The Paradise Review: నేచురల్ స్టార్ నాని హీరో గా నటించిన ‘ది ప్యారడైజ్’ చిత్రం నేడు భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఒక స్టార్ హీరో సినిమా కోసం జనాలు ఎంతలా ఎదురు చూస్తారో , ఈ చిత్రం కోసం కూడా అంతలా ఎదురు చూసారు. నాని సినిమాకు విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 54 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రావడం అనేది సాధారణమైన విషయం కాదు. సౌత్ లో పేరు మోసిన కొంతమంది బడా సూపర్ స్టార్స్ కూడా ఈ రేంజ్ గ్రాస్ ని సొంతం చేసుకోలేదు. అలాంటిది నాని అవలీల గా ఆ గ్రాస్ మార్కు ని అందుకున్నాడంటే , ఈ సినిమా మీద ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి క్రేజ్ తో విడుదలైన ఈ చిత్రం అంచనాలను అందుకుందా లేదా అనేది ఇప్పుడు ఈ రివ్యూ లో చూడబోతున్నాం.
కథ :
కథ విషయానికి వస్తే సాక్షాత్తు పరమశివుడిని మింగిన సుబ్బమ్మ అనే దేవత హైదరాబాద్ లోని ప్యారడైజ్ అనే ప్రాంతం లో శికంజి మాలిక్ (మోహన్ బాబు ) అనే సంపన్న వ్యక్తి ఆధీనం లో ఉంటుంది. 200 ఏళ్ళ నుండి మాలిక్ వంశీయులు ఆ ప్యారడైజ్ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉంటారు. అణువణువునా వారిలో అహంకారం నిండిపోయి ఉంటున్ది. అయితే ఈ ప్యారడైజ్ ప్రాంగణం లో సమ్మక్క (సోనాలి కులకర్ణి) అనే సవారీ వర్గానికి చెందిన మహిళ , తన జాతి గుర్తింపు కోసం పోరాడుతూ ఉంటుంది. సమ్మక్క కొడుకే జడల్ (నాని). ఈయన చిన్న తనం నుండే తన తల్లిని ద్వేషిస్తూ ఉంటాడు. అలా కాలం గడిచే కొద్దీ భారత ప్రభుత్వం సవారి జాతిని దేశ ద్రోహులుగా గుర్తిస్తుంది. అందుకు కారణం ఏంటి?, దీనిపై హీరో ఎలాంటి పోరాటం చేసాడు?, ఎందుకు హీరో చిన్నతనం నుండి తన తల్లిని ద్వేషిస్తున్నాడు? వంటి అంశాలను వెండితెర మీద చూడాల్సిందే.
విశ్లేషణ :
తెలంగాణ ప్రాంతం లోని ఎమోషన్స్ ని తన సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో కూడా అదే చేసాడు. కొన్ని సన్నివేశాలు అద్భుతంగా పేలాయి. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ వరకు వచ్చే సన్నివేశం , థియేటర్స్ లోని ఆడియన్స్ కి అద్భుతమైన థియేట్రికల్ అనుభూతిని ఇస్తుంది. ఆ సీక్వెన్స్ కి అనిరుద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. నాని నటన కూడా కొత్తగా అనిపించింది. ఇదే రేంజ్ లో సెకండ్ హాఫ్ కూడా ఉంటే , సినిమా ఎక్కడికో వెళ్లి ఆగుతుంది అనే ఫీలింగ్ ని ఆడియన్స్ లో కలిగించింది. కానీ డైరెక్టర్ శ్రీకాంత్ సెకండ్ హాఫ్ ని సరిగా డీల్ చేయలేకపోయాడు అనే చెప్పాలి.
అసలు తానూ చెప్పాలని అనుకున్న పాయింట్ ని సరిగా చెప్పలేదు. ఫస్ట్ హాఫ్ కే సినిమా అయిపోయింది అనే ఫీలింగ్ కలుగుతుంది. అందుకే సెకండ్ హాఫ్ ని బాగా సాగదీసినట్టుగా అనిపించింది. ఆడియన్స్ సహనానికి పరీక్ష పెట్టినట్టుగా అనిపించింది. ఈ సినిమాకు ఏదైనా పెద్ద మైనస్ ఉందంటే , అది నవీన్ నూలి ఎడిటింగ్ అనే చెప్పాలి. సోషల్ మీడియా లో కూడా ఆయన పైనే ఎక్కువగా నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్. ఇక ఆ తర్వాత అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని సన్నివేశాలకు బాగానే వర్కౌట్ అయ్యింది కానీ , అత్యధిక సన్నివేశాలకు అసలు వర్కౌట్ అవ్వలేదు. మ్యూజిక్ మిక్సింగ్ సరిగా లేదనే భావన ప్రేక్షకుల్లో కలిగింది. నాని సాధ్యమైనంత వరకు తన భుజాలపై ఈ సినిమాని మోసే ప్రయత్నం చేసాడు. యాక్షన్ సన్నివేశాలన్నీ అదిరిపోయాయి. కానీ సరైన స్టోరీ లేకపోతే ఎన్ని యాక్షన్ సన్నివేశాలు తీసినా వర్కౌట్ అవ్వదు అని చెప్పడానికి , ఈ సినిమా ఒక ఉదాహరణ.
ఓవరాల్ గా నాని పడిన కష్టానికి ఒకసారి కచ్చితంగా ఈ సినిమాని థియేటర్ లో చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ ఆడియన్స్ ని ఒక రేంజ్ లో అలరిస్తుంది . పాటలు కూడా బాగున్నాయి. అంచనాలు తక్కువగా పెట్టుకొని వెళ్తే , యావరేజ్ గా ఉంది అనే ఫీల్స్ తో థియేటర్ నుండి బయటకు వస్తారు. భారీ అంచనాలు పెట్టుకుంటే మాత్రం నిరాశ చెందుతారు. ఓవరాల్ గా ఈ చిత్రానికి మా ఓకే తెలుగు ఇస్తున్న రేటింగ్ 2.5..
మరి రెగ్యులర్ షోస్ ద్వారా ఈ చిత్రానికి ఆడియన్స్ నుండి ఎలాంటి రియాక్షన్స్ వస్తుందో చూడాలి. భారీ హైప్ తో వచ్చిన సినిమా కాబట్టి , వీకెండ్ వరకు కచ్చితంగా ఈ చిత్రానికి మంచు వసూళ్లు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత ఫుల్ రన్ లో ఎంత వసూళ్లను రాబడుతుందో చూడాలి.