Homeఆంధ్రప్రదేశ్‌TTD: టీటీడీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగికి నెలకు 6433 దర్శన టిక్కెట్లు.. ఇది ఎలా?!

TTD: టీటీడీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగికి నెలకు 6433 దర్శన టిక్కెట్లు.. ఇది ఎలా?!

TTD: ఏపీలో( Andhra Pradesh) నెయ్యి కల్తీ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. నెయ్యిలో జంతు కొవ్వు కలపలేదు అన్నది సిబిఐ చెప్పినట్లు వైసిపి చెప్తోంది. టిడిపి జంతు కొవ్వు కలిపారు అని ఆరోపిస్తోంది. సిబిఐ సైతం పామాయిల్ తో కూడిన రసాయన మిశ్రమాలు కలిపారని.. అసలు పాలతో తయారు చేసిన నెయ్యి అది కాదు అని స్పష్టం చేసింది. అయినా సరే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వినిపించుకోవడం లేదు. మరోవైపు ఈ కేసులో నిందితుడిగా ఉన్నారు చిన్నప్పన్న. ఆయన టీటీడీ మాజీ అధ్యక్షుడు వై వి సుబ్బారెడ్డి అనుచరుడు, బినామీ అన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఆ చిన్న అప్పన్న ఎవరో తనకు తెలియదు అని వైవి సుబ్బారెడ్డి బల్లగుద్ది మరి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆసక్తికర అంశం తెరమీదకు వచ్చింది. వై వి సుబ్బారెడ్డి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఒక్క నెలలోనే చిన్న అప్పన్నకు 6433 సుపధం టిక్కెట్లు జారీ చేశారంటే టీటీడీలో చినఅప్పన్న పవర్ ఇట్టే అర్థమయిపోతుంది.

* భారీ స్థాయిలో పరపతి..
ఎంతటి పెద్దవారు అయినా పదుల సంఖ్యలో మాత్రమే టీటీడీ( Tirumala Tirupati Devasthanam) టికెట్లు ఒక నెలలో పొందగలరు. అటువంటిది చిన్న అప్పన్న ఏకంగా 6000 టిక్కెట్లు పొందాలంటే టీటీడీలో ఆయన పరపతి ఏ పాటిదో అర్థం అవుతోంది. అంటే నాలుగేళ్ల కాలంలో ఇంకెన్ని వేలు, లక్షల టిక్కెట్లు జారీ చేసి ఉంటారో అన్న ప్రశ్న కచ్చితంగా తలెత్తుతుంది. సిఫార్సు ఎవరు చేసినా.. వారి పేరుతో రాసి టిక్కెట్లు జారీ చేసే సంప్రదాయం టిటిడిలో ఉంది. ఒక్క చిన్నప్పన్న పేరుతోనే ఇన్ని వేల టిక్కెట్లు ఒక్క నెలలో జారీ అయ్యాయి అంటే.. కచ్చితంగా కల్తీ నెయ్యిలో ఆయన పేరు బయటకు వచ్చిందంటే ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అసలు చిన్న అప్పన్న ఎవరో నాకు తెలియదు అంటూ వాదన వినిపించారు సుబ్బారెడ్డి. 2018 వరకు మాత్రమే పిఎ గా పని చేశాడని మరోసారి చెప్పుకొచ్చారు. కానీ టీటీడీ టికెట్ల జారీ చూస్తుంటే మాత్రం ఇది ఎంత మాత్రం నిజం కాదని తేలిపోయింది.

* రోజుకు ఆరు మాత్రమే..
గత వైసిపి ప్రభుత్వంలో వక్కో ఎమ్మెల్యే కు రోజుకు ఆరు సుపధం టికెట్లు మాత్రమే జారీ చేసేవారు. అది కూడా వారం రోజులకు ఐదు రోజులు మాత్రమే. కానీ చినప్పన్నకు నెల రోజుల వ్యవధిలోనే 6000 టిక్కెట్ల జారీ అంటే చిన్న విషయం కాదు. 2021 సెప్టెంబర్ లో నమోదయింది ఈ జారీ ప్రక్రియ. అంటే రోజుకు 214 టికెట్లు ఆయన పేరుట జారీ అయ్యాయి అన్నమాట. టిటిడి అధ్యక్షుడిగా ఉన్న వైవి సుబ్బారెడ్డి అండ లేకుండా.. ఏపీ భవన్లో లైసెన్ ఆఫీసర్ గా పని చేసే ఒక సాధారణ ఔట్సోర్సింగ్ ఉద్యోగి పేరుతో.. ఇన్ని వేల టిక్కెట్ల జారీ జరిగింది అంటే ఎవరైనా, ఎవరికైనా అనుమానం రాక తప్పదు. వై వి సుబ్బారెడ్డి తనకు తెలియదన్న మాట మరిచి.. మరింకేమైనా మాటలు చెబితే బాగుంటుంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Jogi Ramesh

Jogi Ramesh: జోగి రమేష్ మతమార్పిడి.. దుర్గమ్మ వద్ద ప్రమాణం!

Jogi Ramesh: వైసీపీలో పదవి కావాలంటే మతం మారాలా? క్రిస్టియన్ మతం తీసుకోవాల్సిందేనా? వైసీపీలో ఉన్న నేతల్లో ఎక్కువమంది అలానే చేసారా? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో దీనిపై చర్చ నడుస్తోంది. తాజాగా మాజీ...
YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy: జగన్ జైలు పరామర్శలు.. వైసీపీలో కొత్త చర్చ!

YS Jagan Mohan Reddy: వైయస్ జగన్మోహన్ రెడ్డి మొండివాడు. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలు స్వయంగా చెబుతారు. అయితే ఆయన మొండితనం ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావచ్చు. కానీ అదే...
Bonda Umamaheswara Rao

Bonda Uma Maheswara Rao: బోండా ఉమా పై వైసీపీ స్కెచ్!

Bonda Uma Maheswara Rao: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా టిడిపిలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. దీనిపై టిడిపి హై కమాండ్ ఆగ్రహంగా...
Loan Advice

Loan Advice: అప్పు ఇవ్వాలా? వద్దా? ఇస్తే ఏం జరుగుతుంది?

Loan Advice: డబ్బు ప్రతి ఒక్కరికీ అవసరం ఉంటుంది. అయితే కొందరి వద్ద తక్కువగా.. మరికొందరి వద్ద ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో డబ్బు ఉన్న వారి వద్ద లేనివారు అప్పుగా...
AP Ration Cards

AP Ration Cards: ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్!

AP Ration Cards: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మరింత నాణ్యమైన బియ్యం అందించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు స్టీమ్డ్ రైస్ అందించనుంది. మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా ఈ...
Oktelugu Epaper