్కొంటున్న నేపథ్యంలో స్టోక్స్ ను సారధిగా తప్పిస్తారని అప్పట్లో వార్తలు వచ్చాయి. మేనేజ్మెంట్ కూడా ఆ వైపుగా దృష్టి సారించినట్టు ప్రచారం కూడా జరిగింది. చివరికి అలాంటిదేమీ లేదని మేనేజ్మెంట్ ప్రకటించింది. కాకపోతే జట్టు కూర్పులో ఇకపై కఠిన నిబంధనలు విధిస్తామని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ నేపథ్యంలో స్టోక్స్ తన మునుపటి ఆటను ప్రదర్శించడానికి కసరత్తు చేస్తున్నాడు. ఫిబ్రవరి నెలలో ప్రాక్టీస్ మ్యాచ్ జరిగిన నేపథ్యంలో అతడు గాయపడ్డాడు. చివరికి వైద్యులు ఫేషియల్ సర్జరీ చేశారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper