Homeఆంధ్రప్రదేశ్‌భవిష్యత్తులో పవన్–-షర్మిల మధ్యే పోటీ..?

భవిష్యత్తులో పవన్–-షర్మిల మధ్యే పోటీ..?

పవన్‌ కల్యాణ్ పార్టీ పెట్టి ఏండ్లు గడుస్తున్నాయి. కానీ.. ఇంతవరకు తెలుగు రాష్ట్రాల్లో ఆయన పెద్దగా క్రియాశీలకంగా రాజకీయాలు చేసిన దాఖలాలు లవేఉ. రాష్ట్ర కమిటీని కూడా పూర్తిస్ధాయిలో నియమించలేదు. ఏదో ఓ ఐదుగురితో సమన్వయ కమిటీ అనే దాన్ని వేసి రోజులు పార్టీని నెట్టుకొచ్చేస్తున్నారు. పార్టీ ఉందా అంటే ఉంది అన్నట్లుగా నడిపిస్తున్నారు. Also Read: సంచలనం: బీజేపీతో పవన్ కళ్యాణ్ కటీఫ్.. ఇక షర్మిల త్వరలోనే తెలంగాణాలో పార్టీని ప్రకటించబోతున్నారు. పార్టీ ప్రకటించటంతో పాటే […]

YS Sharmila- Pawan
పవన్‌ కల్యాణ్ పార్టీ పెట్టి ఏండ్లు గడుస్తున్నాయి. కానీ.. ఇంతవరకు తెలుగు రాష్ట్రాల్లో ఆయన పెద్దగా క్రియాశీలకంగా రాజకీయాలు చేసిన దాఖలాలు లవేఉ. రాష్ట్ర కమిటీని కూడా పూర్తిస్ధాయిలో నియమించలేదు. ఏదో ఓ ఐదుగురితో సమన్వయ కమిటీ అనే దాన్ని వేసి రోజులు పార్టీని నెట్టుకొచ్చేస్తున్నారు. పార్టీ ఉందా అంటే ఉంది అన్నట్లుగా నడిపిస్తున్నారు.

Also Read: సంచలనం: బీజేపీతో పవన్ కళ్యాణ్ కటీఫ్..

ఇక షర్మిల త్వరలోనే తెలంగాణాలో పార్టీని ప్రకటించబోతున్నారు. పార్టీ ప్రకటించటంతో పాటే ముందుగా రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. తర్వాత వీలైనంత తొందరలో జిల్లాల కమిటీల నియామకం కూడా జరుగుతుందని లోటస్ పాండ్ ముఖ్యులు చెబుతున్నారు. షర్మిల ప్రధాన దృష్టంతా సీమాంధ్ర సెటిలర్లు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ మద్దతుదారులు, అభిమానుల మీదే ఉంది. ఇందులో కూడా ఖమ్మం, నల్గొండ, వరంగల్, జీహెచ్ఎంసీ పరిధిపైనే ఎక్కువగా ఫోకస్‌ చేస్తున్నారు.

Also Read: బండి సంజయ్‌ @ 600 కోట్ల కథ

అయితే.. పవన్‌ కూడా ఇదే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. తొందరలో జరగబోయే ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ల ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా పై జిల్లాల్లో కమిటీలను మాత్రం నియమించారు. ఇటు పవన్ అటు షర్మిల ఆలోచనలు చూస్తుంటే ఇద్దరు కూడా పైన చెప్పిన జిల్లాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టినట్లు సమాచారం. చూడబోతుంటే తెలంగాణలో రాబోవు ఎన్నికల్లో పవన్-, షర్మిల మధ్య ప్రధాన పోటీ ఉండేట్లుగా వాతావరణం కనిపిస్తోంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

పార్టీ పెట్టి ఇన్ని సంవత్సరాలైనా.. పవన్‌ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కానీ లేదా కేసీయార్ పై ఆరోపణలు, విమర్శలు చేయడానికి సాహసించలేదు. కానీ.. ఇంకా పార్టీ పెట్టకుండానే షర్మిల మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలపై ఆరోపణలు మొదలుపెట్టేశారు. చివరకు ఫాం హౌస్ రాజకీయాల గురించి కూడా సెటైర్లు వేస్తున్నారు. మరి సీమాంధ్రలే లక్ష్యంగా ఇద్దరు పోటీపడితే జనాలు ఎవరిని ఆదరిస్తారో చూడాలి. వీరి మధ్య పోటీలో ఎవరిది పైచేయిగా నిలుస్తుందో ఆసక్తికరంగా మారింది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Oktelugu Epaper