spot_img
Homeజాతీయ వార్తలుమరో కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ

మరో కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ

TTDతిరుమల తిరుపతి దేవస్థానంలోని స్థానిక ఆలయాల విలువలను అందరికి తెలియజేసి భక్తుల సంఖ్య పెంచేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఆలయాల ప్రాశస్త్యాన్ని తెలియజెప్పే ఉద్దేశంతో స్థల పురాణాలు ప్రచారం చేసి పర్యాటక, ఆర్టీసీ శాఖలు సమన్వయంతో పని చేయాలని టీటీడీ ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

ఆలయాల చరిత్రను ప్రచారం చేసే నిమిత్తం టీటీడీ వెబ్ సైట్, శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని సంకల్పించారు. తిరుపతిలో భక్తులు బస చేసే నివాసాల వద్ద ప్రచార హోర్డింగ్ లు ఏర్పాటు చేయాలని భావించింది. ఇప్పటికే బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో ఆలయాల గురించి ప్రచారం చేసేందుకు పర్యాటక, ఆర్టీసీ అధికారులు ప్యాకేజీ టూర్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారు.

అవసరాలను బట్టి సేవలు విస్తరించాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా ఆలయ చరిత్రపై ఓ పుస్తకం తయారు చేసి ఎప్పటికప్పుడు సిద్ధం చేయాలని సూచిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో ఉన్న ఆలయాల ప్రాభవంపై ప్రాధాన్యం కలిగేలా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్థానిక దేవాలయాలను తీర్థయాత్ర స్థలాలుగా మార్చేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. శ్రీనివాస మంగాపురం, అప్పలాయగుంట ఆలయంలో కల్యాణకట్ట ఏర్పాటు చేయాలని చూస్తోంది.

ఆలయాలకు కానుకగా వచ్చే గోవులను రక్షించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచిస్తోంది. ఆలయంకు సంబంధించిన వ్యవసాయ భూములలో పండించిన పంటలు ఆలయ ప్రసాదాల తయారుకు ఉపయోగించుకునేలా చూస్తున్నారు. ఆలయాలకు వచ్చే ఆదాయం, భక్తుల సంఖ్యను బట్టి గ్రేడ్లుగా విభజించాలని భావిస్తోంది. అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలని పేర్కొంది. తిరుమల పర్యాటక శాఖ అభివృద్ధికి భక్తులను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా దేవాలయాల ప్రాముఖ్యతను భక్తులకు తెలియజేయాలని నిర్ణయించింది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Kallanai Dam

Kallanai Dam: దేశంలో అతి పురాతనమైన డ్యామ్ ఎక్కడుందో తెలుసా.. దీనిని ఎలా నిర్మించారంటే..

Kallanai Dam: భారతదేశం వ్యవసాయ పంటలపై ఎక్కువగా ఆధారపడినందున.. ఇక్కడ నీటి నిల్వ చేయడం చాలా అవసరం. అలాగే ఈ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి నీటి ప్రాజెక్టుల అవసరాన్ని పురాతన కాలంలోనే...
Godavari Pulasa

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....
Adani Group Airlines

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...
Srirastu Meaning

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...
Amazon Employee Quits Job

Amazon Employee Quits Job: అమెజాన్ లో రూ.35 లక్షల వేతనం వదిలి.. మనశ్శాంతి కోసం ఈ టెకీ...

Amazon Employee Quits Job: ఆమెకు ఏడాదికి రూ. 30 లక్షల వేతనం.. ఆమె భర్తకు కూడా మంచి ఉద్యోగం.. ఇద్దరికీ కలిపి సుమారు రూ. 65 లక్షల వరకు ఆదాయం.. సాధారణంగా...
Oktelugu Epaper