spot_img
Homeఆంధ్రప్రదేశ్‌దేవుళ్లపై ఎందుకీ కోపం.. మళ్లీ విగ్రహాల ధ్వంసం

దేవుళ్లపై ఎందుకీ కోపం.. మళ్లీ విగ్రహాల ధ్వంసం

Lakshmi Narasimha Swamy statue
ఆంధ్రప్రదేశ్‌లో విగ్రహాల ధ్వంసం ఏమాత్రం ఆగడం లేదు. రామతీర్థం, విజయవాడ ఘటనలు మరువక ముందే తాజాగా ప్రకాశం జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది. సింగరాయకొండ మండలం పాతసింగరాయకొండ గ్రామంలో దక్షిణ సింహాచలంగా పేరొందిన వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ముఖద్వారంపై ఉన్న లక్ష్మీనృసింహస్వామి, రాజ్యలక్ష్మి, గరుత్మంతుడి విగ్రహాల చేతులు విరిగిపోయి కనిపించాయి. మంగళవారం ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ సంపత్‌కుమార్‌ సంఘటనా స్థలానికి చేరుకొని ముఖద్వారం, విగ్రహాలను పరిశీలించారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగానే ధ్వంసం చేశారా?.. లేక వాతంటవే విరిగిపోయాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న అధికార వైఎస్సార్‌సీపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు.

Also Read: రూట్‌ మార్చిన టీడీపీ..: టార్గెట్‌ తిరుపతి

ఇదిలా ఉండగా.. నెల్లూరు జిల్లా విజయనగరం జిల్లాలో కోదండ రామస్వామి విగ్రహం ధ్వంసం ఘటనకు నిరసనగా బీజేపీ, జనసేన తలపెట్టిన రామతీర్థ ధర్మయాత్ర ఉద్రిక్తంగా మారింది. కార్యక్రమంలో పాల్గొనేందుకు సన్నద్ధమవుతున్న నాయకులు పోలీసులు గృహ నిర్బంధం చేశారు. రామతీర్థం కూడలి వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును పోలీసులు అడ్డుకున్నారు. సెక్షన్‌ 30 అమలులో ఉన్నందున ఎలాంటి ర్యాలీలు నిర్వహించొద్దని ఆదేశించారు. ఈ సందర్భంగా వీర్రాజుతో పాటు పలువురిని అదుపులోకి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది.

Also Read: వారందరికీ సీబీఐ నోటీసులు..: ఎందుకంటే..?

ఏమైంది.. అసలు ఏమైంది.. ఏపీలో రోజుకొకటి చొప్పున హిందూ ఆలయాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఓ వైపు రాష్ట్రమంతటా ఇదే విషయమై రచ్చరచ్చ నడుస్తుంటే.. దుండగులు మాత్రం తమ పని తాము చేసుకుపోతున్నారు. నిద్రలేచి చూసే సరికి ఎక్కడో ఒక చోట ఇలాంటి వార్త వినాల్సి వస్తోంది. మరోవైపు.. విగ్రహాల ధ్వంసంపై ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నా.. ఇప్పటివరకు ఒక్క నిందితుడిని కూడా పట్టుకోలేకపోయారు. చివరికి ఈ విగ్రహాల ధ్వంసం.. ఆలయాలపై దాడులు ఎటు దారితీస్తాయో తెలియకుండా ఉంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Venu Swamy Bigg Boss Remuneration

Venu Swamy Prediction : కాక్రోచ్ జనతా పార్టీ భవిష్యత్తుపై వేణుస్వామి హాట్ కామెంట్స్.. వీడియో వైరల్..

Venu Swamy Prediction : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఒకప్పుడు ఎలాంటి వివాదాస్పద జాతకాలు చెప్పేవాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన చెప్పే జాతకాలు కారణంగా సోషల్ మీడియా లో తీవ్రమైన...

Narendra Modi : వెన్నుచూపని మోడీ తగ్గాడా.. కాక్రోచ్ ల చేతిలో ఓడిపోయాడా

Narendra Modi : అవి అసాంఘిక శక్తులని తెలుసు. అవి చేస్తున్న ఉద్యమం సో కాల్డ్ అని కూడా తెలుసు. దానిని ఎలా వంచాలో కూడా తెలుసు. అయినప్పటికీ నరేంద్ర మోడీ బయపడ్డారు....

Dharmendra Pradhan : ఇది విద్యార్థుల విజయం ప్రజాస్వామ్య విజయం

Dharmendra Pradhan : ప్రజాస్వామ్యంలో ప్రజల స్వరం, ముఖ్యంగా యువత గొంతు, పాలకులను నిర్ణయాలు మార్చుకునేలా చేయగలదని మరోసారి రుజువైంది. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణపై వ్యక్తమైన అసంతృప్తి, వరుసగా ప్రశ్నాపత్రాల లీకేజీ...
OnePlus N6x

OnePlus N6x: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 2.5 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ధర రూ.20 వేల లోపే..

OnePlus N6x: ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం పెరిగిపోయింది.దీంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. వీరికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటి...
POCO M8 Power

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...
Oktelugu Epaper