spot_img
Homeజాతీయ వార్తలుఇండియాకు అమెరికా మరో వార్నింగ్‌.. ఆ డీల్‌ ఆపాలంట

ఇండియాకు అమెరికా మరో వార్నింగ్‌.. ఆ డీల్‌ ఆపాలంట

India deal with Russia
ఇండియాకు మ‌రోసారి వార్నింగ్ ఇచ్చింది అగ్రరాజ్యం అమెరికా. ర‌ష్యాతో ఇండియా చేసుకున్న ఎస్‌-400 ర‌క్షణ వ్యవ‌స్థ కొనుగోలు డీల్‌పై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ డీల్‌పై ముందుకు వెళ్లాల‌ని నిర్ణయిస్తే ఇండియాపై ఆంక్షలు త‌ప్పవ‌ని యూఎస్ కాంగ్రెష‌న‌ల్ రిపోర్ట్ హెచ్చరించింది. అక్కడి కాంగ్రెస్‌కు రిపోర్ట్ చేసే ది కాంగ్రెష‌న‌ల్ రీసెర్చ్ స‌ర్వీస్ (సీఆర్ఎస్‌) ఈ నివేదిక‌ను రూపొందించింది. ఇదొక స్వతంత్ర సంస్థ కావ‌డం గ‌మ‌నార్హం. ఈ సంస్థే ఇప్పుడు ఇండియాపై ఆంక్షలు విధించాల‌ని సూచిస్తోంది.

Also Read: దేశీ వ్యాక్సిన్లు నీళ్లతో సమానమట..: అప్పుడే బడా కంపెనీల నెగెటివ్‌ ప్రచారం

ర‌ష్యా నుంచి ఇండియా ఎస్‌-400 ర‌క్షణ వ్యవస్థను కొనుగోలు చేయ‌డం అనేది.. కౌంట‌రింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ సాంక్షన్స్ యాక్ట్ కింద ఇండియాపై అమెరికా ఆంక్షల‌కు కార‌ణ‌మ‌వుతుంద‌ని సీఆర్ఎస్ స్పష్టం చేసింది. ఈ సీఆర్ఎస్ ఇచ్చింది అధికారిక నివేదిక కాక‌పోయినా.. దీని ఆధారంగా అమెరికా చ‌ట్ట స‌భ‌ల ప్రతినిధులు నిర్ణయాలు తీసుకునే వీలు క‌లుగుతుంది.

ఇండియా, ర‌ష్యా 2018, అక్టోబ‌ర్‌లో 500 కోట్ల డాల‌ర్ల విలువైన ఎస్‌-400 మిస్సైల్‌ ర‌క్షణ వ్యవ‌స్థ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా ఐదు మిస్సైల్ ర‌క్షణ వ్యవస్థలను ర‌ష్యా.. ఇండియాకు అందించ‌నుంది. అమెరికా మొద‌టి నుంచీ హెచ్చరిక‌లు జారీ చేస్తున్నా.. ఈ డీల్‌పై ముందుకే వెళ్లాల‌ని ఇండియా నిర్ణయించింది. ఇప్పటికే ర‌ష్యాతో ఇదే డీల్ కుదుర్చుకున్న ట‌ర్కీపై అమెరికా ఆంక్షలు విధించిన విష‌యం తెలిసిందే.

Also Read: బీజేపీలో చేరేందుకు సినీ గ్లామర్ల క్యూ

అమెరికా పేట్రియాట్‌, థాడ్‌ రక్షణ వ్యవస్థలను ఇవ్వజూపినా భారత్‌.. రష్యా నుంచి ఎస్‌ 400 కొనుగోలుకే మొగ్గుచూపింది. ఎస్‌ 400 ప్రపంచంలోనే ఎదురులేని రక్షణ వ్యవస్థ. బహుళవిధ రాడార్‌‌, శత్రు విమానాలను స్వయంగా పసిగట్టి ఎదురుదాడి చేసే యంత్రాంగం, విమాన విధ్వంసక క్షిపణులు, నియంత్రణ కేంద్రం ఎస్‌ 400 వ్యవస్థలో అంతర్భాగాలు. ఈ వ్యవస్థ మూడు రకాల క్షిపణులను ప్రయోగించగలదు. శత్రు విమానాలను, పైలట్‌ రహిత యూఏవీలను, క్షిపణులను ఎస్‌ 400 నేలకూల్చేస్తుంది. శత్రు విమానాలు, క్షిపణులు 30 కిలోమీటర్ల ఎత్తున, 400 కిలోమీటర్ల దూరంలో ఉండగానే పసిగట్టి ఎదురుదాడికి దిగగలవు. ఇది ఏకకాలంలో 30 శత్రు విమానాలను, యూఏవీలను, క్షిపణులను ఎదుర్కోగలదు.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

OnePlus N6x

OnePlus N6x: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 2.5 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ధర రూ.20 వేల లోపే..

OnePlus N6x: ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం పెరిగిపోయింది.దీంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. వీరికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటి...
POCO M8 Power

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...
Honda CB500

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...
Social Companionship

Social Companionship: మీకు ఓ తోడు కావాలా.. గంటకు ఇంత.. కొత్త ట్రెండ్

Social Companionship: సాటి మనిషి పక్కన ఉంటే మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఇటువంటి దూరమే కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ మొత్తం...
Andhra Pradesh Voter List

Andhra Pradesh Voter List: ఏపీలో 44.71 లక్షల ఓట్లు ఔట్!

Andhra Pradesh Voter List: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఓట్లు జాబితా నుంచి తొలగించబడ్డాయి. గత కొద్దిరోజులుగా జరుగుతున్న క్షేత్రస్థాయి పరిశీలనలో...
Oktelugu Epaper