Asus Laptops : ల్యాప్‌టాప్ కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి ప్రముఖ టెక్ సంస్థ Asus గుడ్ న్యూస్ చెప్పింది. గూగుల్‌తో కలిసి ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ ద్వారా ఎంపిక చేసిన Asus, ROG ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేసే కస్టమర్లకు Google AI Pro లేదా Google AI Plus సబ్‌స్క్రిప్షన్‌ను మూడు నెలల పాటు అదనంగా ఎలాంటి ఛార్జీలు లేకుండా అందించనుంది. ఈ ఆఫర్ కొత్త కస్టమర్లతో పాటు ఇప్పటికే Asus ల్యాప్‌టాప్‌లు కలిగి ఉన్న అర్హత ఉన్న వినియోగదారులకు కూడా వర్తిస్తుంది.
ఈ ఆఫర్‌లో భాగంగా 2025, 2026లో విడుదలైన ఎంపిక చేసిన Asus, ROG ల్యాప్‌టాప్‌లు అర్హత పొందుతాయి. 2027లో విడుదల కానున్న కొన్ని మోడళ్లకు కూడా ఈ ప్రయోజనం వర్తిస్తుందని Asus వెల్లడించింది. ROG, TUF Gaming, ProArt, Zenbook, Vivobook సిరీస్‌లలోని ఎంపిక చేసిన మోడళ్లను ఈ ఆఫర్ కోసం పరిగణించారు.
Google AI Proలో ఏం లభిస్తుంది?
Google AI Pro సబ్‌స్క్రిప్షన్‌లో Gemini యాప్, Deep Research, Google Flow, Gemini Omni, Nano Banana 2, Lyria 3 వంటి AI ఫీచర్లకు యాక్సెస్ లభిస్తుంది. అలాగే Google యాప్స్‌లో Gemini ఇంటిగ్రేషన్, Gemini Notebook వంటి ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు. డెవలపర్లు, AI ఏజెంట్ల కోసం Google Antigravity, Jules, AI Studio వంటి అదనపు సేవలకు కూడా విస్తృత యాక్సెస్ లభిస్తుంది.
Google AI Pro ప్లాన్‌లో 5TB క్లౌడ్ స్టోరేజ్ కూడా ఉంటుంది. దీని సాధారణ ధర నెలకు రూ.1,950గా ఉంది. మరోవైపు Google AI Plus ప్లాన్‌లో 400GB క్లౌడ్ స్టోరేజ్తో పాటు గూగుల్ AI టూల్స్‌కు యాక్సెస్ లభిస్తుంది. దీని సాధారణ ధర నెలకు రూ.399.
ఏ Asus ల్యాప్‌టాప్‌లకు ఆఫర్?
Asus ProArt, Zenbook, Vivobook, ROG, TUF సిరీస్‌లలోని ఎంపిక చేసిన మోడళ్లకు Google AI Pro అందుబాటులో ఉంటుంది. Vivobook 14, Vivobook 16, Vivobook Go వంటి కొన్ని మోడళ్లతో పాటు M-Series, X-Series, E-Seriesలోని ఎంపిక చేసిన ల్యాప్‌టాప్‌లకు Google AI Plus లభిస్తుంది. అయితే మోడల్, ప్రాంతం, ఆఫర్ అందుబాటులో ఉన్న సమయం ఆధారంగా అర్హత మారవచ్చని Asus తెలిపింది.
ఎలా రీడీమ్ చేసుకోవాలి?
అర్హత ఉన్న కస్టమర్లు MyAsus యాప్ ద్వారా ఈ ఆఫర్‌ను పొందవచ్చు. ముందుగా Asus IDతో సైన్ ఇన్ చేయాలి. అనంతరం User Centre → Member Exclusive Couponsలోకి వెళ్లి Google AI Offer కార్డును ఎంచుకోవాలి. అక్కడ Redeem Nowపై క్లిక్ చేస్తే Google Gift Box రిడెంప్షన్ పేజీకి వెళ్తారు. Google అకౌంట్‌తో సైన్ ఇన్ చేసి, చెల్లింపు విధానాన్ని నమోదు చేసి Start Trialపై క్లిక్ చేయాలి.
Asus వెల్లడించిన వివరాల ప్రకారం ఈ Google AI ప్రోగ్రామ్ ఆగస్టు 10, 2026 నుంచి ఆగస్టు 9, 2027 వరకు కొనసాగుతుంది. అయితే మూడు నెలల ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను పొందేందుకు ముందుగా మీ ల్యాప్‌టాప్ మోడల్ ఈ ఆఫర్‌కు అర్హత పొందుతుందో లేదో Asus అధికారిక వెబ్‌సైట్ లేదా MyAsus యాప్‌లో తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి.