YCP anti-Hindu allegations: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ దూకుడు రాజకీయాలు ఆ పార్టీకి చేటు తెచ్చి పెట్టేలా ఉన్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి తనదైన రాజకీయాలు చేశారు జగన్మోహన్ రెడ్డి. 2024 వరకు ఆయన వేసిన ప్రతి అడుగు సక్సెస్ అయింది. కానీ ఒక్క ఓటమితో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చుట్టూ అనేక రకాలైన వివాదాలు ముసురుకుంటున్నాయి. ముఖ్యంగా హిందూ సమాజం దూరమయ్యేలా కనిపిస్తోంది. 2024 ఎన్నికల వరకు హిందూ వ్యతిరేక ముద్ర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఉంది. కానీ అది బయటపడకుండా.. ప్రభావం చూపకుండా జగన్మోహన్ రెడ్డి బాగానే మేనేజ్ చేశారు. అయితే 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత జరిగిన పరిణామాలతో వైసిపి హిందూ వ్యతిరేక పార్టీగా క్రమేపి ప్రజల్లోకి వెళ్లిపోతుంది. జగన్మోహన్ రెడ్డి దీనిని గుర్తించకపోతే మాత్రం ఆ పార్టీకి భారీ నష్టం తప్పదు.
వితండవాదంతో..
టీటీడీ( Tirumala Tirupati Devasthanam) లడ్డుకు సంబంధించి నెయ్యి కల్తీ వ్యవహారం ఆ పార్టీని కుదిపేస్తోంది. దాని నుంచి బయటపడేందుకు ఆ పార్టీ అనుసరిస్తున్న విధానాలే ఇప్పుడు ఇబ్బందికరంగా మారాయి. తప్పును ఒప్పుకొని క్షమాపణ కోరితే సరిపోయేది. కానీ అలా చేయడం లేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులుగా ముద్రపడిన కొందరు కన్వర్టర్ క్రిస్టియన్ ప్రముఖులు ఈ వివాదాల్లోకి ప్రవేశిస్తున్నారు. కల్తీ పెద్ద తప్పు కాదన్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. వీడియోలు కూడా రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇలా చెబుతున్న వారిని.. హిందూ సమాజం ఒక అభిప్రాయానికి వస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో ఖచ్చితంగా తప్పు జరిగి ఉంటుందన్న నిర్ధారణకు కూడా వస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే హిందుత్వ వాదానికి ఇష్టపడేవారు ఇక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు చూసే పరిస్థితి లేదు.
ప్రసాదం విశిష్టతపై..
ఇటీవల సోషల్ మీడియా( social media) వేదికగా రావణ్ అలియాస్ జోసెఫ్, జడ శ్రవణ్, మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ వంటి వ్యక్తులు చేస్తున్న వాదనలు.. హిందూ సమాజానికి ఆగ్రహం తెచ్చి పెట్టేలా ఉన్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని సమర్థిస్తున్న ఈ ప్రముఖుల్లో చాలామంది క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నారు. వీరికి తిరుమల పవిత్రతపై గానీ.. ప్రసాద విశిష్టతపై గానీ కనీస గౌరవం లేదన్నది బహిరంగ రహస్యం. వీరు ప్రసాదాన్ని స్వీకరించరు. కనీసం ఆ క్షేత్రాన్ని దర్శించరు. కానీ ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై పడిన మచ్చను.. వెనుకేసుకొస్తున్నారు. చాలా తేలిగ్గా తీసుకొని సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగానే వారిని ప్రయోగిస్తున్నట్లు ప్రజలు అనుమానిస్తున్నారు. అయితే ఎప్పుడు దేవుడు ఉన్నాడని జగన్మోహన్ రెడ్డి తరచు వ్యాఖ్యానిస్తుంటారు. అయితే అదే దేవుడు ఇప్పుడు గుర్తిస్తున్నాడు అన్న విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి గుర్తించుకోవాలి. లేకుంటే హిందువు అనేవాడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించడం ఖాయమన్న విశ్లేషణలు వస్తున్నాయి.